మాలవ్యానగర్; ఈ కథ మొదలయ్యింది ఇక్కడే
లడకాలో రెఫ్యూజీ హై
నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. ఢిల్లి తల్లిదండ్రులకు పుట్టిన ఢిల్లీ కుర్రాడిని నేను. అలాంటిది కాందిశీకుడు, శరణార్ధి అని నన్ను సంబోధించటం మింగుడుపడలేదు. అదీ నాకు పిల్లల నిచ్చే వాళ్ల నోటి నుంచి. అలా అనిపించుకోవటం ఇన్నేళ్ల జీవితంలో ఇదే మొదలు. అది 2003వ సంవత్సరం. 56 ఏళ్ల క్రితం మా తాత కుటుంబం విభజన తర్వాత పాకిస్తాన్ లోని ముల్తాన్ జిల్లా నుంచి ఇక్కడకు వచ్చిన మాట వాస్తవమే. కానీ వాళ్ల మాటలు ఒక వాస్తవాన్ని చెబుతున్నట్టుగా లేవు. నా గతాన్ని తడిమి, సర్వీసు క్లాసు పంజాబీని అవమానించినట్టుగా అనిపించాయి. వ్యాపార జైన్ కుటుంబం నుంచి వచ్చిన తమ కుమార్తె మనసు దోచుకున్న వ్యక్తి 'ఔకత్' ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ కుర్రాడు పేరు పొందిన విద్యాసంస్థల్లో చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకుని, పెద్దవాళ్ల మనసును గెలుచుకుని వాళ్లమ్మాయి చేయి అందుకుంటున్నాడు. అది వేరే విషయం.
నిజానికి మా తాతగారు... మా నాన్నకు నాన్న... తన పిల్లలతో కలిసి ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు మాలవ్యానగర్ రెఫ్యూజీ కాలనీలో 200 గజాల ప్లాట్ ను కేటాయించారు. ఇదే స్థలంలో 100 గజాల వంతున ఆరు ఫ్లోర్లను ఆయన నిర్మించారు. అందులో 90/20... నబ్బే బిస్... అది ఎక్కువ కాలం నాకు చిరునామాగా ఉండేది.
బాల్యంలో నేను మా నాయనమ్మను ముల్తాన్ నగర్ గురించి కథలు చెప్పమని పీడించిన విషయం ఇంకా నాకు గుర్తుంది. అక్కడ వ్యవసాయం గురించి చెబుతున్నప్పుడు ఆమె కళ్లలో మెరుపు కనిపించేది. కాలినడకన పొలం మొత్తం చుట్టి రావలసిన పరిస్థితి. తెల్లవారక ముందే లేచి బయలుదేరి వెళితే, మరుసటి రోజు ఉదయానికి గాని పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావటం సాధ్యమయ్యేది కాదని ఆమె తరచూ చెప్పేది. అవును మరి... మీరు వెళ్లేటప్పుడు విత్తనాలు నాటుకుంటూ వెళ్లి, వచ్చేటప్పుడు పంట కోసుకుంటూ వచ్చేవాళ్లు అని నేను చమత్కారంగా అనేవాడిని.................
మాలవ్యానగర్; ఈ కథ మొదలయ్యింది ఇక్కడే లడకాలో రెఫ్యూజీ హై నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. ఢిల్లి తల్లిదండ్రులకు పుట్టిన ఢిల్లీ కుర్రాడిని నేను. అలాంటిది కాందిశీకుడు, శరణార్ధి అని నన్ను సంబోధించటం మింగుడుపడలేదు. అదీ నాకు పిల్లల నిచ్చే వాళ్ల నోటి నుంచి. అలా అనిపించుకోవటం ఇన్నేళ్ల జీవితంలో ఇదే మొదలు. అది 2003వ సంవత్సరం. 56 ఏళ్ల క్రితం మా తాత కుటుంబం విభజన తర్వాత పాకిస్తాన్ లోని ముల్తాన్ జిల్లా నుంచి ఇక్కడకు వచ్చిన మాట వాస్తవమే. కానీ వాళ్ల మాటలు ఒక వాస్తవాన్ని చెబుతున్నట్టుగా లేవు. నా గతాన్ని తడిమి, సర్వీసు క్లాసు పంజాబీని అవమానించినట్టుగా అనిపించాయి. వ్యాపార జైన్ కుటుంబం నుంచి వచ్చిన తమ కుమార్తె మనసు దోచుకున్న వ్యక్తి 'ఔకత్' ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ కుర్రాడు పేరు పొందిన విద్యాసంస్థల్లో చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకుని, పెద్దవాళ్ల మనసును గెలుచుకుని వాళ్లమ్మాయి చేయి అందుకుంటున్నాడు. అది వేరే విషయం. నిజానికి మా తాతగారు... మా నాన్నకు నాన్న... తన పిల్లలతో కలిసి ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు మాలవ్యానగర్ రెఫ్యూజీ కాలనీలో 200 గజాల ప్లాట్ ను కేటాయించారు. ఇదే స్థలంలో 100 గజాల వంతున ఆరు ఫ్లోర్లను ఆయన నిర్మించారు. అందులో 90/20... నబ్బే బిస్... అది ఎక్కువ కాలం నాకు చిరునామాగా ఉండేది. బాల్యంలో నేను మా నాయనమ్మను ముల్తాన్ నగర్ గురించి కథలు చెప్పమని పీడించిన విషయం ఇంకా నాకు గుర్తుంది. అక్కడ వ్యవసాయం గురించి చెబుతున్నప్పుడు ఆమె కళ్లలో మెరుపు కనిపించేది. కాలినడకన పొలం మొత్తం చుట్టి రావలసిన పరిస్థితి. తెల్లవారక ముందే లేచి బయలుదేరి వెళితే, మరుసటి రోజు ఉదయానికి గాని పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావటం సాధ్యమయ్యేది కాదని ఆమె తరచూ చెప్పేది. అవును మరి... మీరు వెళ్లేటప్పుడు విత్తనాలు నాటుకుంటూ వెళ్లి, వచ్చేటప్పుడు పంట కోసుకుంటూ వచ్చేవాళ్లు అని నేను చమత్కారంగా అనేవాడిని.................© 2017,www.logili.com All Rights Reserved.