ఆరున్నర దశాబ్దాల కవిత్వ జీవితం గల కవి మీద నా నాలుగు దశాబ్దాల సాహిత్య విమర్శ జీవితంలో నేను రాసిన విమర్శ ఇంతే. ఈ రాయడం ఒక రాయడమే కాదనిపించింది. ఈ అసంతృప్తిలోంచే "సినారె కవిత్వానుశీలనం" (డా. సి. నారాయణరెడ్డి గారి కవిత్వ పరామర్శ) అనే గ్రంథం పుట్టుకొచ్చింది. ఈ వ్యాసాలన్నీ గత నాలుగు నెలల్లో రాసినవే. ఈ వ్యాసాలను సి. నారాయణరెడ్డి గారి 86 వ జన్మదినం సందర్భంగా జులై 29 న విభిన్న పత్రికలలో ప్రచురిద్దామని భావించాను. మే నెల 26న 'దేశం ముందడుగు వేయాలి' అనే కవిత్వ రచనా నేపథ్యం గురించి కనుక్కుందామని సి. నారాయణ రెడ్డి గారికి ఫోన్ చేశాను. వారి కుమార్తె గంగగారు మాట్లాడించారు. అప్పుడు ఆయన తనకేమీ గుర్తులేవని బలహీనంగా మాట్లాడారు. అప్పుడే నాకు బాధ కలిగింది. అయినా ఆయన ఇంత త్వరగా కన్నుమూస్తారని అనుకోలేదు. 12.06.2017 ఉదయన్నే వారు కన్నుమూశారు. అభ్యుదయ గొంతు మూగబోయింది. వారు మరణించాక మరికొన్ని వ్యాసాలు రాశాను.
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి