మనిషి ఆశాజీవి!
అడుగు అడుగుకీ ఓటమివున్నా - అడుగడుగునా ఆశని వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడో దూరాన తళుక్కుమని మెరిసే లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను ఆరాట పడుతున్నాడు. అతని లక్ష్యసిద్ధికి అనంత అవాంతరాలు. అతని పేరు యాదగిరి. అందరూ గిరి అని పిలుస్తుంటారు. తక్కువ కులంలో పుట్టడం అతని పాపం కాదు, కానీ అతను కులమతాల ప్రసక్తిలో కొన్నేళ్ళు నలిగిపోయేడు. తక్కువ ఎక్కువలు కులాల్లో ఉండవు. గుణాల్లో ఉంటాయని అతని నమ్మిక, శ్రద్ధగా చదివాడు, తన లక్ష్యాన్ని డాక్టరై చేరుకున్నాడు. కానీ ప్రేమలు పగలు, ఈర్ష్య అసూయలు, దగా మోసాలు, పచ్చి స్వార్థం అతనిమీద విలయతాండవం చేశాయి. విసిగిపోయాడు. ఓడిపోయాడు.కట్టుకున్న భార్యనే హత్యచేశాడు. అతని ఆశయాలకు ఆఖరిమెట్టు ఇదేనా? మాదిరెడ్డి సులోచన గారు మీ ఆలోచనలకు వదిలిన విలువైన ప్రశ్న.
మనిషి ఆశాజీవి! అడుగు అడుగుకీ ఓటమివున్నా - అడుగడుగునా ఆశని వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడో దూరాన తళుక్కుమని మెరిసే లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను ఆరాట పడుతున్నాడు. అతని లక్ష్యసిద్ధికి అనంత అవాంతరాలు. అతని పేరు యాదగిరి. అందరూ గిరి అని పిలుస్తుంటారు. తక్కువ కులంలో పుట్టడం అతని పాపం కాదు, కానీ అతను కులమతాల ప్రసక్తిలో కొన్నేళ్ళు నలిగిపోయేడు. తక్కువ ఎక్కువలు కులాల్లో ఉండవు. గుణాల్లో ఉంటాయని అతని నమ్మిక, శ్రద్ధగా చదివాడు, తన లక్ష్యాన్ని డాక్టరై చేరుకున్నాడు. కానీ ప్రేమలు పగలు, ఈర్ష్య అసూయలు, దగా మోసాలు, పచ్చి స్వార్థం అతనిమీద విలయతాండవం చేశాయి. విసిగిపోయాడు. ఓడిపోయాడు.కట్టుకున్న భార్యనే హత్యచేశాడు. అతని ఆశయాలకు ఆఖరిమెట్టు ఇదేనా? మాదిరెడ్డి సులోచన గారు మీ ఆలోచనలకు వదిలిన విలువైన ప్రశ్న.© 2017,www.logili.com All Rights Reserved.