పొల్లుగింజ
పొలాల పక్కన ఉన్న కళ్లంలో వసంత కాలపు పక్షులలాగా రైతు కుటుంబాలకు చెందిన ఆ యువతులు "గాలి వీచినప్పుడే తూర్పార పట్టాలి" అనే సామెతకు తగినట్లుగా చేతులతో చేటలను పెట్టుకొని వడ్లగింజలను తూర్పార పడుతున్నారు. మంచి వడ్ల గింజలు రాశులు రాశులుగా పెరుగుతూ వస్తున్నాయి. పొల్లు గింజలన్నీ వేరొకవైపు పడుతున్నాయి. కళ్లంలో జోరుగా సాగుతున్న పొలం నూర్పిడి పనులను ఒక నల్లరాతి బండమీద కూర్చొని గమనిస్తున్నాడు పొలం స్వంతదారు. 'కార్మేఘం' అతని పేరు. తన పొలంలో పని చేసే స్త్రీలను తన కన్నబిడ్డల వలె భావిస్తుంటాడు. వాళ్లు పని చేయడం పూర్తికాగానే వాళ్లకు ఇవ్వవలసిన జీతాన్ని వడ్ల గింజల రూపంలోనే శేర్లతో కొలిచి ఇవ్వడం ప్రారంభించాడు.
"ఈ రోజు తూర్పార పట్టిన వాటిల్లో పొల్లు గింజలు తక్కువగానే ఉన్నాయి" అంటూ చిరునవ్వులు చిందుతూ ఒక యువతి - పేరు 'పూవళగి' తన దోసిళ్లలో ఉన్న పొల్లు గింజలను కార్మేఘానికి చూపించింది. అతను కూడా సంతోషం వెలిబుచ్చుతూ ఆమెను చూసి ఒక ప్రశ్న అడిగాడు!
"తల్లీ! పూవళగీ! ధాన్యంలో ఉన్న పొల్లు గింజలను సులభంగా కనిపెట్టి వాటిని తొలగించుకుంటాము. కానీ మనుషుల్లో కూడా పొల్లు గింజలలాంటి వాళ్లు ఉన్నారు. కదా! వాళ్లను ఎలా కనిపెట్టగలం?"
పూవళగి మాత్రమే కాదు, ఆమెతో కలిసి పనిచేసిన స్త్రీలందరూ ఆశ్చర్య చకితులయ్యారు. అప్పుడు కార్మేఘం అల్లుడు కజ్జాయిరం అనేవాడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే స్త్రీలందరూ ఒదిగి నిలబడ్డారు.
"ఏమిటి చిన్నారి గువ్వలు ఏమి చెబుతున్నాయి? మా మామగారి అదృష్టమే అదృష్టం! ఎప్పుడూ చుట్టూ చిన్నారి గువ్వల గుంపు - అరెరే! ఈ నూర్పుడు కళ్లం ఆనందాల కోలాహలంగా ఉందే!"
కణ్ణాయిరం ఇలా చెప్తూంటే కార్మేఘం దిగ్భ్రాంతి చెందాడు.
"ఏయ్! ఇలా మాట్లాడవద్దు! అందరూ నాకన్న బిడ్డలలాంటివాళ్ళు!"
కణ్ణాయిరం అది విని విరగబడి నవ్వాడు.
"ఏమి మామా! లోకం పోకడ తెలియకుండా మాట్లాడుతున్నారు. వీళ్లలో మీరు ఎవరిని తాకినా ఆనందంగా గంతులు వేస్తారు. ఏమి చిలుకల్లారా! నేను చెప్పింది నిజమే
కదా?"...............
పొల్లుగింజ పొలాల పక్కన ఉన్న కళ్లంలో వసంత కాలపు పక్షులలాగా రైతు కుటుంబాలకు చెందిన ఆ యువతులు "గాలి వీచినప్పుడే తూర్పార పట్టాలి" అనే సామెతకు తగినట్లుగా చేతులతో చేటలను పెట్టుకొని వడ్లగింజలను తూర్పార పడుతున్నారు. మంచి వడ్ల గింజలు రాశులు రాశులుగా పెరుగుతూ వస్తున్నాయి. పొల్లు గింజలన్నీ వేరొకవైపు పడుతున్నాయి. కళ్లంలో జోరుగా సాగుతున్న పొలం నూర్పిడి పనులను ఒక నల్లరాతి బండమీద కూర్చొని గమనిస్తున్నాడు పొలం స్వంతదారు. 'కార్మేఘం' అతని పేరు. తన పొలంలో పని చేసే స్త్రీలను తన కన్నబిడ్డల వలె భావిస్తుంటాడు. వాళ్లు పని చేయడం పూర్తికాగానే వాళ్లకు ఇవ్వవలసిన జీతాన్ని వడ్ల గింజల రూపంలోనే శేర్లతో కొలిచి ఇవ్వడం ప్రారంభించాడు. "ఈ రోజు తూర్పార పట్టిన వాటిల్లో పొల్లు గింజలు తక్కువగానే ఉన్నాయి" అంటూ చిరునవ్వులు చిందుతూ ఒక యువతి - పేరు 'పూవళగి' తన దోసిళ్లలో ఉన్న పొల్లు గింజలను కార్మేఘానికి చూపించింది. అతను కూడా సంతోషం వెలిబుచ్చుతూ ఆమెను చూసి ఒక ప్రశ్న అడిగాడు! "తల్లీ! పూవళగీ! ధాన్యంలో ఉన్న పొల్లు గింజలను సులభంగా కనిపెట్టి వాటిని తొలగించుకుంటాము. కానీ మనుషుల్లో కూడా పొల్లు గింజలలాంటి వాళ్లు ఉన్నారు. కదా! వాళ్లను ఎలా కనిపెట్టగలం?" పూవళగి మాత్రమే కాదు, ఆమెతో కలిసి పనిచేసిన స్త్రీలందరూ ఆశ్చర్య చకితులయ్యారు. అప్పుడు కార్మేఘం అల్లుడు కజ్జాయిరం అనేవాడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే స్త్రీలందరూ ఒదిగి నిలబడ్డారు. "ఏమిటి చిన్నారి గువ్వలు ఏమి చెబుతున్నాయి? మా మామగారి అదృష్టమే అదృష్టం! ఎప్పుడూ చుట్టూ చిన్నారి గువ్వల గుంపు - అరెరే! ఈ నూర్పుడు కళ్లం ఆనందాల కోలాహలంగా ఉందే!" కణ్ణాయిరం ఇలా చెప్తూంటే కార్మేఘం దిగ్భ్రాంతి చెందాడు. "ఏయ్! ఇలా మాట్లాడవద్దు! అందరూ నాకన్న బిడ్డలలాంటివాళ్ళు!" కణ్ణాయిరం అది విని విరగబడి నవ్వాడు. "ఏమి మామా! లోకం పోకడ తెలియకుండా మాట్లాడుతున్నారు. వీళ్లలో మీరు ఎవరిని తాకినా ఆనందంగా గంతులు వేస్తారు. ఏమి చిలుకల్లారా! నేను చెప్పింది నిజమే కదా?"...............© 2017,www.logili.com All Rights Reserved.