జానపద కళారూపాలకు మూలం - ప్రకృతి. ఈ కళ ఆదిమ సమాజం నుండి వారసత్వంగా సంక్రమించింది. నేడు గుహలలో నాటి శిల్పాలు, రేఖాచిత్రాలు ఆనవాళ్ళుగా మిగిలాయి.
జానపదులు కళలో సైతం దైవాన్ని చూస్తారు. పండుగలకు, వేడుకలుకు మాత్రమే పరిమితమై పోలేదు జానపద కళ. గ్రామ దేవతల కొలువుల్లో గాని రాత్రుళ్ళు వినోదం కోసం ప్రదర్శించే కళల్లో గాని దైవ సంబందమైన గాధలే ఎక్కువ. ఈ కళలన్నీ ఎక్కువ దైవ కళారాధనలు. పూర్వ కాలంలో కూడా కుండలపై, గోడలపై చిత్రీకరణలు ఉండేవని అజంతా ఎల్లోరా వంటి గుహల్లో నాటి చిత్రకళ చూడవచ్చు. తెలుగునాట నాగార్జునకొండ, పెదబొంకురు, కోటిలింగాల ప్రాంతాల్లోని తవ్వకాల్లో లభించిన వస్తువులు, మట్టి పాత్రలు ఈ విషయాన్ని తెలుపుతాయి. తెలుగింటి ముందు ముగ్గు; చిన్న పిల్లలకు పాడే పాటలు; చేతులపై, ముఖం పై చిత్రించుకునే పచ్చబొట్లు కూడా కళారూపామే.
జానపద కళలో భేషజం, ఆడంబరం కనిపించవు. వీరి కళలకు సంబంధించి హంగులు, రంగులు వారె సృష్టించుకోవటం విశేషం. జానపద కళల్లో ఎక్కువ భాగం; నృత్య గానాలకు ప్రాముఖ్యత ఉంటుంది.
ఇందులో జానపదుల కళారూప పరిచయం వాటి పట్ల ఆసక్తిని రేకెత్తిస్తాయి.
డప్పు నృత్యం
ఒగ్గు కధ
బోనాలు
తోలుబొమ్మలు
పులివేషం
యక్షగానం
దొమ్మరి అట
బుడబుక్కలు
కాటిపాపలు
బుర్ర కధ
గొల్లసుద్దులు
జానపద కళారూపాలకు మూలం - ప్రకృతి. ఈ కళ ఆదిమ సమాజం నుండి వారసత్వంగా సంక్రమించింది. నేడు గుహలలో నాటి శిల్పాలు, రేఖాచిత్రాలు ఆనవాళ్ళుగా మిగిలాయి. జానపదులు కళలో సైతం దైవాన్ని చూస్తారు. పండుగలకు, వేడుకలుకు మాత్రమే పరిమితమై పోలేదు జానపద కళ. గ్రామ దేవతల కొలువుల్లో గాని రాత్రుళ్ళు వినోదం కోసం ప్రదర్శించే కళల్లో గాని దైవ సంబందమైన గాధలే ఎక్కువ. ఈ కళలన్నీ ఎక్కువ దైవ కళారాధనలు. పూర్వ కాలంలో కూడా కుండలపై, గోడలపై చిత్రీకరణలు ఉండేవని అజంతా ఎల్లోరా వంటి గుహల్లో నాటి చిత్రకళ చూడవచ్చు. తెలుగునాట నాగార్జునకొండ, పెదబొంకురు, కోటిలింగాల ప్రాంతాల్లోని తవ్వకాల్లో లభించిన వస్తువులు, మట్టి పాత్రలు ఈ విషయాన్ని తెలుపుతాయి. తెలుగింటి ముందు ముగ్గు; చిన్న పిల్లలకు పాడే పాటలు; చేతులపై, ముఖం పై చిత్రించుకునే పచ్చబొట్లు కూడా కళారూపామే. జానపద కళలో భేషజం, ఆడంబరం కనిపించవు. వీరి కళలకు సంబంధించి హంగులు, రంగులు వారె సృష్టించుకోవటం విశేషం. జానపద కళల్లో ఎక్కువ భాగం; నృత్య గానాలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో జానపదుల కళారూప పరిచయం వాటి పట్ల ఆసక్తిని రేకెత్తిస్తాయి. డప్పు నృత్యం ఒగ్గు కధ బోనాలు తోలుబొమ్మలు పులివేషం యక్షగానం దొమ్మరి అట బుడబుక్కలు కాటిపాపలు బుర్ర కధ గొల్లసుద్దులు
© 2017,www.logili.com All Rights Reserved.