ఆశాజీవి
వెస్ట్ ఫేలియాలోని థండర్-టెన్-ట్రాంక్ గ్రామీణ జమీందారుగారి కోటలో మన కధానాయకుడి బాల్యం గడిచింది. స్వభావ సిద్ధంగా అతడు అతి మంచివాడు. ఈ అతి మంచి లక్షణాలు మనకు అతని ముఖం చూడగానే అవగతమౌతాయి. సద సద్విచక్షణ, నిరాడంబరత అతనిలో మేళవించాయి. అందుకనే అతనికి కాండైడ్ (నిష్కపటి) అని నామకరణం చేసివుంటారు. అతని జన్మ రహస్యాలు ఎవరికీ అంతగా తెలియవుగాని ఆ యింట్లోని ముసలి నౌకర్లు మాత్రం అతడు జమీందారుగారి సోదరికి ఆ పరిసరాల్లోని ఒక పెద్ద మనిషివల్ల జన్మించాడనే వాళ్లు. ఆ పెద్దమనిషికి చెప్పుకో తగ్గ, ఆస్తి పాస్తులేమీ లేకపోవటం వల్లనూ, అతడి కుటుంబీకులంతా నాశనమవటం చేతనూ జమీందారుగారి సోదరి అతణ్ణి పరిణయమాడేందుకు అంగీకరించలేదట.
జమీందారుగారు ఆ ప్రాంతంలో పలుకుబడిగల పెద్దల్లో ఒకరు. ఎందువల్లనను కుంటారేమో! ఆయన భవంతికి చుట్టూ కిటికీలు, గోడలకు జలతారు అల్లిక తెరలు అమర్చబడి వుండేవి. ఆయన వేటకు బయల్దేరితే కోటలోని కుక్కలన్నిటికీ పని తగిలేది. స్థానిక మఠాధికారే ఆయనకు పురోహితుడుగా వుండేవాడు.
పోతే జమీందారిణి గారు నూటడెబ్భైఐదు పౌనుల బరువు వుండటంవల్ల ఆవిడ కూడా ఒక విశిష్ట వ్యక్తి అయింది. ఆమె కుమార్తె క్యూగొండీకి పదిహేడేళ్ళ వయస్సుంటుంది.
లేత గులాబిరంగు శరీరఛాయ. సుందరవదనం-సున్నిత శరీరం చూడ ముచ్చటగా వుంటుంది. జమీందారుగారి అబ్బాయి మాత్రం తండ్రికి తగిన కొడుకు. ఇందరి మధ్యా ఈ పిల్లలు అధ్యాపకుడు డాక్టరు పాంగ్లాస్ ఒకడే మహామేధావి, సర్వజ్ఞుడు. ఆయన గుణగణాలు, వయస్సుమీదగల భక్తికొద్దీ ఆయన బోధించే సృష్టి విషయక అ ప్రత్యక్ష వేదాంత విషయాలను అచంచలమైన దీక్షతో వింటుండేవాడు కాండైడ్. ఆయన కార్యాచరణ సిద్ధాంతాన్ని గూర్చి అద్భుతంగా వివరించేవాడు. కారణం లేకుండా కార్యం.............................
ఆశాజీవి వెస్ట్ ఫేలియాలోని థండర్-టెన్-ట్రాంక్ గ్రామీణ జమీందారుగారి కోటలో మన కధానాయకుడి బాల్యం గడిచింది. స్వభావ సిద్ధంగా అతడు అతి మంచివాడు. ఈ అతి మంచి లక్షణాలు మనకు అతని ముఖం చూడగానే అవగతమౌతాయి. సద సద్విచక్షణ, నిరాడంబరత అతనిలో మేళవించాయి. అందుకనే అతనికి కాండైడ్ (నిష్కపటి) అని నామకరణం చేసివుంటారు. అతని జన్మ రహస్యాలు ఎవరికీ అంతగా తెలియవుగాని ఆ యింట్లోని ముసలి నౌకర్లు మాత్రం అతడు జమీందారుగారి సోదరికి ఆ పరిసరాల్లోని ఒక పెద్ద మనిషివల్ల జన్మించాడనే వాళ్లు. ఆ పెద్దమనిషికి చెప్పుకో తగ్గ, ఆస్తి పాస్తులేమీ లేకపోవటం వల్లనూ, అతడి కుటుంబీకులంతా నాశనమవటం చేతనూ జమీందారుగారి సోదరి అతణ్ణి పరిణయమాడేందుకు అంగీకరించలేదట. జమీందారుగారు ఆ ప్రాంతంలో పలుకుబడిగల పెద్దల్లో ఒకరు. ఎందువల్లనను కుంటారేమో! ఆయన భవంతికి చుట్టూ కిటికీలు, గోడలకు జలతారు అల్లిక తెరలు అమర్చబడి వుండేవి. ఆయన వేటకు బయల్దేరితే కోటలోని కుక్కలన్నిటికీ పని తగిలేది. స్థానిక మఠాధికారే ఆయనకు పురోహితుడుగా వుండేవాడు. పోతే జమీందారిణి గారు నూటడెబ్భైఐదు పౌనుల బరువు వుండటంవల్ల ఆవిడ కూడా ఒక విశిష్ట వ్యక్తి అయింది. ఆమె కుమార్తె క్యూగొండీకి పదిహేడేళ్ళ వయస్సుంటుంది. లేత గులాబిరంగు శరీరఛాయ. సుందరవదనం-సున్నిత శరీరం చూడ ముచ్చటగా వుంటుంది. జమీందారుగారి అబ్బాయి మాత్రం తండ్రికి తగిన కొడుకు. ఇందరి మధ్యా ఈ పిల్లలు అధ్యాపకుడు డాక్టరు పాంగ్లాస్ ఒకడే మహామేధావి, సర్వజ్ఞుడు. ఆయన గుణగణాలు, వయస్సుమీదగల భక్తికొద్దీ ఆయన బోధించే సృష్టి విషయక అ ప్రత్యక్ష వేదాంత విషయాలను అచంచలమైన దీక్షతో వింటుండేవాడు కాండైడ్. ఆయన కార్యాచరణ సిద్ధాంతాన్ని గూర్చి అద్భుతంగా వివరించేవాడు. కారణం లేకుండా కార్యం.............................© 2017,www.logili.com All Rights Reserved.