తెలుగు సినీ గీతాలను ఆణిముత్యాలుగా మలచిన మహనీయులు, సాహితీవేత్త శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు. వారి కథలు, నవలలు, వ్యాసాలు తెలుగుతనానికి, తెలుగు భాషామాధుర్యానికి ప్రతీకలని చెబుతుంటారు. శాస్త్రిగారి అన్ని రచనలు చదవకపోయినప్పటికీ, ఒక గాయనిగా చిన్నప్పటి నుంచి ఉత్తమ సాహితీ విలువలున్న వారి సినీగీతాలు విన్నప్పుడు మాత్రం అవి ఎప్పుడూ హాయిగా పాడుకునే ఆపాత మధురాలని భావించేదానిని. ముఖ్యంగా చిరంజీవులు, జయభేరి, రహస్యం, కలిమిలేములు, చిత్రాల్లోని పాటలు శాస్త్రిగారి భాషలో చెప్పాలంటే 'సన్నజాజి పూవులు, సంపంగి పూవులే'.
పుస్తకం శీర్షిక "మది శారదాదేవి మందిరమే" కూడా ఎంతో తగినట్లుగా వున్నది. నిజమే... ఈ రచన చదివిన ప్రతివారి మదిలో ఆ చదువుల తల్లి కొలువై వుండాలని నేను ఆశిస్తున్నాను.. ఎంతో మంది సంగీత సాహిత్య ప్రియులకు, మీడియా ప్రయోక్తలకు ఈ పుస్తకం ఒక ఉపయుక్త గ్రంథంగా ఉంటుందని భావిస్తున్నాను. అటు గానంతో బాటు రచనలో సవ్యసాచివలె తన ప్రత్యేకతను నిరూపించుకున్న వి వి రామారావుగారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ అలనాటి సినీ కవులు సంగీత దర్శకులపై ఇలాంటి విలువైన ప్రామాణిక రచనలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను.
- ఆకునూరి శారద
తెలుగు సినీ గీతాలను ఆణిముత్యాలుగా మలచిన మహనీయులు, సాహితీవేత్త శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు. వారి కథలు, నవలలు, వ్యాసాలు తెలుగుతనానికి, తెలుగు భాషామాధుర్యానికి ప్రతీకలని చెబుతుంటారు. శాస్త్రిగారి అన్ని రచనలు చదవకపోయినప్పటికీ, ఒక గాయనిగా చిన్నప్పటి నుంచి ఉత్తమ సాహితీ విలువలున్న వారి సినీగీతాలు విన్నప్పుడు మాత్రం అవి ఎప్పుడూ హాయిగా పాడుకునే ఆపాత మధురాలని భావించేదానిని. ముఖ్యంగా చిరంజీవులు, జయభేరి, రహస్యం, కలిమిలేములు, చిత్రాల్లోని పాటలు శాస్త్రిగారి భాషలో చెప్పాలంటే 'సన్నజాజి పూవులు, సంపంగి పూవులే'. పుస్తకం శీర్షిక "మది శారదాదేవి మందిరమే" కూడా ఎంతో తగినట్లుగా వున్నది. నిజమే... ఈ రచన చదివిన ప్రతివారి మదిలో ఆ చదువుల తల్లి కొలువై వుండాలని నేను ఆశిస్తున్నాను.. ఎంతో మంది సంగీత సాహిత్య ప్రియులకు, మీడియా ప్రయోక్తలకు ఈ పుస్తకం ఒక ఉపయుక్త గ్రంథంగా ఉంటుందని భావిస్తున్నాను. అటు గానంతో బాటు రచనలో సవ్యసాచివలె తన ప్రత్యేకతను నిరూపించుకున్న వి వి రామారావుగారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ అలనాటి సినీ కవులు సంగీత దర్శకులపై ఇలాంటి విలువైన ప్రామాణిక రచనలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను. - ఆకునూరి శారద© 2017,www.logili.com All Rights Reserved.