అహోబిల క్షేత్ర మహత్మ్యము
నారాయణం నమస్కృత్య - నరంచైవ నరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం - తతో జయముదీరయేత్ |
క్షీరసాగర శయనుడైన దేవాదిదేవుడు నారాయణునకు, నరోత్తముడైన నరునకు (నరనారాయణులు బదరీవనములో తపస్సు చేసిన మహర్షులు - అలాంటి పరమ ఋషులకు) సకల వాక్ స్వరూపిణి అయిన సరస్వతీదేవికి నమస్కరించి, వేదములను విభజించియు, పదునెనిమిది పురాణములు రచించియు, ప్రసిద్ధిగనిన వేదవ్యాస మహర్షి అనంతరము 'జయ' నామక మహాభారతమును రచించెను. (జయమును శుభమును కలిగించు పురాణములను చెప్పెను.)
ప్రణమ్య పరమాత్మానం - పరమానంద కారణం |
ప్రవక్ష్యామి యధాపూర్వం - మహాత్మ్యం హయమేధసః॥
సకల జీవులకు కూడ పరమానందము కలిగించగల పరదైవమెవరో ఆ పరమాత్మునకు నమస్కరించి, ఇంతకుముందు పురాణగాధలన్నీ చెప్పిన రీతిగానే, శ్రీమదహోబిల నరసింహ స్వామి యొక్క (ఆ స్వామి వేంచేసియున్న క్షేత్రము యొక్క - అని కూడ) మహాత్యమును చెప్పెదను.
(హయమేధసుడు - విష్ణువు : ఇక్కడ నృసింహస్వామి)
పురాతు జాహ్నవీతీరే - మునయశ్శానకాదయః॥
కృతాత్మానః పరప్రీత్యా - పప్రచ్చున్నారదం మునిం ॥
పూర్వము గంగానదీ తీరంలో శౌనకాది మహామునులు పరమానందభరితులై దేవముని అయిన నారదమహా ఋషితో ఇట్లన్నారు...................
అహోబిల క్షేత్ర మహత్మ్యము నారాయణం నమస్కృత్య - నరంచైవ నరోత్తమం | దేవీం సరస్వతీం వ్యాసం - తతో జయముదీరయేత్ | క్షీరసాగర శయనుడైన దేవాదిదేవుడు నారాయణునకు, నరోత్తముడైన నరునకు (నరనారాయణులు బదరీవనములో తపస్సు చేసిన మహర్షులు - అలాంటి పరమ ఋషులకు) సకల వాక్ స్వరూపిణి అయిన సరస్వతీదేవికి నమస్కరించి, వేదములను విభజించియు, పదునెనిమిది పురాణములు రచించియు, ప్రసిద్ధిగనిన వేదవ్యాస మహర్షి అనంతరము 'జయ' నామక మహాభారతమును రచించెను. (జయమును శుభమును కలిగించు పురాణములను చెప్పెను.) ప్రణమ్య పరమాత్మానం - పరమానంద కారణం |ప్రవక్ష్యామి యధాపూర్వం - మహాత్మ్యం హయమేధసః॥ సకల జీవులకు కూడ పరమానందము కలిగించగల పరదైవమెవరో ఆ పరమాత్మునకు నమస్కరించి, ఇంతకుముందు పురాణగాధలన్నీ చెప్పిన రీతిగానే, శ్రీమదహోబిల నరసింహ స్వామి యొక్క (ఆ స్వామి వేంచేసియున్న క్షేత్రము యొక్క - అని కూడ) మహాత్యమును చెప్పెదను. (హయమేధసుడు - విష్ణువు : ఇక్కడ నృసింహస్వామి)పురాతు జాహ్నవీతీరే - మునయశ్శానకాదయః॥ కృతాత్మానః పరప్రీత్యా - పప్రచ్చున్నారదం మునిం ॥ పూర్వము గంగానదీ తీరంలో శౌనకాది మహామునులు పరమానందభరితులై దేవముని అయిన నారదమహా ఋషితో ఇట్లన్నారు...................© 2017,www.logili.com All Rights Reserved.