గిరిజనులు అనే పిలుపులోనే అమాయకత్వం వినిపిస్తుంది. ఏది కీడో మేలో తెలియని అమాయక అటవీ నివాసితులు గిరిజనులు. ఎన్నో సంవత్సరాల నుండి అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో నివసిస్తూ రైలు కూతగానీ, బస్సు మోతగాని
వినని, బాహ్య ప్రపంచాన్ని చూడని అమాయక ప్రజలు గిరిజనులు.
మట్టిలోని సువాసనను బట్టి ఫలించే సామర్థ్యాన్ని అంచనా వేయగల విజ్ఞానులు వీరు. పోడు వ్యవసాయానికి బాటలు వేసి అటవీ భూతల్లి గుండెలపై సిరులు పండిస్తున్న శాస్త్రవేత్తలు వీరు. అడవిలోని చెట్టు చేమ, గొడ్డు గోద, కొండకోనలే వారి అందమైన ప్రపంచం. ఆస్తులు, అంతస్థులు సంపాదించాలన్న ఆరాటం వారిలో కనిపించదు. కోపం, పగ, ద్వేషం, అసూయ అన్న మాటలు వీరిలో వినిపించవు. మంచితనం, ప్రేమ ఆప్యాయతలే వారి ఆభరణాలు, చుట్టూ ఉన్న అందమైన ప్రకృతే వారి ఆరాధ్యదైవాలు.
గిరిజనులు అనే పిలుపులోనే అమాయకత్వం వినిపిస్తుంది. ఏది కీడో మేలో తెలియని అమాయక అటవీ నివాసితులు గిరిజనులు. ఎన్నో సంవత్సరాల నుండి అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో నివసిస్తూ రైలు కూతగానీ, బస్సు మోతగాని వినని, బాహ్య ప్రపంచాన్ని చూడని అమాయక ప్రజలు గిరిజనులు. మట్టిలోని సువాసనను బట్టి ఫలించే సామర్థ్యాన్ని అంచనా వేయగల విజ్ఞానులు వీరు. పోడు వ్యవసాయానికి బాటలు వేసి అటవీ భూతల్లి గుండెలపై సిరులు పండిస్తున్న శాస్త్రవేత్తలు వీరు. అడవిలోని చెట్టు చేమ, గొడ్డు గోద, కొండకోనలే వారి అందమైన ప్రపంచం. ఆస్తులు, అంతస్థులు సంపాదించాలన్న ఆరాటం వారిలో కనిపించదు. కోపం, పగ, ద్వేషం, అసూయ అన్న మాటలు వీరిలో వినిపించవు. మంచితనం, ప్రేమ ఆప్యాయతలే వారి ఆభరణాలు, చుట్టూ ఉన్న అందమైన ప్రకృతే వారి ఆరాధ్యదైవాలు.
© 2017,www.logili.com All Rights Reserved.