ప్రతి మనిషికీ బతికే హక్కున్నట్టే ప్రేమించే హక్కు కూడా ఉంటుంది. అది స్త్రీ పురుషులకన్నా కాస్త భిన్నంగా ఉన్నవారికి దక్కడం లేదు. వారిని అర్ధం చేసుకోకపోగా చిత్రమైన కారణాలతో వారిని మానసిక శారీరక హింసలకు గురి చేస్తున్నారు. వారి గోడును వినిపించుకోవడానికి వారి దగ్గర భాష కూడా లేని వైనాన్ని మనం గమనించాలి. నా కథల ద్వారా స్వలింగులకు, ట్రాన్స్ జెండర్స్ కీ సంఘీభావం తెలుపుతాను.
మారే కాలాన్ని బట్టి నేను స్త్రీ వాదిని మాత్రమేనా బలమైన మానవవాదినా అని ఆలోచించుకునే అవసరం కనబడుతోంది. స్త్రీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయంటే మగవారి ఆలోచనా విధానం మారుతోందనే చెప్పాలి. పిల్లల్ని చూపులతోనే బెదిరించే తండ్రులు ఈ తరంలో అరుదే. వంటగదిలో ప్రధాన పాత్ర కాకపోయినా సహాయ పాత్ర పోషిస్తున్నారు నేటి పురుషులు. ఒక పక్క స్త్రీల మీద దాడులు పెరుగుతున్నా స్త్రీలని గౌరవించి సమానత్వంతో చూసే పురుషులు, యువకులు కూడా ఎక్కువే ఉన్నారు. కుటుంబ పోషణ వల్ల తీవ్రమైన మానసిక వత్తిడికి లోనై, కుటుంబం చేత నిర్లక్ష్యానికి గురయ్యే మగవారూ లేకపోలేదు. అటువంటి ఉదంతాలకి నా కథలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రతీ స్త్రీ దేవతా కాదు ప్రతీ పురుషుడూ రాక్షసుడు కాదు కాబట్టి పురుషులకి నా కథల్లో గౌరవ ప్రదమైన స్థానం ఉంటుంది.
ప్రతి మనిషికీ బతికే హక్కున్నట్టే ప్రేమించే హక్కు కూడా ఉంటుంది. అది స్త్రీ పురుషులకన్నా కాస్త భిన్నంగా ఉన్నవారికి దక్కడం లేదు. వారిని అర్ధం చేసుకోకపోగా చిత్రమైన కారణాలతో వారిని మానసిక శారీరక హింసలకు గురి చేస్తున్నారు. వారి గోడును వినిపించుకోవడానికి వారి దగ్గర భాష కూడా లేని వైనాన్ని మనం గమనించాలి. నా కథల ద్వారా స్వలింగులకు, ట్రాన్స్ జెండర్స్ కీ సంఘీభావం తెలుపుతాను. మారే కాలాన్ని బట్టి నేను స్త్రీ వాదిని మాత్రమేనా బలమైన మానవవాదినా అని ఆలోచించుకునే అవసరం కనబడుతోంది. స్త్రీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయంటే మగవారి ఆలోచనా విధానం మారుతోందనే చెప్పాలి. పిల్లల్ని చూపులతోనే బెదిరించే తండ్రులు ఈ తరంలో అరుదే. వంటగదిలో ప్రధాన పాత్ర కాకపోయినా సహాయ పాత్ర పోషిస్తున్నారు నేటి పురుషులు. ఒక పక్క స్త్రీల మీద దాడులు పెరుగుతున్నా స్త్రీలని గౌరవించి సమానత్వంతో చూసే పురుషులు, యువకులు కూడా ఎక్కువే ఉన్నారు. కుటుంబ పోషణ వల్ల తీవ్రమైన మానసిక వత్తిడికి లోనై, కుటుంబం చేత నిర్లక్ష్యానికి గురయ్యే మగవారూ లేకపోలేదు. అటువంటి ఉదంతాలకి నా కథలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రతీ స్త్రీ దేవతా కాదు ప్రతీ పురుషుడూ రాక్షసుడు కాదు కాబట్టి పురుషులకి నా కథల్లో గౌరవ ప్రదమైన స్థానం ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.