ధైర్యం, ఆత్మవిశ్వాసాలను
పెంచుకోవడం
బహిరంగ ఉపన్యాసాలకు సంబంధించి నేను రూపొందించిన కోర్సుల్లో 1912 నుంచి అయిదు లక్షల మందికి పైగా పురుషులు, మహిళలు శిక్షణ పొందారు. వారిలో చాలా మంది తాము ఈ శిక్షణలో ఎందుకు చేరాలనుకుంటున్నారో....దీని నుంచి ఏం నేరు కోవాలనుకుంటున్నారో లేఖల ద్వారా వెల్లడించేవారు. వాళ్లు వాడిన పదాలు, పదబంధాలు వేరు. అత్యధికుల మౌలిక అవసరం ఒక్కటిగానే కనిపించడం ఆశ్చర్యకరం. 'నేను ఏదైనా సభలో లేచి నిలబడి మాట్లాడాల్సి వస్తే... ఇదే వారందరి అవసరం. ఒక్కొక్కరు ఇలా రాసేవారు... నాకు అతి జాగ్రత్త. నేను స్పష్టంగా ఆలోచించలేనని, ఏకాగ్రత లేదని, చెప్పాలనుకున్నది గుర్తుంచుకోలేనని నాకు చాలా భయం ఉంది.' ఆత్మవిశ్వాసం సాధించాలని ఉంది. సొంతంగా ఆలోచించే సామర్థ్యం సాధించాలని కోరిక. నా ఆలోచనల్ని తార్కిక క్రమంలోకి తేవాలి. వ్యాపారం, క్లబ్బు, సభ ఎక్కడైనా నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా, ఎదుటి వారిని ఒప్పించే సామర్థ్యం సాధించాలి....వేల మంది ఆకాంక్షలు ఇలాగే ఉండేవి.
ఒక మంచి ఉదాహరణ; కొన్నేళ్ల కిందట ఫిలడెల్ఫియాలో మిస్టర్ డి.డబ్ల్యు. మెంట్ అనే ఆయన నా పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో చేరాడు.
కోర్సు ప్రారంభమైన కొద్ది రోజులకే | ఆయన ఒక రోజు నన్ను మాన్యుఫ్యాక్చరర్స్ క్లబ్బులో భోజనానికి ఆహ్వానించాడు. |
మెంట్ నడి వయస్కుడు. చురుకైన జీవితం గడిపేవాడు. ఓ వస్తూత్పత్తి కంపెనీకి ఆయన యజమాని, చర్చిలోను, సామాజిక కార్యక్రమాల్లోనూ నాయకత్వం వహించేవాడు. ఇద్దరం భోజనం చేస్తుండగా ఆయన కాస్త ముందుకు వంగి ఇలా చెప్పాడు... పది మంది ! కలిసిన చాలా సందర్భాల్లో నన్ను మాట్లాడమనేవారు. కానీ నా వల్ల అయ్యేది కాదు. చాలా బెరుకుగా ఉండేది. మెదడు పని చేసేది కాదు. నా జీవితంలో ఇలాంటి ప్రతి సందర్భంలోనూ ఎలాగోలా తప్పించుకునేవాణ్ని. కానీ ఇప్పుడు నేను కాలేజి ట్రస్టు బోర్డుకు ఛైర్మని. బోర్డు సమావేశాల్లో నేను తప్పనిసరిగా అధ్యక్షత వహించి ప్రసంగించాల్సి ఉంటుంది. ఈ వయసులో అలా మాట్లాడే మెలకువలను నేను నేర్చుకోగలనంటారా?'..........
ధైర్యం, ఆత్మవిశ్వాసాలను పెంచుకోవడం బహిరంగ ఉపన్యాసాలకు సంబంధించి నేను రూపొందించిన కోర్సుల్లో 1912 నుంచి అయిదు లక్షల మందికి పైగా పురుషులు, మహిళలు శిక్షణ పొందారు. వారిలో చాలా మంది తాము ఈ శిక్షణలో ఎందుకు చేరాలనుకుంటున్నారో....దీని నుంచి ఏం నేరు కోవాలనుకుంటున్నారో లేఖల ద్వారా వెల్లడించేవారు. వాళ్లు వాడిన పదాలు, పదబంధాలు వేరు. అత్యధికుల మౌలిక అవసరం ఒక్కటిగానే కనిపించడం ఆశ్చర్యకరం. 'నేను ఏదైనా సభలో లేచి నిలబడి మాట్లాడాల్సి వస్తే... ఇదే వారందరి అవసరం. ఒక్కొక్కరు ఇలా రాసేవారు... నాకు అతి జాగ్రత్త. నేను స్పష్టంగా ఆలోచించలేనని, ఏకాగ్రత లేదని, చెప్పాలనుకున్నది గుర్తుంచుకోలేనని నాకు చాలా భయం ఉంది.' ఆత్మవిశ్వాసం సాధించాలని ఉంది. సొంతంగా ఆలోచించే సామర్థ్యం సాధించాలని కోరిక. నా ఆలోచనల్ని తార్కిక క్రమంలోకి తేవాలి. వ్యాపారం, క్లబ్బు, సభ ఎక్కడైనా నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా, ఎదుటి వారిని ఒప్పించే సామర్థ్యం సాధించాలి....వేల మంది ఆకాంక్షలు ఇలాగే ఉండేవి. ఒక మంచి ఉదాహరణ; కొన్నేళ్ల కిందట ఫిలడెల్ఫియాలో మిస్టర్ డి.డబ్ల్యు. మెంట్ అనే ఆయన నా పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో చేరాడు. కోర్సు ప్రారంభమైన కొద్ది రోజులకే | ఆయన ఒక రోజు నన్ను మాన్యుఫ్యాక్చరర్స్ క్లబ్బులో భోజనానికి ఆహ్వానించాడు. | మెంట్ నడి వయస్కుడు. చురుకైన జీవితం గడిపేవాడు. ఓ వస్తూత్పత్తి కంపెనీకి ఆయన యజమాని, చర్చిలోను, సామాజిక కార్యక్రమాల్లోనూ నాయకత్వం వహించేవాడు. ఇద్దరం భోజనం చేస్తుండగా ఆయన కాస్త ముందుకు వంగి ఇలా చెప్పాడు... పది మంది ! కలిసిన చాలా సందర్భాల్లో నన్ను మాట్లాడమనేవారు. కానీ నా వల్ల అయ్యేది కాదు. చాలా బెరుకుగా ఉండేది. మెదడు పని చేసేది కాదు. నా జీవితంలో ఇలాంటి ప్రతి సందర్భంలోనూ ఎలాగోలా తప్పించుకునేవాణ్ని. కానీ ఇప్పుడు నేను కాలేజి ట్రస్టు బోర్డుకు ఛైర్మని. బోర్డు సమావేశాల్లో నేను తప్పనిసరిగా అధ్యక్షత వహించి ప్రసంగించాల్సి ఉంటుంది. ఈ వయసులో అలా మాట్లాడే మెలకువలను నేను నేర్చుకోగలనంటారా?'..........© 2017,www.logili.com All Rights Reserved.