ప్రతి మనిషికీ తన జీవితం ఒక మహాగ్రంథం వంటిది. ఆ జీవన మహాగ్రంథంలో అనేకాధ్యాయాలుంటాయి. ఈ భూమి మీద జన్మించటమే ఒక అధ్యాయము. బాల్యం ఒక అధ్యాయము. కౌమారం ఒక అధ్యాయము. యౌవనం ఒక అధ్యాయము. వృద్ధాప్యం ఒక అధ్యాయము. చివరికి మరణం కూడా ఒక అధ్యాయమే! సుఖాలు, కష్టాలు, ఆప్యాయతలు, అనురాగాలు, అనుభవాలు, గుణపాఠాలు, ఇతరులతో బంధాలు, అనుబంధాలు ఇతరులు తమపట్ల చేసిన మేలు, కీడు... ఇలా ప్రతిది వ్యక్తి జీవన గ్రంథంలో కథకు మూలము అవుతాయి.
ఒకరి జీవనగ్రంథం మరొకరికి స్ఫూర్తిదాయకం అవుతుంది. ఒకరి బతుకు పుస్తకం మరొకరికి హెచ్చరిక అవుతుంది. ప్రతి మనిషీ తన జీవన గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్నీ చదివి, నెమరు వేసుకుంటారు. గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతారు. పొందిన ఆనందాలను తలచుకొని పులకించిపోతారు. అందుకొన్న విజయాలు తృప్తిని ప్రసాదిస్తాయి. మనసును తాకిన చేదు అనుభవాలు చివుక్కుమనిపిస్తాయి. ఆనందాన్నైనా, దుఃఖానైనా తన జీవిత గ్రంథంలో మనిషి నిక్షిప్తం చేసుకొని పదిలపరచుకుంటాడు. జీవన గ్రంథానికి ముగింపు వార్ధక్యమే (వృద్ధాప్యము). అన్ని బాధ్యతలు తీరాక, జవసత్వాలు హరించుకొనిపోతుంటే మనిషి ఆత్మావలోకన దశకు చేరుకుంటాడు. ఏదో శూన్యం పలకరిస్తుంది ఏదో దైన్యం ఆవహిస్తుంది. ఆత్మీయత కోసం మనసు అర్రులు చాస్తుంది. ఆనందం కోసం హృదయం ఉవ్విళ్లూరుతుంది. ఏమీ చేయలేని చేతకానితనం, ఎవరు కాపాడతారనే ఆందోళన సమ్మిళితమై జీవన గ్రంథంలో కారుణ్య ప్రకరణం ఉద్భవిస్తుంది. సంతానం ఇచ్చే ఆలంబన సంతోష ఘట్టానికి తెరతీస్తుంది. నిరాదరణతో కూడిన కాఠిన్యం మనసును....................
1వ అధ్యాయము విషయ పరిచయము ప్రతి మనిషికీ తన జీవితం ఒక మహాగ్రంథం వంటిది. ఆ జీవన మహాగ్రంథంలో అనేకాధ్యాయాలుంటాయి. ఈ భూమి మీద జన్మించటమే ఒక అధ్యాయము. బాల్యం ఒక అధ్యాయము. కౌమారం ఒక అధ్యాయము. యౌవనం ఒక అధ్యాయము. వృద్ధాప్యం ఒక అధ్యాయము. చివరికి మరణం కూడా ఒక అధ్యాయమే! సుఖాలు, కష్టాలు, ఆప్యాయతలు, అనురాగాలు, అనుభవాలు, గుణపాఠాలు, ఇతరులతో బంధాలు, అనుబంధాలు ఇతరులు తమపట్ల చేసిన మేలు, కీడు... ఇలా ప్రతిది వ్యక్తి జీవన గ్రంథంలో కథకు మూలము అవుతాయి. ఒకరి జీవనగ్రంథం మరొకరికి స్ఫూర్తిదాయకం అవుతుంది. ఒకరి బతుకు పుస్తకం మరొకరికి హెచ్చరిక అవుతుంది. ప్రతి మనిషీ తన జీవన గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్నీ చదివి, నెమరు వేసుకుంటారు. గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతారు. పొందిన ఆనందాలను తలచుకొని పులకించిపోతారు. అందుకొన్న విజయాలు తృప్తిని ప్రసాదిస్తాయి. మనసును తాకిన చేదు అనుభవాలు చివుక్కుమనిపిస్తాయి. ఆనందాన్నైనా, దుఃఖానైనా తన జీవిత గ్రంథంలో మనిషి నిక్షిప్తం చేసుకొని పదిలపరచుకుంటాడు. జీవన గ్రంథానికి ముగింపు వార్ధక్యమే (వృద్ధాప్యము). అన్ని బాధ్యతలు తీరాక, జవసత్వాలు హరించుకొనిపోతుంటే మనిషి ఆత్మావలోకన దశకు చేరుకుంటాడు. ఏదో శూన్యం పలకరిస్తుంది ఏదో దైన్యం ఆవహిస్తుంది. ఆత్మీయత కోసం మనసు అర్రులు చాస్తుంది. ఆనందం కోసం హృదయం ఉవ్విళ్లూరుతుంది. ఏమీ చేయలేని చేతకానితనం, ఎవరు కాపాడతారనే ఆందోళన సమ్మిళితమై జీవన గ్రంథంలో కారుణ్య ప్రకరణం ఉద్భవిస్తుంది. సంతానం ఇచ్చే ఆలంబన సంతోష ఘట్టానికి తెరతీస్తుంది. నిరాదరణతో కూడిన కాఠిన్యం మనసును....................© 2017,www.logili.com All Rights Reserved.