ఇది కధ కాదు. కల్పన కాదు. యదార్ధ జీవితం. ఇందులో పాత్రలన్నీ నిజంగా ఉన్నవే. ఏది కల్పితం కాదు. అయితే అన్ని నమూనా పాత్రలు. అంటే ఒక భూస్వామి ఉన్నాడనుకోండి - ఆ భూస్వామిని యధాతధంగా దించడం కాదు. భుస్వాములైన ఒకడి నుంచి కాలు, ఒకడి నుంచి చేయి, మరొకడి నుంచి తల, వేరోకడి నుండి ఆత్మ- ఇలా తీసుకునివాళ్ల తాలుకూ పరిపూర్ణత్వాన్ని సాధించదామన్నమాట. కాబట్టి ఇందులోని పాత్రలు, సంఘటనలు అన్నీ ఇలా రూపుదిద్దుకున్నవే.
ఇది మానవ జీవన వస్తావ కధ.
'కొండ అద్దమందు కొంచమై యుండదా' అన్నట్లు ప్రస్తుత ప్రపంచాన్ని ఈ చిన్న చట్రంలో బిగించడానికి ప్రయత్నించాను. అందువల్ల కొన్ని చిత్రాలు స్పష్టంగా, కొన్ని అస్పష్టంగా, కొన్ని మరీ రేఖామాత్రంగా అనిపిస్తాయి. ఆ రేఖలు కూడా లేకుండా కొన్ని చోట్ల కేవలం రంగులే ఉండవచ్చు. ఈ రంగులు, రేఖలు,చిత్రాలు - వీటన్నిటితో కలిసిన ఏక మొత్తం బొమ్మ ఒక్కటే ఇక్కడ ప్రధానం. ఒక్కటే బొమ్మ! మరి ఈ బొమ్మ ఎలా కుదిరిందో, ఎంతవాస్తమైందో సజీవంగా ఉన్నదో లేదో తేల్చి చెప్పవలసిన రసజ్ఞులు మీరు.
ఇది నా ఆత్మావిష్కరణ. నా జాతి జనుల పట్ల నా బాధ్యత.
-కె.చిరంజీవి
ఇది కధ కాదు. కల్పన కాదు. యదార్ధ జీవితం. ఇందులో పాత్రలన్నీ నిజంగా ఉన్నవే. ఏది కల్పితం కాదు. అయితే అన్ని నమూనా పాత్రలు. అంటే ఒక భూస్వామి ఉన్నాడనుకోండి - ఆ భూస్వామిని యధాతధంగా దించడం కాదు. భుస్వాములైన ఒకడి నుంచి కాలు, ఒకడి నుంచి చేయి, మరొకడి నుంచి తల, వేరోకడి నుండి ఆత్మ- ఇలా తీసుకునివాళ్ల తాలుకూ పరిపూర్ణత్వాన్ని సాధించదామన్నమాట. కాబట్టి ఇందులోని పాత్రలు, సంఘటనలు అన్నీ ఇలా రూపుదిద్దుకున్నవే. ఇది మానవ జీవన వస్తావ కధ. 'కొండ అద్దమందు కొంచమై యుండదా' అన్నట్లు ప్రస్తుత ప్రపంచాన్ని ఈ చిన్న చట్రంలో బిగించడానికి ప్రయత్నించాను. అందువల్ల కొన్ని చిత్రాలు స్పష్టంగా, కొన్ని అస్పష్టంగా, కొన్ని మరీ రేఖామాత్రంగా అనిపిస్తాయి. ఆ రేఖలు కూడా లేకుండా కొన్ని చోట్ల కేవలం రంగులే ఉండవచ్చు. ఈ రంగులు, రేఖలు,చిత్రాలు - వీటన్నిటితో కలిసిన ఏక మొత్తం బొమ్మ ఒక్కటే ఇక్కడ ప్రధానం. ఒక్కటే బొమ్మ! మరి ఈ బొమ్మ ఎలా కుదిరిందో, ఎంతవాస్తమైందో సజీవంగా ఉన్నదో లేదో తేల్చి చెప్పవలసిన రసజ్ఞులు మీరు. ఇది నా ఆత్మావిష్కరణ. నా జాతి జనుల పట్ల నా బాధ్యత. -కె.చిరంజీవి© 2017,www.logili.com All Rights Reserved.