గాయాల లోతులను కొలిచే కథలు
కుటుంబము, రాజ్యము, మార్కెట్ అనే మూడు వ్యవస్థల మధ్య నలుగుతున్న మనుషుల కథలను కుప్పిలి పద్మ రాశారు. ఈ మూడు వ్యవస్థలకు లేదా సంస్థలకు అప్రతిహత అధికారం సంక్రమింపజేసిన సుదీర్గ మానవ సమూహ ప్రయాణం కూడా ఉంది. పద్మ కథలు ఈ మూడిటిలోంచి ముప్పేటలుగా అల్లుకున్న ఇతివృత్తాలతో ప్రకటితమవుతూ ఉంటాయి. ఈ మూడు వ్యవస్థలకు ఒక ధర్మం, ఒక స్వభావం, ఒక లక్షణం ఉంది. అదేమంటే పీడన, దోపిడి, అణచివేత, అమానవీకరణ, అప్రజాస్వామికత, ఆధిపత్యం. వీటిని ప్రశ్నించటం, ప్రతిఘటించటం, నిరాకరించటం, నిర్మూలించటం అనే లక్ష్యంతో పద్మ కథలు సాగుతాయి. నిర్మూలన అనేది కొంత పెద్దమాట. లేకుండా చేయటం, తొలగించుకోవటం, అధిగమించటం అనే అర్థస్ఫూర్తిని గ్రహించగలిగితే చాలు. అయితే ప్రశ్నకు, ప్రతిఘటనకు, నిరాకరణకు అంతా సంఘటితం కావటమనే భావనకు పద్మ కథలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవు. రచయిత దృక్పథంలో కూడా సంఘటితం, సంఘభావంలాంటి వాటికి అంతగా స్థానం లేనట్టుగా ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలోనే ప్రతిఘటన లేదా పరిష్కారం కొరకు ఆయా పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ ప్రయత్న క్రమంలో ఆయా వ్యక్తులు, పాత్రలు తమ స్థితిగతులను, సామర్థ్యాలను, పరిమితులను అవగాహన చేసుకోగలుగుతాయి. వ్యక్తిగతస్థాయి పరిష్కార ప్రయత్నాలలో ఎడతెగని సంఘర్షణను అవి ఎదుర్కోవటం కూడా గమనించవచ్చు.
ఆధిపత్య రాజకీయాలను అర్థం చేసుకొని ప్రశ్నించే స్వభావం, చైతన్యం పెరగటం తెలుగు సాహిత్యంలో 1980 ల నాటికి వచ్చిన ఒక పరిణామం. ఈ పరిణామంలో స్త్రీవాదం ఒక పాయ. ఈ పాయలో బలమైన ఉరవడి, ఉధృతిని కలిగించి పెంచిన గొంతుల్లో పద్మది ఒక గొంతు.
మొదట చెప్పినట్టు కుటుంబం, రాజ్యం, మార్కెట్ వ్యవస్థలలో రాజ్యం పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. అట్లాగని రాజ్యం పాత్ర లేకుండానూ ఉండదు. ప్రతి వ్యక్తి కూడా సంక్షిప్త రాజ్యమేనని ఫుకో విశ్లేషణ. ఇది పురుషుడికి సరిగ్గా వర్తిస్తుంది. రాజ్యం అంటే పురుష.....................
గాయాల లోతులను కొలిచే కథలు కుటుంబము, రాజ్యము, మార్కెట్ అనే మూడు వ్యవస్థల మధ్య నలుగుతున్న మనుషుల కథలను కుప్పిలి పద్మ రాశారు. ఈ మూడు వ్యవస్థలకు లేదా సంస్థలకు అప్రతిహత అధికారం సంక్రమింపజేసిన సుదీర్గ మానవ సమూహ ప్రయాణం కూడా ఉంది. పద్మ కథలు ఈ మూడిటిలోంచి ముప్పేటలుగా అల్లుకున్న ఇతివృత్తాలతో ప్రకటితమవుతూ ఉంటాయి. ఈ మూడు వ్యవస్థలకు ఒక ధర్మం, ఒక స్వభావం, ఒక లక్షణం ఉంది. అదేమంటే పీడన, దోపిడి, అణచివేత, అమానవీకరణ, అప్రజాస్వామికత, ఆధిపత్యం. వీటిని ప్రశ్నించటం, ప్రతిఘటించటం, నిరాకరించటం, నిర్మూలించటం అనే లక్ష్యంతో పద్మ కథలు సాగుతాయి. నిర్మూలన అనేది కొంత పెద్దమాట. లేకుండా చేయటం, తొలగించుకోవటం, అధిగమించటం అనే అర్థస్ఫూర్తిని గ్రహించగలిగితే చాలు. అయితే ప్రశ్నకు, ప్రతిఘటనకు, నిరాకరణకు అంతా సంఘటితం కావటమనే భావనకు పద్మ కథలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవు. రచయిత దృక్పథంలో కూడా సంఘటితం, సంఘభావంలాంటి వాటికి అంతగా స్థానం లేనట్టుగా ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలోనే ప్రతిఘటన లేదా పరిష్కారం కొరకు ఆయా పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ ప్రయత్న క్రమంలో ఆయా వ్యక్తులు, పాత్రలు తమ స్థితిగతులను, సామర్థ్యాలను, పరిమితులను అవగాహన చేసుకోగలుగుతాయి. వ్యక్తిగతస్థాయి పరిష్కార ప్రయత్నాలలో ఎడతెగని సంఘర్షణను అవి ఎదుర్కోవటం కూడా గమనించవచ్చు. ఆధిపత్య రాజకీయాలను అర్థం చేసుకొని ప్రశ్నించే స్వభావం, చైతన్యం పెరగటం తెలుగు సాహిత్యంలో 1980 ల నాటికి వచ్చిన ఒక పరిణామం. ఈ పరిణామంలో స్త్రీవాదం ఒక పాయ. ఈ పాయలో బలమైన ఉరవడి, ఉధృతిని కలిగించి పెంచిన గొంతుల్లో పద్మది ఒక గొంతు. మొదట చెప్పినట్టు కుటుంబం, రాజ్యం, మార్కెట్ వ్యవస్థలలో రాజ్యం పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. అట్లాగని రాజ్యం పాత్ర లేకుండానూ ఉండదు. ప్రతి వ్యక్తి కూడా సంక్షిప్త రాజ్యమేనని ఫుకో విశ్లేషణ. ఇది పురుషుడికి సరిగ్గా వర్తిస్తుంది. రాజ్యం అంటే పురుష.....................© 2017,www.logili.com All Rights Reserved.