తీర్ధయాత్రలు ఎందుకు చేయాలి?
భగవంతుడు అంతటా వున్నప్పుడు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్లాలి? ఇంట్లోవున్న దేవునికి దండంపెట్టి ఇంట్లోనే ఉండవచ్చుకదా! అన్న సందేహం చాలామందికి ఉంటుంది.
...మనం తెలిసీతెలియక నానారకాల పాపకర్మలను ఆచరిస్తాం. ఈ పాపఫలితాలు మూడు విధాలుగా మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపము లోను మనకు సంక్రమిస్తాయి. మనస్సులో కలిగే చెడుసంకల్పాలవలన మాన సికంగానూ, ఇతరులను దూషించడంవలన వాక్కు రూపంలోనూ శరీరంచేత దండించడం, హింసించడంవలన శారీరకంగానూ మనకు పాప ఫలితంలభిస్తుంది.
వీటిని తొలగించుకోవడానికి తీర్ధయాత్రలు, పాదయాత్రలు చాలావరకు దోహదంచేస్తాయి. తీర్ధయాత్రలలో ఎక్కువ సమయం భగవన్నామస్మరణ చేయడం వలన వాక్కుదోషాలు, భగవద్దర్శనంవలన, పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మనస్సు ఏ ఇతర ఆలోచనలపై దృష్టిసారించదుకాబట్టి మనస్సులో ఎటువంటి చెడు సంకల్పాలు కలగకుండా ప్రశాంతంగా వుంటుంది. వీటివల్ల మానసిక ప్రశాంతత కలిగి మానసిక దోషాలు, తీర్ధయాత్రలలో శరీరం కొంతదూరం నడవడంగాని, ప్రయాణంవలన గాని ఇబ్బంది పడడంవల్ల శరీరం కూడా శ్రమకు గురవుతుంది. వీటివలన శారీరక దోషాలు కొంతవరకు తొలగిపోతాయని మన పూర్వీకుల అభిప్రాయం. అంతేగాకుండా తీర్ధయాత్రల వలన కొత్త, కొత్త ప్రదేశాలలను చూడడం వలన మనసులో నూతన ఉత్తేజం కలుగుతుంది. వీటికి ఎంతోకొంత మనధనం ధార్మికానికి ఖర్చుచేసిన వాళ్ల మవుతాము. దీనివలన మనధనంకూడా పవిత్రమవుతుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్రాలలో ఎంతోమంది మహాత్ములు, మహనీయులు, మహానుభావులు, సాధుపుంగవులు చేసిన జపధ్యానాలశక్తి అక్కడ కేంద్రీకృతమైవుంటుంది. క్షేత్ర మహిమకూడా మనకు దోహదపడుతుంది. వీటివలనకూడా మనలో తెలియని ఆనందం, శక్తి కలుగుతాయి. అందువలన తీర్ధయాత్రలు మానవుని ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు అవుతాయి కాబట్టి తీర్ధయాత్రలు........................
తీర్ధయాత్రలు ఎందుకు చేయాలి? భగవంతుడు అంతటా వున్నప్పుడు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్లాలి? ఇంట్లోవున్న దేవునికి దండంపెట్టి ఇంట్లోనే ఉండవచ్చుకదా! అన్న సందేహం చాలామందికి ఉంటుంది. ...మనం తెలిసీతెలియక నానారకాల పాపకర్మలను ఆచరిస్తాం. ఈ పాపఫలితాలు మూడు విధాలుగా మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపము లోను మనకు సంక్రమిస్తాయి. మనస్సులో కలిగే చెడుసంకల్పాలవలన మాన సికంగానూ, ఇతరులను దూషించడంవలన వాక్కు రూపంలోనూ శరీరంచేత దండించడం, హింసించడంవలన శారీరకంగానూ మనకు పాప ఫలితంలభిస్తుంది. వీటిని తొలగించుకోవడానికి తీర్ధయాత్రలు, పాదయాత్రలు చాలావరకు దోహదంచేస్తాయి. తీర్ధయాత్రలలో ఎక్కువ సమయం భగవన్నామస్మరణ చేయడం వలన వాక్కుదోషాలు, భగవద్దర్శనంవలన, పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మనస్సు ఏ ఇతర ఆలోచనలపై దృష్టిసారించదుకాబట్టి మనస్సులో ఎటువంటి చెడు సంకల్పాలు కలగకుండా ప్రశాంతంగా వుంటుంది. వీటివల్ల మానసిక ప్రశాంతత కలిగి మానసిక దోషాలు, తీర్ధయాత్రలలో శరీరం కొంతదూరం నడవడంగాని, ప్రయాణంవలన గాని ఇబ్బంది పడడంవల్ల శరీరం కూడా శ్రమకు గురవుతుంది. వీటివలన శారీరక దోషాలు కొంతవరకు తొలగిపోతాయని మన పూర్వీకుల అభిప్రాయం. అంతేగాకుండా తీర్ధయాత్రల వలన కొత్త, కొత్త ప్రదేశాలలను చూడడం వలన మనసులో నూతన ఉత్తేజం కలుగుతుంది. వీటికి ఎంతోకొంత మనధనం ధార్మికానికి ఖర్చుచేసిన వాళ్ల మవుతాము. దీనివలన మనధనంకూడా పవిత్రమవుతుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్రాలలో ఎంతోమంది మహాత్ములు, మహనీయులు, మహానుభావులు, సాధుపుంగవులు చేసిన జపధ్యానాలశక్తి అక్కడ కేంద్రీకృతమైవుంటుంది. క్షేత్ర మహిమకూడా మనకు దోహదపడుతుంది. వీటివలనకూడా మనలో తెలియని ఆనందం, శక్తి కలుగుతాయి. అందువలన తీర్ధయాత్రలు మానవుని ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు అవుతాయి కాబట్టి తీర్ధయాత్రలు........................© 2017,www.logili.com All Rights Reserved.