అనేక గణాంకాల కంటే కూడా అతి సామాన్యమైన పదాలతో భాషా సింగ్ భారతదేశ పాకీ పనివారి కడగండ్లను, అలాగే వారి సామర్థ్యాలను శక్తివంతంగా ఈ పుస్తకంలో వివరించారు. ఎంతో సున్నితత్వంతో వారి జీవితాల్లోని అనేక బాధాకరమైన కోణాలను ఆవిష్కరించారు. అది వర్షాకాలంలో పనిలో వారుపడే దుర్భర పరిస్థితి కావొచ్చు లేదా వారిలో కొంత మంది తమ పనినే "వ్యాపారం" గా ఎలా మార్చుకున్నారో కావొచ్చు. వీటన్నిటికంటే కూడా క్రూరమైన కులవ్యవస్థలో వారి జీవితాలు ఎలా బందీ అయ్యాయో ఈ కథనాలు సూటిగా వివరిస్తాయి. మనమిప్పటివరకూ వినని, కనని, ఆలోచించని భారతదేశపు మరో పార్శ్వాన్ని మనముందుకు తీసుకువచ్చి మన కళ్ళు తెరిపిస్తుంది ఈ పుస్తకం.
- జాన్ డ్రెజ్
అనేక గణాంకాల కంటే కూడా అతి సామాన్యమైన పదాలతో భాషా సింగ్ భారతదేశ పాకీ పనివారి కడగండ్లను, అలాగే వారి సామర్థ్యాలను శక్తివంతంగా ఈ పుస్తకంలో వివరించారు. ఎంతో సున్నితత్వంతో వారి జీవితాల్లోని అనేక బాధాకరమైన కోణాలను ఆవిష్కరించారు. అది వర్షాకాలంలో పనిలో వారుపడే దుర్భర పరిస్థితి కావొచ్చు లేదా వారిలో కొంత మంది తమ పనినే "వ్యాపారం" గా ఎలా మార్చుకున్నారో కావొచ్చు. వీటన్నిటికంటే కూడా క్రూరమైన కులవ్యవస్థలో వారి జీవితాలు ఎలా బందీ అయ్యాయో ఈ కథనాలు సూటిగా వివరిస్తాయి. మనమిప్పటివరకూ వినని, కనని, ఆలోచించని భారతదేశపు మరో పార్శ్వాన్ని మనముందుకు తీసుకువచ్చి మన కళ్ళు తెరిపిస్తుంది ఈ పుస్తకం. - జాన్ డ్రెజ్© 2017,www.logili.com All Rights Reserved.