స్నేహవాక్యం
మూల్గు
మహమ్మద్ ఖదీర్ బాబు
ఆక్రందనలు అందరికీ వినపడతాయి. మూల్గును కొందరే వింటారు.
మంచి ఉదయంలానే ఉంటుందది. ఆ పూరి గుడిసె బయట ఏదో ఒక చెట్టు ఆకు పచ్చగా ఎండలో మెరుస్తూ ఉంటుంది. దాపున ఉన్న ఇంటిలో ఎవరో ఆడామె వంట పని చేస్తూ ఉంటుంది. ఇంకో ఇంటిలో ఎవరో నవ్వుకుంటూ ఉండొచ్చు. వినపడే శబ్దాలనే వింటూ అందరూ ఆ దారిన రాకపోకలు సాగిస్తూ ఉండొచ్చు. ఎవరో కుర్రాడు ఆ రోజే విడుదలైన కొత్త సినిమా మార్నింగ్ షో కోసం హుషారుగా పరుగు తీస్తుండవచ్చు. కూడా.
కాని ఆ ఇంటిలో, కుక్కి మంచంలో, మగతలో ఉంటూ, ప్రేలాపనల్లో గతాన్ని కావలించుకుంటూ, వర్తమానాన్ని నిరాకరిస్తూ, ముప్పై ఏళ్లకే మృత్యువుకు సమీపించి, దాని సామీప్యం కోసం దేబిరిస్తున్న, జన్మ చేత నొసటన వేశ్యావృత్తిని రాసుకు పుట్టిన ఆ ఛిద్రయోని మూల్గును ఎవరు వింటారు?.............
స్నేహవాక్యం మూల్గు మహమ్మద్ ఖదీర్ బాబు ఆక్రందనలు అందరికీ వినపడతాయి. మూల్గును కొందరే వింటారు. మంచి ఉదయంలానే ఉంటుందది. ఆ పూరి గుడిసె బయట ఏదో ఒక చెట్టు ఆకు పచ్చగా ఎండలో మెరుస్తూ ఉంటుంది. దాపున ఉన్న ఇంటిలో ఎవరో ఆడామె వంట పని చేస్తూ ఉంటుంది. ఇంకో ఇంటిలో ఎవరో నవ్వుకుంటూ ఉండొచ్చు. వినపడే శబ్దాలనే వింటూ అందరూ ఆ దారిన రాకపోకలు సాగిస్తూ ఉండొచ్చు. ఎవరో కుర్రాడు ఆ రోజే విడుదలైన కొత్త సినిమా మార్నింగ్ షో కోసం హుషారుగా పరుగు తీస్తుండవచ్చు. కూడా. కాని ఆ ఇంటిలో, కుక్కి మంచంలో, మగతలో ఉంటూ, ప్రేలాపనల్లో గతాన్ని కావలించుకుంటూ, వర్తమానాన్ని నిరాకరిస్తూ, ముప్పై ఏళ్లకే మృత్యువుకు సమీపించి, దాని సామీప్యం కోసం దేబిరిస్తున్న, జన్మ చేత నొసటన వేశ్యావృత్తిని రాసుకు పుట్టిన ఆ ఛిద్రయోని మూల్గును ఎవరు వింటారు?.............© 2017,www.logili.com All Rights Reserved.