పూర్వరంగం
దేశంలో రాజకీయ సాంఘిక పరిస్థితులుఈస్టు ఇండియా కంపెనీ వారు వర్తకానికని భారత గడ్డ పై అడుగు పెట్టారు. క్రమంగా వర్తకాన్ని పక్కన పెట్టి భారతదేశంలో దోపిడీ విధానం మొదలు పెట్టారు. క్రమంగా భారత దేశంతో పాటు ఆంధ్ర దేశంలోను దారిద్ర్యం చోటు చేసుకుంది. ఆంగ్లేయులు క్రమంగా భారతదేశాన్ని ఆక్రమించి పాలన మొదలు పెట్టారు. తమ పాలన సుస్థిరం చేసుకోడానికి ఆంగ్లేయులు ఈ దేశ ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడం మొదలు పెట్టారు.
ఈ విధానంతో పాటు విద్యావిషయంలోను తలదూర్చటం మొదలు పెట్టారు. క్రైస్తవ మతాధికారులకు భారతదేశంలో విద్యాసంస్థలు స్థాపించే హక్కును అంటకట్టుట వలన భారతీయులకు ఎనలేని నష్టం కలిగింది. అమాయకులైన భారతీయులెందరో క్రైస్తవ మతమార్పిడికి గురయ్యారు. దీనికి తోడు భారతదేశంలో ప్రోత్సహించేవారు లేక పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయి. సుఖవంతమైన భారతీయుల జీవన విధానం కష్టాల పాలయింది.
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు ముందే ఆంధ్రదేశంలో 1853, 18 సంవత్సరాలలో కాశీపురం, అనకాపల్లి మొదలైన జమిందారులు తిరుగుబాటు చేశారు. అతి క్రూరంగా వారిని ఆంగ్ల ప్రభుత్వం అణచివేసింది. సుమారు మూడు సంవత్సరాలు సాగిన ఈ పోరాటం వల్ల ప్రజలు మరింత కష్ట నష్టాలకు గురయ్యారు. దాని వల్ల మరింత దీన స్థితికి దిగజారారు.
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుతో ఆంధ్రదేశంలోని పర్లాకుమిడి లోని గిరిజన, గోదావరి జిల్లాలోని కరటూరి గ్రామాధికారి చేసిన తిరుగుబాటును ఆంగ్ల ప్రభుత్వం అణచివేసింది.............
పూర్వరంగం దేశంలో రాజకీయ సాంఘిక పరిస్థితులు ఈస్టు ఇండియా కంపెనీ వారు వర్తకానికని భారత గడ్డ పై అడుగు పెట్టారు. క్రమంగా వర్తకాన్ని పక్కన పెట్టి భారతదేశంలో దోపిడీ విధానం మొదలు పెట్టారు. క్రమంగా భారత దేశంతో పాటు ఆంధ్ర దేశంలోను దారిద్ర్యం చోటు చేసుకుంది. ఆంగ్లేయులు క్రమంగా భారతదేశాన్ని ఆక్రమించి పాలన మొదలు పెట్టారు. తమ పాలన సుస్థిరం చేసుకోడానికి ఆంగ్లేయులు ఈ దేశ ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడం మొదలు పెట్టారు. ఈ విధానంతో పాటు విద్యావిషయంలోను తలదూర్చటం మొదలు పెట్టారు. క్రైస్తవ మతాధికారులకు భారతదేశంలో విద్యాసంస్థలు స్థాపించే హక్కును అంటకట్టుట వలన భారతీయులకు ఎనలేని నష్టం కలిగింది. అమాయకులైన భారతీయులెందరో క్రైస్తవ మతమార్పిడికి గురయ్యారు. దీనికి తోడు భారతదేశంలో ప్రోత్సహించేవారు లేక పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయి. సుఖవంతమైన భారతీయుల జీవన విధానం కష్టాల పాలయింది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు ముందే ఆంధ్రదేశంలో 1853, 18 సంవత్సరాలలో కాశీపురం, అనకాపల్లి మొదలైన జమిందారులు తిరుగుబాటు చేశారు. అతి క్రూరంగా వారిని ఆంగ్ల ప్రభుత్వం అణచివేసింది. సుమారు మూడు సంవత్సరాలు సాగిన ఈ పోరాటం వల్ల ప్రజలు మరింత కష్ట నష్టాలకు గురయ్యారు. దాని వల్ల మరింత దీన స్థితికి దిగజారారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుతో ఆంధ్రదేశంలోని పర్లాకుమిడి లోని గిరిజన, గోదావరి జిల్లాలోని కరటూరి గ్రామాధికారి చేసిన తిరుగుబాటును ఆంగ్ల ప్రభుత్వం అణచివేసింది.............© 2017,www.logili.com All Rights Reserved.