దిద్దుబాటుకు మందు కధలు 92
తెలుగు సాహితీ వైతాళికుడు గురజాడ అప్పారావు వ్రాసిన, ఆంధ్ర భారతి పత్రికలో 1910 లో అచ్చయిన, దిద్దుబాటు కధని తోలి తెలుగు కధగా చాలాకాలం భావించాం. ఇటీవల ఆ నమ్మకాన్ని ప్రశ్నిస్తూ, ఆచంట సాంఖ్యాయన శర్మ వ్రాసిన లలిత, భండారు అచ్చమాంబ వ్రాసిన స్త్రీ విద్య - ఇలా ఒక్కొక్క కధ లభ్యమవుతూ వచ్చాయి. ఏది తోలి తెలుగు కధ అన్న విషయాన్ని తేల్చుకోవడం కన్నా, దిద్దుబాటుకు ముందు వచ్చిన కధలను సేకరించడం అవసరమని భావించారు ప్రముఖ కధారచయిత వివిన మూర్తి. దీనికి అయన పాటించిన నియమం, వ్రాసిన రచయితగాని, అచ్చువేసిన పత్రిక సంపాదకులుగాని కధ అనడం. ఆ ప్రయత్నంలో ఇప్పటికి 92 కధలు సేకరించారు. ఇవికాక ఇంకా కొన్ని కధలు ఉండవచ్చు. భవిష్యత్తులో బయటపడవచ్చు. ప్రస్తుతానికి ఇవి. వీటి గుణగణాలను, రూప నిర్ణయాలను పాటకులకు, విమర్శకులకు వదిలిపెట్టి, లభ్యమైనంతవరకు మూల సమాచారాన్ని పరిశోధకులకు అందుబాటులో ఉంచడం అవసరమని మా భావన.
- జంపాల చౌదరి
దిద్దుబాటుకు మందు కధలు 92 తెలుగు సాహితీ వైతాళికుడు గురజాడ అప్పారావు వ్రాసిన, ఆంధ్ర భారతి పత్రికలో 1910 లో అచ్చయిన, దిద్దుబాటు కధని తోలి తెలుగు కధగా చాలాకాలం భావించాం. ఇటీవల ఆ నమ్మకాన్ని ప్రశ్నిస్తూ, ఆచంట సాంఖ్యాయన శర్మ వ్రాసిన లలిత, భండారు అచ్చమాంబ వ్రాసిన స్త్రీ విద్య - ఇలా ఒక్కొక్క కధ లభ్యమవుతూ వచ్చాయి. ఏది తోలి తెలుగు కధ అన్న విషయాన్ని తేల్చుకోవడం కన్నా, దిద్దుబాటుకు ముందు వచ్చిన కధలను సేకరించడం అవసరమని భావించారు ప్రముఖ కధారచయిత వివిన మూర్తి. దీనికి అయన పాటించిన నియమం, వ్రాసిన రచయితగాని, అచ్చువేసిన పత్రిక సంపాదకులుగాని కధ అనడం. ఆ ప్రయత్నంలో ఇప్పటికి 92 కధలు సేకరించారు. ఇవికాక ఇంకా కొన్ని కధలు ఉండవచ్చు. భవిష్యత్తులో బయటపడవచ్చు. ప్రస్తుతానికి ఇవి. వీటి గుణగణాలను, రూప నిర్ణయాలను పాటకులకు, విమర్శకులకు వదిలిపెట్టి, లభ్యమైనంతవరకు మూల సమాచారాన్ని పరిశోధకులకు అందుబాటులో ఉంచడం అవసరమని మా భావన. - జంపాల చౌదరి
© 2017,www.logili.com All Rights Reserved.