కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఇతర అవార్డులూ, రివార్డులూ - అదొక పెద్ద పట్టిక. కథగానీ, నవలగానీ రాసే రచన మరేదైనాగానీ, ప్రతి ఒక్కదాన్నీ 'మూస' కి భిన్నంగా తనదైన 'ముద్ర' తో. 'ప్రజ్ఞ' తో ఆవిష్కరిస్తున్న ప్రతిభామూర్తి సలీం. ఆయన రచనలంటే అందరకూ, నాకు ప్రత్యేకంగా మక్కువ. సౌమ్యుడూ, సౌజన్యశీలీ, నిత్య సాహిత్య విద్యార్థీ సలీం. అందుకే ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా నాకు గౌరవం. ఆ మక్కువా, ఈ గౌరవమూ కలిపి నన్ను ఈ గ్రంథ రచనకు పురిగొల్పాయి.
ఇది 'దీపిక'. సలీం రాసిన ఏడు నవలలమీద విశ్లేషణాత్మక పరామర్శ. 'దీపిక' ఎప్పుడూ వెలుగుల్నే ప్రసరిస్తుంది. నా సమీక్షల్ని గురించీ, విశ్లేషణల్ని గురించీ 'అంతా మంచి చేబుతాడనే' వ్యాఖ్య ఉన్నది. ఇది నాకొక 'సర్టిఫికేట్' గా భావిస్తాను. లోకానికి మంచి చెప్పాలి. మనిషికి విడిగా లోపం చూపాలి! గ్రంథ పరామర్శ అనేది చదువరిచేత ఆ పుస్తకాన్ని కొనిపించి, చదివించి, ఆ రచనలోని మంచిని ఆనందించడానికీ, ఆచరించడానికీ సహాయకారి కావాలి. ఇది నా నిబద్ధత!
సలీం నవలల్ని పరామర్శించేటప్పుడు దాదాపు ప్రతి నవలలోని మొత్తం ఇతివృత్తాన్ని పాఠకుడు దర్శించగలిగే విధంగా అనేక చోట్ల వివరంగా చెప్పాను. దీనికి కారణం అసలు కథ తెలియజేయకుండా విమర్శను సంధించే విధానం నా పరామర్శ అంగీకరించకపోవడమే. అలాగే నవలా భాగాల 'ఉటంకింపులు' కొన్ని చోట్ల దీర్ఘంగా ఉన్నాయి. ఆ అంశంలో రచయిత ప్రతిభా, రచనలోని 'ఆత్మ' చదువరికి అవగతం కావడానికి వాటిని ఆ విధంగా పొందుపరచవలసి వచ్చింది. పాత్ర చిత్రణ అధ్యాయంలో ముఖ్యమైన కొన్ని పాత్రల ఆవిష్కారాన్ని మాత్రమే విశ్లేషించాను. మొత్తం 7 నవలల్లో అనేక పాత్రలు ఉండటంవలన ప్రధాన పాత్రల రచనా విశేషాన్ని మాత్రమే పరామర్శించటం జరిగింది.
- విహారి
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఇతర అవార్డులూ, రివార్డులూ - అదొక పెద్ద పట్టిక. కథగానీ, నవలగానీ రాసే రచన మరేదైనాగానీ, ప్రతి ఒక్కదాన్నీ 'మూస' కి భిన్నంగా తనదైన 'ముద్ర' తో. 'ప్రజ్ఞ' తో ఆవిష్కరిస్తున్న ప్రతిభామూర్తి సలీం. ఆయన రచనలంటే అందరకూ, నాకు ప్రత్యేకంగా మక్కువ. సౌమ్యుడూ, సౌజన్యశీలీ, నిత్య సాహిత్య విద్యార్థీ సలీం. అందుకే ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా నాకు గౌరవం. ఆ మక్కువా, ఈ గౌరవమూ కలిపి నన్ను ఈ గ్రంథ రచనకు పురిగొల్పాయి. ఇది 'దీపిక'. సలీం రాసిన ఏడు నవలలమీద విశ్లేషణాత్మక పరామర్శ. 'దీపిక' ఎప్పుడూ వెలుగుల్నే ప్రసరిస్తుంది. నా సమీక్షల్ని గురించీ, విశ్లేషణల్ని గురించీ 'అంతా మంచి చేబుతాడనే' వ్యాఖ్య ఉన్నది. ఇది నాకొక 'సర్టిఫికేట్' గా భావిస్తాను. లోకానికి మంచి చెప్పాలి. మనిషికి విడిగా లోపం చూపాలి! గ్రంథ పరామర్శ అనేది చదువరిచేత ఆ పుస్తకాన్ని కొనిపించి, చదివించి, ఆ రచనలోని మంచిని ఆనందించడానికీ, ఆచరించడానికీ సహాయకారి కావాలి. ఇది నా నిబద్ధత! సలీం నవలల్ని పరామర్శించేటప్పుడు దాదాపు ప్రతి నవలలోని మొత్తం ఇతివృత్తాన్ని పాఠకుడు దర్శించగలిగే విధంగా అనేక చోట్ల వివరంగా చెప్పాను. దీనికి కారణం అసలు కథ తెలియజేయకుండా విమర్శను సంధించే విధానం నా పరామర్శ అంగీకరించకపోవడమే. అలాగే నవలా భాగాల 'ఉటంకింపులు' కొన్ని చోట్ల దీర్ఘంగా ఉన్నాయి. ఆ అంశంలో రచయిత ప్రతిభా, రచనలోని 'ఆత్మ' చదువరికి అవగతం కావడానికి వాటిని ఆ విధంగా పొందుపరచవలసి వచ్చింది. పాత్ర చిత్రణ అధ్యాయంలో ముఖ్యమైన కొన్ని పాత్రల ఆవిష్కారాన్ని మాత్రమే విశ్లేషించాను. మొత్తం 7 నవలల్లో అనేక పాత్రలు ఉండటంవలన ప్రధాన పాత్రల రచనా విశేషాన్ని మాత్రమే పరామర్శించటం జరిగింది. - విహారి© 2017,www.logili.com All Rights Reserved.