మాటిస్తేనే.. మిఠాయిస్తా...!!
సింహళ రాజ్యానికి రాజు పుళిందుడు, రాణి భద్రాదేవి. ఏటా రాణి పుట్టిన రోజును ఘనంగా జరిపేవాడు రాజు. ఆ సంవత్సరం కూడా భద్రాదేవి పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'మహారాజా.. ఏటా • పుట్టినరోజు ఏదో ఒక వనంలో నిర్వహిస్తున్నారు. ఈసారి మనకు తూర్పు వైపు నున్న కంకణ వనంలో జరుపుకోవాలని ఉంది' అని కోరింది రాణి. 'మహారాణీ.. కంకణ వనం అంటే అది పూలవనం కాదు. క్రూరమృగాలు ఉండే అడవి. అక్కడికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు' అన్నాడు మంత్రి. "మహారాణి ఎప్పుడూ ఏదీ కోరలేదు. అడవి మధ్యలోకి వెళ్లకుండా ముందు భాగంలోనే వేడుకలు నిర్వహిద్దాం, అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. సమీప గ్రామాల ప్రజల సహకారం తీసుకోండి' అని ఆదేశించాడు రాజు.
సరేనంటూ ఆ వనం ప్రవేశమార్గానికి సమీపంలో పుట్టినరోజు చేసేందుకు అంతా సిద్ధం చేయించాడు మంత్రి. ఇతర రాజ్యాల నుంచి సైతం రాజులు, ప్రజలు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా కేకలు, అరుపులతో సందడిగా ఉండటంతో.. అడవిలోంచి మరువం అనే కోతి అక్కడికి వచ్చి చెట్టు చాటుగా చూడసాగింది. మధ్యాహ్నం భోజనాలు ముగిసిన తర్వాత.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోతి కూడా తిరిగి వెళ్లామనుకునేలోగా, దానికి అక్కడో గంప కనిపించింది. కుతూహలంతో దగ్గరకు వెళ్లి చూసిన కోతికి మిఠాయిలు కనిపించాయి. చటుక్కున ఒకటి నోట్లో వేసుకుంది. అబ్బా.. ఎంత తియ్యగా ఉందో ఈ మిఠాయి. నేనొక్కదాన్నే తినడం కాదు, అందరికీ పంచాలి' అనుకుంది....................
మాటిస్తేనే.. మిఠాయిస్తా...!! సింహళ రాజ్యానికి రాజు పుళిందుడు, రాణి భద్రాదేవి. ఏటా రాణి పుట్టిన రోజును ఘనంగా జరిపేవాడు రాజు. ఆ సంవత్సరం కూడా భద్రాదేవి పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'మహారాజా.. ఏటా • పుట్టినరోజు ఏదో ఒక వనంలో నిర్వహిస్తున్నారు. ఈసారి మనకు తూర్పు వైపు నున్న కంకణ వనంలో జరుపుకోవాలని ఉంది' అని కోరింది రాణి. 'మహారాణీ.. కంకణ వనం అంటే అది పూలవనం కాదు. క్రూరమృగాలు ఉండే అడవి. అక్కడికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు' అన్నాడు మంత్రి. "మహారాణి ఎప్పుడూ ఏదీ కోరలేదు. అడవి మధ్యలోకి వెళ్లకుండా ముందు భాగంలోనే వేడుకలు నిర్వహిద్దాం, అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. సమీప గ్రామాల ప్రజల సహకారం తీసుకోండి' అని ఆదేశించాడు రాజు. సరేనంటూ ఆ వనం ప్రవేశమార్గానికి సమీపంలో పుట్టినరోజు చేసేందుకు అంతా సిద్ధం చేయించాడు మంత్రి. ఇతర రాజ్యాల నుంచి సైతం రాజులు, ప్రజలు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా కేకలు, అరుపులతో సందడిగా ఉండటంతో.. అడవిలోంచి మరువం అనే కోతి అక్కడికి వచ్చి చెట్టు చాటుగా చూడసాగింది. మధ్యాహ్నం భోజనాలు ముగిసిన తర్వాత.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోతి కూడా తిరిగి వెళ్లామనుకునేలోగా, దానికి అక్కడో గంప కనిపించింది. కుతూహలంతో దగ్గరకు వెళ్లి చూసిన కోతికి మిఠాయిలు కనిపించాయి. చటుక్కున ఒకటి నోట్లో వేసుకుంది. అబ్బా.. ఎంత తియ్యగా ఉందో ఈ మిఠాయి. నేనొక్కదాన్నే తినడం కాదు, అందరికీ పంచాలి' అనుకుంది....................© 2017,www.logili.com All Rights Reserved.