తాటిచెట్టు మాదిరిగా నిటారుగా వుండే కొండ వొకటుంది. ఆ కొండ పేరు రాహత్ కొండ. అది సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల యెత్తున ఆకాశంలోకి వూగుతూ వున్నట్టు వుంటుంది. దాని నెత్తిన మంచు గడ్డ కట్టి ముసిలిదైపోయిన తలలాగా కనిపిస్తుంది. ఆ కొండపైన యెండాకాలం కూడా చలి చలిగా వుండి గడగడ వొణికిస్తుంది. నీళ్ళకు కరువు వుండదు గాని గడ్డ కట్టిన ఆ నీళ్ళకి అక్కడ గడ్డి కూడా మొలవదు. తినడానికి యేమీ దొరకదు. వుండడానికి యేమీ వుండదు. ఆ గగనంలో ప్రాణవాయువు పరిస్తితి అంతంత మాత్రమే. అంతా యెగశ్వాస. దిగశ్వాస.............
తాటిచెట్టు మాదిరిగా నిటారుగా వుండే కొండ వొకటుంది. ఆ కొండ పేరు రాహత్ కొండ. అది సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల యెత్తున ఆకాశంలోకి వూగుతూ వున్నట్టు వుంటుంది. దాని నెత్తిన మంచు గడ్డ కట్టి ముసిలిదైపోయిన తలలాగా కనిపిస్తుంది. ఆ కొండపైన యెండాకాలం కూడా చలి చలిగా వుండి గడగడ వొణికిస్తుంది. నీళ్ళకు కరువు వుండదు గాని గడ్డ కట్టిన ఆ నీళ్ళకి అక్కడ గడ్డి కూడా మొలవదు. తినడానికి యేమీ దొరకదు. వుండడానికి యేమీ వుండదు. ఆ గగనంలో ప్రాణవాయువు పరిస్తితి అంతంత మాత్రమే. అంతా యెగశ్వాస. దిగశ్వాస.............© 2017,www.logili.com All Rights Reserved.