ఇచ్ఛామతి గురించి కొంచెం ...
భారత దేశాన్నీ, ఈ నాటి బంగ్లాదేశ్ను కలుపుతూ ప్రవహించే ఒక నది, ఇచ్ఛామతి. దేశవిభజనకు ముందటి అవిభాజ్య బెంగాల్లో, తన తీరం పొడవునా విస్తరించిన జనజీవనానికీ, సామాజిక - రాజకీయ, పరిణామాలకూ సాక్షిగా నిలిచిన జలవాహిని.
ఆ నదీతీరంలోని జెస్సోర్ జిల్లాలో ఒక గ్రామంలో తన చిన్నతనాన్ని గడిపాడు. బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్. తన బాల్య స్మృతులలో ముద్రించుకుపోయిన ఇచ్ఛామతిని తన సాహిత్యంలోనికి సౌందర్యభరితంగా ప్రవహింపచేశాడు.
ఇచ్ఛామతీ తీరంలోని చిన్నచిన్న గ్రామాల్లో అనామకంగా జీవించి, గతించిన మానవుల సుఖదుఃఖాలనూ, ఆ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యాన్నీ దృశ్యమానం చేసే ఒక రచనను ఏనాటికైనా చెయ్యాలనీ, దానికి 'ఇచ్ఛామతి' అని పేరు పెట్టాలనీ ఆయనకు గాఢమైన ఆకాంక్ష, 1940లలో రాసుకున్న డైరీలో ఈ కోరికను వ్యక్తం చేశాడు.
19వ శతాబ్ది ఉత్తరార్థంలో దక్షిణ బెంగాల్లోని పాంచ్పోతా అనే గ్రామమూ, దాని సమీపంలోని మొల్లాహాతీలో ఏర్పాటయిన ఒక నీలి పంట ప్లాంటేషన్ ఈ రచనలోని కథాస్థలం. బ్రిటిష్ దొరల యాజమాన్యంలో నడిచిన ఇండిగోప్లాంటేషన్లను అక్కడి ప్రజలు "నీలకుటి " లని పిలిచేవారు.
నీలకుటే యజమానులైన తెల్లదొరలు, బ్రాహ్మణులైన దివాన్లు, ఎస్టేట్ ప్రైవేటు సైన్యంగా పనిచేసే ' లాఠీయాల్' అనే వస్తాదులూ - ఈ అధికార యంత్రాంగం చెలాయించే దౌర్జన్యం కింద పేదప్రజల జీవితాలు నలిగిపోయాయి. ధాన్యం పండించుకునే వ్యవసాయ భూముల్లో బలవంతంగా నీలిపంట సాగుచేయించటంతో ఇటు తిండిగింజలు కరువై, అటు నీలి పంటకు గిట్టుబాటు ధర అందక రైతులు ఆర్థికంగా చితికిపోయారు. వాళ్ళ లోలోపల రగులుతూ వచ్చిన అసంతృప్తి, ఆగ్రహం 1859 - 1862 నాటికి సాయుధ తిరుగుబాటుగా బద్దలైంది. ఆ పరిణామమే 'ఇండిగో రివోల్ట్' గా చరిత్రలో నమోదయింది.
బెంగాల్ గ్రామీణ ప్రాంతాలలోకి 'నీలకుటి' ప్రవేశంతో అక్కడ తరతరాలుగా స్థిరపడిన సాంస్కృతిక జీవనంలో కూడా చలనాలు మొదలయ్యాయి. గ్రామాల దాకా విస్తరిస్తున్న రైలు మార్గాలు, మోటారు బోట్లు ఈ మార్పులకు దోహదం చేశాయి.
కఠినమైన మతవిశ్వాసాలతో, కుల నియమాలతో జీవిస్తూ ఉండిన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాలలోని కొందరు యువకులు ఇంగ్లిష్ చదువుల్లోకి, ప్రభుత్వ ఉద్యోగాలలోకి ప్రవేశించి నగరాలకు చేరారు. వారిద్వారా గ్రామీణ - పట్టణ ప్రాంతాల ||ను అనుసంధానం ఏర్పడింది. దేశంలో కొత్తగా మొదలైన ఆర్థిక, రాజకీయ పరిణామాల
వార్తలు గ్రామాల దాకా చేరుతున్నాయి...................
ఇచ్ఛామతి గురించి కొంచెం ... భారత దేశాన్నీ, ఈ నాటి బంగ్లాదేశ్ను కలుపుతూ ప్రవహించే ఒక నది, ఇచ్ఛామతి. దేశవిభజనకు ముందటి అవిభాజ్య బెంగాల్లో, తన తీరం పొడవునా విస్తరించిన జనజీవనానికీ, సామాజిక - రాజకీయ, పరిణామాలకూ సాక్షిగా నిలిచిన జలవాహిని. ఆ నదీతీరంలోని జెస్సోర్ జిల్లాలో ఒక గ్రామంలో తన చిన్నతనాన్ని గడిపాడు. బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్. తన బాల్య స్మృతులలో ముద్రించుకుపోయిన ఇచ్ఛామతిని తన సాహిత్యంలోనికి సౌందర్యభరితంగా ప్రవహింపచేశాడు. ఇచ్ఛామతీ తీరంలోని చిన్నచిన్న గ్రామాల్లో అనామకంగా జీవించి, గతించిన మానవుల సుఖదుఃఖాలనూ, ఆ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యాన్నీ దృశ్యమానం చేసే ఒక రచనను ఏనాటికైనా చెయ్యాలనీ, దానికి 'ఇచ్ఛామతి' అని పేరు పెట్టాలనీ ఆయనకు గాఢమైన ఆకాంక్ష, 1940లలో రాసుకున్న డైరీలో ఈ కోరికను వ్యక్తం చేశాడు. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో దక్షిణ బెంగాల్లోని పాంచ్పోతా అనే గ్రామమూ, దాని సమీపంలోని మొల్లాహాతీలో ఏర్పాటయిన ఒక నీలి పంట ప్లాంటేషన్ ఈ రచనలోని కథాస్థలం. బ్రిటిష్ దొరల యాజమాన్యంలో నడిచిన ఇండిగోప్లాంటేషన్లను అక్కడి ప్రజలు "నీలకుటి " లని పిలిచేవారు. నీలకుటే యజమానులైన తెల్లదొరలు, బ్రాహ్మణులైన దివాన్లు, ఎస్టేట్ ప్రైవేటు సైన్యంగా పనిచేసే ' లాఠీయాల్' అనే వస్తాదులూ - ఈ అధికార యంత్రాంగం చెలాయించే దౌర్జన్యం కింద పేదప్రజల జీవితాలు నలిగిపోయాయి. ధాన్యం పండించుకునే వ్యవసాయ భూముల్లో బలవంతంగా నీలిపంట సాగుచేయించటంతో ఇటు తిండిగింజలు కరువై, అటు నీలి పంటకు గిట్టుబాటు ధర అందక రైతులు ఆర్థికంగా చితికిపోయారు. వాళ్ళ లోలోపల రగులుతూ వచ్చిన అసంతృప్తి, ఆగ్రహం 1859 - 1862 నాటికి సాయుధ తిరుగుబాటుగా బద్దలైంది. ఆ పరిణామమే 'ఇండిగో రివోల్ట్' గా చరిత్రలో నమోదయింది. బెంగాల్ గ్రామీణ ప్రాంతాలలోకి 'నీలకుటి' ప్రవేశంతో అక్కడ తరతరాలుగా స్థిరపడిన సాంస్కృతిక జీవనంలో కూడా చలనాలు మొదలయ్యాయి. గ్రామాల దాకా విస్తరిస్తున్న రైలు మార్గాలు, మోటారు బోట్లు ఈ మార్పులకు దోహదం చేశాయి. కఠినమైన మతవిశ్వాసాలతో, కుల నియమాలతో జీవిస్తూ ఉండిన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాలలోని కొందరు యువకులు ఇంగ్లిష్ చదువుల్లోకి, ప్రభుత్వ ఉద్యోగాలలోకి ప్రవేశించి నగరాలకు చేరారు. వారిద్వారా గ్రామీణ - పట్టణ ప్రాంతాల ||ను అనుసంధానం ఏర్పడింది. దేశంలో కొత్తగా మొదలైన ఆర్థిక, రాజకీయ పరిణామాల వార్తలు గ్రామాల దాకా చేరుతున్నాయి...................© 2017,www.logili.com All Rights Reserved.