ఓ 'చాకీదారు' కథ.
కొంతకాలం కిందట నరెంద్రమోదీని ప్రశంసిస్తూ కాలం రాశాను. నా అభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్ వచ్చింది. 'నరేంద్రమోదీని పొగడకండి సార్! అతను దుర్మార్గుడు. కర్కశుడు' అంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోడీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరచిపోదాం. కేవలం ముగ్గురు నాయకుల నమూనా కథలు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యేనాటికి కొడుకు హరిశాస్త్రి అశోక్ లేలాండ్ కంపెనీ ఉద్యోగి. తండ్రి ప్రధాని అయ్యాక హరిశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్ గా కంపెనీ ప్రమోషన్ ఇచ్చింది.
'నీకు ప్రమోషన్ వారెందుకిచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోవటానికి. తక్షణమే నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. లేదా నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను' అని కొడుకు చేత బలవంతంగా ఉద్యోగం మాన్పించారు లాల్ బహదూర్. ఒక ముఖ్యమంత్రి చొక్కా తొడుక్కున్నాక బొత్తాం తెగిపోతే నౌఖరు ఆ ముఖ్యమంత్రిని నిలబెట్టే బొత్తాన్ని కుట్టిన కథ చదువుకున్నాం. ఆ సి.ఎం. పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఇంకొకాయన ఎమ్మెల్యే. ఏదో సభలో పాల్గొన్నారు. సభ అయ్యాక నిర్వాహకులు ఆయనకు ఒక వాహనం అందుబాటులో ఉంచారు. ఆయన మాత్రం చేతిలో ఖద్దరు సంచీ పట్టుకుని రూటు బస్సు ఎక్కడం నాకు తెలుసంటూ నిర్వాహకులు ఇచ్చిన వాహనాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆయన పేరు వావిలాల గోపాలకృష్ణయ్య. తరువాత ఏం జరిగిందో ఈ కాలమ్ చదివి తెలుసుకొనగలరు. అలాగే ఈ పుస్తకంలో మరెన్నో కాలమ్స్ ఉన్నాయి.
ఓ 'చాకీదారు' కథ. కొంతకాలం కిందట నరెంద్రమోదీని ప్రశంసిస్తూ కాలం రాశాను. నా అభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్ వచ్చింది. 'నరేంద్రమోదీని పొగడకండి సార్! అతను దుర్మార్గుడు. కర్కశుడు' అంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోడీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరచిపోదాం. కేవలం ముగ్గురు నాయకుల నమూనా కథలు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యేనాటికి కొడుకు హరిశాస్త్రి అశోక్ లేలాండ్ కంపెనీ ఉద్యోగి. తండ్రి ప్రధాని అయ్యాక హరిశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్ గా కంపెనీ ప్రమోషన్ ఇచ్చింది. 'నీకు ప్రమోషన్ వారెందుకిచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోవటానికి. తక్షణమే నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. లేదా నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను' అని కొడుకు చేత బలవంతంగా ఉద్యోగం మాన్పించారు లాల్ బహదూర్. ఒక ముఖ్యమంత్రి చొక్కా తొడుక్కున్నాక బొత్తాం తెగిపోతే నౌఖరు ఆ ముఖ్యమంత్రిని నిలబెట్టే బొత్తాన్ని కుట్టిన కథ చదువుకున్నాం. ఆ సి.ఎం. పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఇంకొకాయన ఎమ్మెల్యే. ఏదో సభలో పాల్గొన్నారు. సభ అయ్యాక నిర్వాహకులు ఆయనకు ఒక వాహనం అందుబాటులో ఉంచారు. ఆయన మాత్రం చేతిలో ఖద్దరు సంచీ పట్టుకుని రూటు బస్సు ఎక్కడం నాకు తెలుసంటూ నిర్వాహకులు ఇచ్చిన వాహనాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆయన పేరు వావిలాల గోపాలకృష్ణయ్య. తరువాత ఏం జరిగిందో ఈ కాలమ్ చదివి తెలుసుకొనగలరు. అలాగే ఈ పుస్తకంలో మరెన్నో కాలమ్స్ ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.