గురజాడను మార్గదర్శకుడిగా భావించి మనుషులు బాగుపడాలి, దేశం బాగుపడాలి, సంఘం బాగుపడాలి, విశ్వశాంతి కావలి అనే విశాల ప్రాతిపదికపై రచనలు చేసినవారు పూసపాటి కృష్ణంరాజు. సుబోధకంగా, కళాత్మకంగా అతి కొద్ది మంచి కథలు మాత్రమే రాసి, ఎందరో రచయితల, విమర్శకుల, సాహిత్య పిపాసుల మన్ననలు అందుకున్నవారిలో పూసపాటి ప్రథములు.
ఉత్తరాంధ్రలోని విలక్షణమైన రాచవారి జీవితాలను, నిజానికీ భ్రమకూ తేడా తెలియని అక్కడి వారి అమాయకపు సంస్కృతిని కథల్లో చూపెట్టిన రచయిత. తనకు తెలిసిన జీవితం గురించి మాత్రమే రాయాలని భావించి అలాగే రాశారు. ఉత్తరాంధ్ర కథసాహిత్యంలో ఆణిముత్యాలు పూసపాటి వారి కథలు. గతించిన జీవిత విలువలకూ అరుదెంచిన నూత్న జీవిత వలువల వెలుగులకూ మధ్యనున్న ఘర్షణను చెప్పీ చెప్పకుండానే రహస్యం విప్పి చెప్పినట్లుండే ఉదాత్త శిల్పం పూసపాటివారి కథలలో దర్శనమిస్తుంది. "జీవిత వక్రీకరణకు ఒడిగట్టి మెలో డ్రామా సహాయంతో కథని కంచికి పంపించే అర్భకపు రచయితలతో పోల్చుకుంటే కృష్ణంరాజు మహా మంచి రచయిత."
గురజాడను మార్గదర్శకుడిగా భావించి మనుషులు బాగుపడాలి, దేశం బాగుపడాలి, సంఘం బాగుపడాలి, విశ్వశాంతి కావలి అనే విశాల ప్రాతిపదికపై రచనలు చేసినవారు పూసపాటి కృష్ణంరాజు. సుబోధకంగా, కళాత్మకంగా అతి కొద్ది మంచి కథలు మాత్రమే రాసి, ఎందరో రచయితల, విమర్శకుల, సాహిత్య పిపాసుల మన్ననలు అందుకున్నవారిలో పూసపాటి ప్రథములు. ఉత్తరాంధ్రలోని విలక్షణమైన రాచవారి జీవితాలను, నిజానికీ భ్రమకూ తేడా తెలియని అక్కడి వారి అమాయకపు సంస్కృతిని కథల్లో చూపెట్టిన రచయిత. తనకు తెలిసిన జీవితం గురించి మాత్రమే రాయాలని భావించి అలాగే రాశారు. ఉత్తరాంధ్ర కథసాహిత్యంలో ఆణిముత్యాలు పూసపాటి వారి కథలు. గతించిన జీవిత విలువలకూ అరుదెంచిన నూత్న జీవిత వలువల వెలుగులకూ మధ్యనున్న ఘర్షణను చెప్పీ చెప్పకుండానే రహస్యం విప్పి చెప్పినట్లుండే ఉదాత్త శిల్పం పూసపాటివారి కథలలో దర్శనమిస్తుంది. "జీవిత వక్రీకరణకు ఒడిగట్టి మెలో డ్రామా సహాయంతో కథని కంచికి పంపించే అర్భకపు రచయితలతో పోల్చుకుంటే కృష్ణంరాజు మహా మంచి రచయిత."© 2017,www.logili.com All Rights Reserved.