జగన్నాథ పండితరాయలు
కోనసీమ, ముంగండ - విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు జగన్నాథుని తాతగారికి ప్రదానం చేసిన పేరుగడించిన అగ్రహారం.
పెద్దచెరువుగట్టు. గట్టుకు పెడగా రావిచెట్టు. చెట్టుకింద రచ్చబండ.
సాయంకాలపు ఎండ నీడల్ని పరుస్తోంది.
రాతిబండ మీద జగన్నాథుడు. ఎదురుగా చెరువులో నీటి కదలికల్ని చూస్తున్నాడు. మేధలో తండ్రి చెబుతున్న మహాభాష్యం కదులుతోంది. మనసులో పరిపరి సాహిత్య భావాలు తొణికిసలాడుతున్నై.
జగన్నాథుడికి కొంచెం దూరంలో మంత్రవాది పరమేశ్వరశాస్త్రి చేతిలోని తాళపత్ర గ్రంథాన్ని తిరగేస్తున్నాడు. రచ్చబండమీద వాయవ్యంగా కూచుని- పరిటిగోపాలం, యాళ్ల చంద్రం కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నారు. “నీకు తెలుసుగా మాఁవా. నేరకపోయి మా తమ్ముడు ఆస్తిని అమ్ముకుని కుటుంబాన్ని అంబాజీపేటకి మార్చుకున్నాడు. నే చెబితే విన్లేదు. వ్యాపారంలోకి దిగి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు ఆకులుపట్టుకుని లాభమేముంది?" అంటున్నాడు గోపాలం దిగులుగా.
"రాశులు రాల్చి పొయ్యటానికి అవతలి వాళ్లేమైనా పిచ్చోళ్ల, వెజ్జోళ్లా? అందుకనే, కొత్తచోట మన శక్తియుక్తుల్ని తెలుసుకుని అడుగెయ్యాలి; మసలుకోవాలి".
మాటలు వినిపిస్తున్నై. తన ఊహల్లో గిరికీలు కొడుతున్న మాటలూ ఇవే!
యథాలాపంగా చూపు మరలింది. చెరువుమెట్ల మీద... పదిహేను పదహారేళ్ల పిల్ల. చేతిలో కడవ. నీళ్లకోసం వచ్చినట్టుంది. ఆమెకు పక్కగా ఇద్దరు పడుచు కుర్రాళ్లు. భంగిమల్ని చూస్తుంటే ఎకసెక్కాలాడుతున్నట్లనిపించింది. రేవులో వేరే మనుషులు లేరు. రాతి అంచుకు జరిగి కాలు నేలకానించి, అంగవస్త్రాన్ని సర్దుకుని అడుగువేశాడు. చెరువు దగ్గరికి నడుస్తున్నాడు...
మాటలు స్పష్టమైనై. "పండు తయారైందిరా!”......................
జగన్నాథ పండితరాయలు కోనసీమ, ముంగండ - విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు జగన్నాథుని తాతగారికి ప్రదానం చేసిన పేరుగడించిన అగ్రహారం. పెద్దచెరువుగట్టు. గట్టుకు పెడగా రావిచెట్టు. చెట్టుకింద రచ్చబండ. సాయంకాలపు ఎండ నీడల్ని పరుస్తోంది. రాతిబండ మీద జగన్నాథుడు. ఎదురుగా చెరువులో నీటి కదలికల్ని చూస్తున్నాడు. మేధలో తండ్రి చెబుతున్న మహాభాష్యం కదులుతోంది. మనసులో పరిపరి సాహిత్య భావాలు తొణికిసలాడుతున్నై. జగన్నాథుడికి కొంచెం దూరంలో మంత్రవాది పరమేశ్వరశాస్త్రి చేతిలోని తాళపత్ర గ్రంథాన్ని తిరగేస్తున్నాడు. రచ్చబండమీద వాయవ్యంగా కూచుని- పరిటిగోపాలం, యాళ్ల చంద్రం కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నారు. “నీకు తెలుసుగా మాఁవా. నేరకపోయి మా తమ్ముడు ఆస్తిని అమ్ముకుని కుటుంబాన్ని అంబాజీపేటకి మార్చుకున్నాడు. నే చెబితే విన్లేదు. వ్యాపారంలోకి దిగి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు ఆకులుపట్టుకుని లాభమేముంది?" అంటున్నాడు గోపాలం దిగులుగా. "రాశులు రాల్చి పొయ్యటానికి అవతలి వాళ్లేమైనా పిచ్చోళ్ల, వెజ్జోళ్లా? అందుకనే, కొత్తచోట మన శక్తియుక్తుల్ని తెలుసుకుని అడుగెయ్యాలి; మసలుకోవాలి". మాటలు వినిపిస్తున్నై. తన ఊహల్లో గిరికీలు కొడుతున్న మాటలూ ఇవే! యథాలాపంగా చూపు మరలింది. చెరువుమెట్ల మీద... పదిహేను పదహారేళ్ల పిల్ల. చేతిలో కడవ. నీళ్లకోసం వచ్చినట్టుంది. ఆమెకు పక్కగా ఇద్దరు పడుచు కుర్రాళ్లు. భంగిమల్ని చూస్తుంటే ఎకసెక్కాలాడుతున్నట్లనిపించింది. రేవులో వేరే మనుషులు లేరు. రాతి అంచుకు జరిగి కాలు నేలకానించి, అంగవస్త్రాన్ని సర్దుకుని అడుగువేశాడు. చెరువు దగ్గరికి నడుస్తున్నాడు... మాటలు స్పష్టమైనై. "పండు తయారైందిరా!”......................© 2017,www.logili.com All Rights Reserved.