28 జనవరి 1949. శుక్రవారం. అమావాస్య.
"నాకెందుకో దిగులుగా, భయంగా ఉందండీ" ఉదయాన్నే పొలానికి వెళ్తూన్న భర్తతో అన్నది నీలకంఠేశ్వరి.
"దిగులా? ఎందుకు?” ఆందోళనగా అడిగారు సూర్యనారాయణ. ఆయన కంఠంలో ఆత్రుత ధ్వనించింది.
"డెలివరీ విషయం".
కారణం విని ఆయన మనసు తేలికైంది. "ఓ అంతేనా..! నేను చాలా కంగారు పడ్డాను సుమా..! నువ్వేమీ కంగారుపడకు. ఇంకెంత. రెండు రోజులు. అంతా సవ్యంగా ఉన్నదని డాక్టరుగారు చెప్పారు కదా. ప్రసవం సుఖంగా జరుగుతుంది. పండంటి బిడ్డని కంటావు".
"నా భయం అందుకు కాదండీ. ఇవ్వాళ్ళో రేపో డెలివరీ అని డాక్టరు చెపుతున్నారు. ఇవ్వాళ అమావాస్య. ఎల్లుండి ఆదివారం. అమావాస్య రోజు గానీ, ఆదివారం నాడు గానీ పుట్టిన వాడి జాతకం ఎలా ఉంటుందో అని భయంగా ఉంది”.
"నువ్వు బాగా చదువుకున్నదానివి. తెలివైనదానివి. అమావాస్య పూటా, ఆదివారం నాడూ పుట్టిన పిల్లలందరూ క్రిమినల్సూ, లేదా తెలివితక్కువ జడులూ అయినట్టు చరిత్రలో ఎక్కడా దాఖలాలు లేవు. నువ్వు నిశ్చింతగా ఉండు ఈశ్వరీ" అన్నాడాయన చిరునవ్వుతో.
ఆ మాటలకు ఆమె ధైర్యంగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమె భయపడ్డట్టే అదే అమావాస్య నాడు డెలివరి జరిగింది.
నేను పుట్టాను.
మా మొటపర్తి వారింట హేతువుకి అందని విశేషము ఒకటున్నది..! మా వంశంలో మగ పిల్లలంతా 'అమావాస్య' నాడే పుట్టారు..! మా అందరికీ గ్రహశాంతులూ, శని పూజలూ జరిగాయో లేదో తెలీదు కానీ ఒక విషయం మాత్రం తెలుసు.......................
మొదటి అధ్యాయం, బాల్యం 28 జనవరి 1949. శుక్రవారం. అమావాస్య. "నాకెందుకో దిగులుగా, భయంగా ఉందండీ" ఉదయాన్నే పొలానికి వెళ్తూన్న భర్తతో అన్నది నీలకంఠేశ్వరి. "దిగులా? ఎందుకు?” ఆందోళనగా అడిగారు సూర్యనారాయణ. ఆయన కంఠంలో ఆత్రుత ధ్వనించింది. "డెలివరీ విషయం". కారణం విని ఆయన మనసు తేలికైంది. "ఓ అంతేనా..! నేను చాలా కంగారు పడ్డాను సుమా..! నువ్వేమీ కంగారుపడకు. ఇంకెంత. రెండు రోజులు. అంతా సవ్యంగా ఉన్నదని డాక్టరుగారు చెప్పారు కదా. ప్రసవం సుఖంగా జరుగుతుంది. పండంటి బిడ్డని కంటావు". "నా భయం అందుకు కాదండీ. ఇవ్వాళ్ళో రేపో డెలివరీ అని డాక్టరు చెపుతున్నారు. ఇవ్వాళ అమావాస్య. ఎల్లుండి ఆదివారం. అమావాస్య రోజు గానీ, ఆదివారం నాడు గానీ పుట్టిన వాడి జాతకం ఎలా ఉంటుందో అని భయంగా ఉంది”. "నువ్వు బాగా చదువుకున్నదానివి. తెలివైనదానివి. అమావాస్య పూటా, ఆదివారం నాడూ పుట్టిన పిల్లలందరూ క్రిమినల్సూ, లేదా తెలివితక్కువ జడులూ అయినట్టు చరిత్రలో ఎక్కడా దాఖలాలు లేవు. నువ్వు నిశ్చింతగా ఉండు ఈశ్వరీ" అన్నాడాయన చిరునవ్వుతో. ఆ మాటలకు ఆమె ధైర్యంగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమె భయపడ్డట్టే అదే అమావాస్య నాడు డెలివరి జరిగింది. నేను పుట్టాను. మా మొటపర్తి వారింట హేతువుకి అందని విశేషము ఒకటున్నది..! మా వంశంలో మగ పిల్లలంతా 'అమావాస్య' నాడే పుట్టారు..! మా అందరికీ గ్రహశాంతులూ, శని పూజలూ జరిగాయో లేదో తెలీదు కానీ ఒక విషయం మాత్రం తెలుసు.......................© 2017,www.logili.com All Rights Reserved.