వస్తువొక నెపం మాత్రమే!
కవిః కరోతి కావ్యాని లాలయేత్యుత్తుమో జనః
తరుః ప్రసూతే పుష్పాణి మరు ద్వహతి సౌరభం
(కవులు రాసే కావ్యాలు సహృదయుల్ని చేరతాయి- పూల సౌరభాలు చెట్ల నుండి గాలుల్ని చేరినట్టు)
సహృదయత లేని వాడికి కవిత వినిపించడం అనే దౌర్బల్యం లేదు కనుక పాఠకుల సంఖ్య మీద దృష్టి లేదు నాకు. పద్యానికున్నట్టు వచన కవితకు కూడా ధార ఉంటే ఎట్లా ఉంటుందో అనే చింతనలోనే ఎన్నో ఏళ్ళు గడిచి పోయాయి. ఉడికించే సహ కవులున్నా అలరించే వచనం కోసం నా ప్రయత్న పూర్వక ప్రయాస మానలేదు. వాక్యానికి ప్రాణప్రతిష్ట చేస్తున్నప్పుడు రొద చేసే గాలిని కూడా రాజద్రోహిలాగే చూసే నైజం నాది.
నేను తాకానో నన్నే తాకాయో తెలీదు కానీ
కిటికీ తెరిచాక తెరలు తెరలుగా రాలిపడ్డాయి గాలి అలలు
అర్ధంకాని భాషలో వ్యాకరణం చెప్తున్నట్టు
కిచకిచమని పిలిచాయ్ పిచుక తలలు..........
© 2017,www.logili.com All Rights Reserved.