కేరమ్ బోర్డు
“గరమ్ గరమ్” అంటూ వేడి వేడి వేరుశనగపప్పు అమ్మేవాడు సహితం సముద్రతీరంలో ఎక్కడా కనబడలేదు. రవణ ముడుచుకు కూర్చున్నాడు. శరీరం జిల్లు మనిపించే చలి, సముద్రతరంగాల హోరు తప్ప ఇంకేం వినబడ్డంలేదు. బీచి అంతా ఖాళీ అయిపోయింది.
నాకు మాత్రం హుషారుగానే వుంది. లోపల శరీరాన్ని పట్టి ఉన్నిస్వెట్టరు, చెవులచుట్టూ మఫ్లరు తగిన వెచ్చదనాన్ని కలిగిస్తున్నాయి.
హార్బరు కాలువలో డ్రెక్టరు బుర్రుమని బిగులు వేసింది. ఏడున్నర దాటినట్లుంది. రవణ మోకాళ్లకు గెడ్డం ఆనించి టౌనుహాలు మీది గోపురాలను తిలకిస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు. చలి, ఇంటికి పోదామనడం లేదు. వాడినేదో వేధిస్తున్నాది. క్షణ క్షణానికీ వాడి హావభావాల్లో మార్పు కనబడుతున్నది.
తలదువ్వక నిర్లక్ష్యంగా జుత్తు చిందరవందర చేసుకున్నా, లేత వయస్సులో లే లేత వంకాయలాంటి ముఖంతో రవణ చక్కని కుర్రవాడు. ఎవరినైనా ఆకర్షిస్తాడు. చూసీ చూడ్డంతోనే వాడిమీద నాకు ఎక్కడలేని తనవాడి తనం వచ్చి ఆపేక్ష కలిగింది. వాడి బోగట్టా ఇంకా నాకేం తెలియదు. కుర్రవాడు చాకులాంటివాడు. బీచిమీద కలిశాడు. ఎందుకు ఆగమ్మ కాకిలాగ తయారయాడో మాత్రం తెలియలేదు.
“రవణా, ఇహ లేద్దామా?” అని నేను అడిగాను.
“కూర్చుందురూ" అన్నాడు.
పసిపిల్లలకీ పందిరిరాటలకీ చలి వెయ్యదంటారు. ఇదే కాబోలు! "పదా, భోజనం చేద్దాం. వేళైంది" అన్నా.
"ఐతే పదండి. నేనూ రీడింగు రూముకి పోతాను."........................
కేరమ్ బోర్డు “గరమ్ గరమ్” అంటూ వేడి వేడి వేరుశనగపప్పు అమ్మేవాడు సహితం సముద్రతీరంలో ఎక్కడా కనబడలేదు. రవణ ముడుచుకు కూర్చున్నాడు. శరీరం జిల్లు మనిపించే చలి, సముద్రతరంగాల హోరు తప్ప ఇంకేం వినబడ్డంలేదు. బీచి అంతా ఖాళీ అయిపోయింది. నాకు మాత్రం హుషారుగానే వుంది. లోపల శరీరాన్ని పట్టి ఉన్నిస్వెట్టరు, చెవులచుట్టూ మఫ్లరు తగిన వెచ్చదనాన్ని కలిగిస్తున్నాయి. హార్బరు కాలువలో డ్రెక్టరు బుర్రుమని బిగులు వేసింది. ఏడున్నర దాటినట్లుంది. రవణ మోకాళ్లకు గెడ్డం ఆనించి టౌనుహాలు మీది గోపురాలను తిలకిస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు. చలి, ఇంటికి పోదామనడం లేదు. వాడినేదో వేధిస్తున్నాది. క్షణ క్షణానికీ వాడి హావభావాల్లో మార్పు కనబడుతున్నది. తలదువ్వక నిర్లక్ష్యంగా జుత్తు చిందరవందర చేసుకున్నా, లేత వయస్సులో లే లేత వంకాయలాంటి ముఖంతో రవణ చక్కని కుర్రవాడు. ఎవరినైనా ఆకర్షిస్తాడు. చూసీ చూడ్డంతోనే వాడిమీద నాకు ఎక్కడలేని తనవాడి తనం వచ్చి ఆపేక్ష కలిగింది. వాడి బోగట్టా ఇంకా నాకేం తెలియదు. కుర్రవాడు చాకులాంటివాడు. బీచిమీద కలిశాడు. ఎందుకు ఆగమ్మ కాకిలాగ తయారయాడో మాత్రం తెలియలేదు. “రవణా, ఇహ లేద్దామా?” అని నేను అడిగాను. “కూర్చుందురూ" అన్నాడు. పసిపిల్లలకీ పందిరిరాటలకీ చలి వెయ్యదంటారు. ఇదే కాబోలు! "పదా, భోజనం చేద్దాం. వేళైంది" అన్నా. "ఐతే పదండి. నేనూ రీడింగు రూముకి పోతాను."........................© 2017,www.logili.com All Rights Reserved.