డా॥ పండిట్ మల్లాది మణి
అధ్యాయము -1
ఉపోద్ఘాతము
ప్రతివారు మన తెలుగు రాష్ట్రాలలో ఉగాది పండుగకు ముందే క్రొత్త పంచాంగం కొనుక్కు రావటం దానిని, ఆ రోజు పూజలో పెట్టి పూజించటం ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుంది. పంచాంగం పూజించటం అంటే మనం భవిష్యత్తు లో వచ్చే కాలాన్ని పూజించినట్లే. ఆ కాలంలో వచ్చే ఋతువులు, మనము చేసే పంచాంగ పూజవల్ల మేలు కలిగిస్తాయనే విశ్వాసం అందరికీ ఉంటుంది. అందుకనే ప్రతివారు పంచాంగ పూజ ఉగాదిరోజున చేస్తారు. పంచాంగకర్తలు మరియు పండితులు పంచాంగ పఠనం చేసి రాబోయే కాలంలో మానవాళియొక్క జీవిత విధానాలు ఎలా ఉంటాయో వివరిస్తారు.
రాబోవు దుష్ఫలితాలు తెలుసుకొని వారు దైవప్రార్ధన చేసుకుంటారు. ఏ మాసంలో ఏ రాశివారికి ఎలా ఉంటుందో పంచాంగ పఠనంలో తెలుసుకుంటారు. కాబట్టి దుష్ఫలితాలు తొలగిపోవడానికి లేక వాటి ఉధృతం తగ్గించుకోవడానికి గ్రహపూజలు, శాంతులు చేసుకుంటారు.
ఒక సంవత్సరం కాలానికి భవిష్యత్తుని చెబుతారు. ఆ సంవత్సరం పూర్తి అవగానే మళ్ళీ రెండవ సంవత్సరంలో కూడా పాత పంచాంగం వాడకుండా మళ్ళీ క్రొత్త పంచాంగం తెచ్చుకుంటాము. ఇలా మనం తెచ్చుకునేటప్పుడు ఆ పంచాంగం ఏ సంవత్సర పంచాంగమో తెలుసుకోవడానికి మనం సంవత్సరం పేరు చూస్తాము. క్రొత్త సంవత్సరం పేరు తెలుసుకుని ఆ పేరుతో వ్రాసి ఉన్న పంచాంగమే మనం కొనుక్కుంటాము. అందువల్ల మనం సంవత్సరాల పేర్లు ప్రధమంగా తెలుసుకుని ఉండాలి.
విచారించదగిన విషయం ఏమంటే మన తెలుగువారికి తెలుగు సంవత్సరాల పేర్లు తెలియవు. ఎందుకంటే ఆంగ్ల భాషలో మాసముల..................
డా॥ పండిట్ మల్లాది మణి అధ్యాయము -1 ఉపోద్ఘాతము ప్రతివారు మన తెలుగు రాష్ట్రాలలో ఉగాది పండుగకు ముందే క్రొత్త పంచాంగం కొనుక్కు రావటం దానిని, ఆ రోజు పూజలో పెట్టి పూజించటం ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుంది. పంచాంగం పూజించటం అంటే మనం భవిష్యత్తు లో వచ్చే కాలాన్ని పూజించినట్లే. ఆ కాలంలో వచ్చే ఋతువులు, మనము చేసే పంచాంగ పూజవల్ల మేలు కలిగిస్తాయనే విశ్వాసం అందరికీ ఉంటుంది. అందుకనే ప్రతివారు పంచాంగ పూజ ఉగాదిరోజున చేస్తారు. పంచాంగకర్తలు మరియు పండితులు పంచాంగ పఠనం చేసి రాబోయే కాలంలో మానవాళియొక్క జీవిత విధానాలు ఎలా ఉంటాయో వివరిస్తారు. రాబోవు దుష్ఫలితాలు తెలుసుకొని వారు దైవప్రార్ధన చేసుకుంటారు. ఏ మాసంలో ఏ రాశివారికి ఎలా ఉంటుందో పంచాంగ పఠనంలో తెలుసుకుంటారు. కాబట్టి దుష్ఫలితాలు తొలగిపోవడానికి లేక వాటి ఉధృతం తగ్గించుకోవడానికి గ్రహపూజలు, శాంతులు చేసుకుంటారు. ఒక సంవత్సరం కాలానికి భవిష్యత్తుని చెబుతారు. ఆ సంవత్సరం పూర్తి అవగానే మళ్ళీ రెండవ సంవత్సరంలో కూడా పాత పంచాంగం వాడకుండా మళ్ళీ క్రొత్త పంచాంగం తెచ్చుకుంటాము. ఇలా మనం తెచ్చుకునేటప్పుడు ఆ పంచాంగం ఏ సంవత్సర పంచాంగమో తెలుసుకోవడానికి మనం సంవత్సరం పేరు చూస్తాము. క్రొత్త సంవత్సరం పేరు తెలుసుకుని ఆ పేరుతో వ్రాసి ఉన్న పంచాంగమే మనం కొనుక్కుంటాము. అందువల్ల మనం సంవత్సరాల పేర్లు ప్రధమంగా తెలుసుకుని ఉండాలి. విచారించదగిన విషయం ఏమంటే మన తెలుగువారికి తెలుగు సంవత్సరాల పేర్లు తెలియవు. ఎందుకంటే ఆంగ్ల భాషలో మాసముల..................© 2017,www.logili.com All Rights Reserved.