ఒప్పుకోలు
దినం నిర్మలంగానూ, బాగా చలిగానూ ఉంది. తనకి రావలసిన రెండు కోపెక్కులకి బదులు ఒక బంగారం ముక్క పొందిన బండి తోలరి మాదిరి నా గుండె గాలిలో తేలిపోతోంది. నాకు ఏకకాలంలో ఏడవాలనీ, నవ్వాలనీ, ప్రార్ధన చెయ్యాలనీ అనిపించింది. నాకు స్వర్గంలో వున్నట్టుగా అనిపించసాగింది. దొంగిలించే అవకాశం వచ్చిందని నేను సంతోష పడటంలేదు. నేను దొంగని కాదు కూడా భవిష్యత్తులో నువ్వు దొంగతనం చేస్తానని ఎవరైనా అని వుంటే వాళ్ళని చితగ్గొట్టి వుండేవాడిని. నా సంతోషానికి కారణం వేరే ఉంది. పదోన్నతీ, జీతంలో కాస్త పెంపు... అవే నా ఈ సంతోషానికి కారణాలు.
ఏదైతేనేం నేను యింకో విషయానికి కూడా సంతోషించేను. నేను కోశాధికారి (ట్రెజరర్) అయ్యేక నాకు లోకమంతా ఆకుపచ్చగా కనిపించసాగింది. హఠాత్తుగా నాచుట్టూ వున్న మనుషులంతా మారిపోయినట్టుగా తోచింది. నిజంగానే! అంతా మంచిగా మారినట్టుగా వుంది. వికారంగా వుండే వాళ్ళంతా అందంగానూ, చెడ్డవాళ్ళు మంచివారిగానూ, గర్విష్టులు వినయశీలురుగానూ, దుష్టులంతా పరోపకారులుగానూ మారిపోయినట్టుగా తోచింది. నాకు ఉత్సాహం రెట్టింపు అయ్యింది. గతంలో నా ఊహకు కూడా అందని అద్భుతమైన గుణాలు నాచుట్టూ వున్న వారిలో గమనించసాగేను. "వింతగా ఉండే" కళ్ళు నులుముకుని నా చుట్టూ వున్నవారిని చూస్తూ అనుకున్నాను. "అసలు వీళ్ళందరికీ ఏదో అయ్యింది. లేదా యిన్నాళ్ళూ వీళ్ళలోని ఈ అద్భుత గుణాలను గుర్తించలేకపోవడం నా తెలివితక్కువతనం. అసలు ఎంత మంచి మనుషులు వీళ్ళంతా!" అనుకున్నాను.
నా నియామకం జరిగిన రోజున మరో వింత జరిగింది. బోర్డు సభ్యులలో ఒకరైన జె.ఎన్.కజు బాగా గర్విష్టి. అతను క్రిందిస్థాయి మనుషులను కన్నెత్తి కూడా.....................
ఒప్పుకోలు దినం నిర్మలంగానూ, బాగా చలిగానూ ఉంది. తనకి రావలసిన రెండు కోపెక్కులకి బదులు ఒక బంగారం ముక్క పొందిన బండి తోలరి మాదిరి నా గుండె గాలిలో తేలిపోతోంది. నాకు ఏకకాలంలో ఏడవాలనీ, నవ్వాలనీ, ప్రార్ధన చెయ్యాలనీ అనిపించింది. నాకు స్వర్గంలో వున్నట్టుగా అనిపించసాగింది. దొంగిలించే అవకాశం వచ్చిందని నేను సంతోష పడటంలేదు. నేను దొంగని కాదు కూడా భవిష్యత్తులో నువ్వు దొంగతనం చేస్తానని ఎవరైనా అని వుంటే వాళ్ళని చితగ్గొట్టి వుండేవాడిని. నా సంతోషానికి కారణం వేరే ఉంది. పదోన్నతీ, జీతంలో కాస్త పెంపు... అవే నా ఈ సంతోషానికి కారణాలు. ఏదైతేనేం నేను యింకో విషయానికి కూడా సంతోషించేను. నేను కోశాధికారి (ట్రెజరర్) అయ్యేక నాకు లోకమంతా ఆకుపచ్చగా కనిపించసాగింది. హఠాత్తుగా నాచుట్టూ వున్న మనుషులంతా మారిపోయినట్టుగా తోచింది. నిజంగానే! అంతా మంచిగా మారినట్టుగా వుంది. వికారంగా వుండే వాళ్ళంతా అందంగానూ, చెడ్డవాళ్ళు మంచివారిగానూ, గర్విష్టులు వినయశీలురుగానూ, దుష్టులంతా పరోపకారులుగానూ మారిపోయినట్టుగా తోచింది. నాకు ఉత్సాహం రెట్టింపు అయ్యింది. గతంలో నా ఊహకు కూడా అందని అద్భుతమైన గుణాలు నాచుట్టూ వున్న వారిలో గమనించసాగేను. "వింతగా ఉండే" కళ్ళు నులుముకుని నా చుట్టూ వున్నవారిని చూస్తూ అనుకున్నాను. "అసలు వీళ్ళందరికీ ఏదో అయ్యింది. లేదా యిన్నాళ్ళూ వీళ్ళలోని ఈ అద్భుత గుణాలను గుర్తించలేకపోవడం నా తెలివితక్కువతనం. అసలు ఎంత మంచి మనుషులు వీళ్ళంతా!" అనుకున్నాను. నా నియామకం జరిగిన రోజున మరో వింత జరిగింది. బోర్డు సభ్యులలో ఒకరైన జె.ఎన్.కజు బాగా గర్విష్టి. అతను క్రిందిస్థాయి మనుషులను కన్నెత్తి కూడా.....................© 2017,www.logili.com All Rights Reserved.