కోరిన వారల కెల్లను
జేరువ కైవల్య పదము శ్రీవరుని మదిం
గోరని వారల కెల్లను
దూరము మోక్షాప్తి యెన్ని త్రోవలనైనన్
భాగవతము -షష్ఠస్కంధము.
(అజామీళోపాఖ్యానము)
మోక్షమార్గము ననుసరించినవాడు ప్రహ్లాదుడు. పెడత్రోవలు దొక్కినవాడు హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుని భక్తి అనన్య సామాన్యమైనది. పరమ భకాగ్రేశ్వరుడని ఆదిశంకరుల వారీయనను పేర్కొనడం జరిగింది. నిద్రమేల్కాంచినంతనే ప్రహ్లాదుని స్మరించడం శుభావహము; పుణ్యప్రదమని పాండవ గీతయందు కలదు.
ఒకించుక సూక్ష్మ పరిశీలనమొనరించిన - ప్రహ్లాదుడు మహా జ్ఞానియని తోపకమానదు. చదువులలోని మర్మమెల్ల-ఉపనిషత్సారమును గ్రోలినవాడు కావుననే పండ్రెండు లక్షణములు గల ఆత్మ తత్వమును తోడి విద్యార్థులకు ప్రబోధమొనరించినాడు. ఆత్మ అన్నింటి యందును ప్రకాశించుచు, అన్నింటి కతీతముగా నుండుటను వివరముగ తెలిపినాడు. వెయ్యేల, శ్రీహరిని చూపగలవా యని తండ్రి ప్రశ్నించినపుడు చక్రి సర్వోపగతుడని సవాలు చేసినాడు. ఎచట బట్టిన నచట భగవంతుని చూపగల మాహాత్మ్యము జ్ఞానులకే చెల్లును. అది యెంతటి భక్తునకైనను సాధ్యము కాని పని. భగవద్గీతయందలి విభూతి యోగము జ్ఞానుల కనుసన్నల వెలుగు చుండును. -
కోరిన వారల కెల్లను జేరువ కైవల్య పదము శ్రీవరుని మదిం గోరని వారల కెల్లను దూరము మోక్షాప్తి యెన్ని త్రోవలనైనన్ భాగవతము -షష్ఠస్కంధము. (అజామీళోపాఖ్యానము) మోక్షమార్గము ననుసరించినవాడు ప్రహ్లాదుడు. పెడత్రోవలు దొక్కినవాడు హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుని భక్తి అనన్య సామాన్యమైనది. పరమ భకాగ్రేశ్వరుడని ఆదిశంకరుల వారీయనను పేర్కొనడం జరిగింది. నిద్రమేల్కాంచినంతనే ప్రహ్లాదుని స్మరించడం శుభావహము; పుణ్యప్రదమని పాండవ గీతయందు కలదు. ఒకించుక సూక్ష్మ పరిశీలనమొనరించిన - ప్రహ్లాదుడు మహా జ్ఞానియని తోపకమానదు. చదువులలోని మర్మమెల్ల-ఉపనిషత్సారమును గ్రోలినవాడు కావుననే పండ్రెండు లక్షణములు గల ఆత్మ తత్వమును తోడి విద్యార్థులకు ప్రబోధమొనరించినాడు. ఆత్మ అన్నింటి యందును ప్రకాశించుచు, అన్నింటి కతీతముగా నుండుటను వివరముగ తెలిపినాడు. వెయ్యేల, శ్రీహరిని చూపగలవా యని తండ్రి ప్రశ్నించినపుడు చక్రి సర్వోపగతుడని సవాలు చేసినాడు. ఎచట బట్టిన నచట భగవంతుని చూపగల మాహాత్మ్యము జ్ఞానులకే చెల్లును. అది యెంతటి భక్తునకైనను సాధ్యము కాని పని. భగవద్గీతయందలి విభూతి యోగము జ్ఞానుల కనుసన్నల వెలుగు చుండును. -
© 2017,www.logili.com All Rights Reserved.