1 ఒకే ఒకటి
1991 జూన్ 7 వ తేదీన భూమి 112 నిమిషాలపాటు అదిరింది. నిజంగా కాదు, అలా అనిపించింది అంతే.
నేను ప్రఖ్యాత హాస్య చిత్రం 'సిటీ స్లిక్కర్స్' చూస్తున్నాను. ప్రేక్షకుల నవ్వులతో హాలు దద్దరిల్లి పోయింది. ఇంతవరకు వచ్చిన వాటిలో అది అత్యంత హాస్యచిత్రంగా పేరు పొందింది. అందులో అనూహ్యమైన జ్ఞానగుళికలు, అంతర్ దృష్టి డోసులు
కూడా ఉన్నాయి. మరుపురాని ఒక దృశ్యంలో పట్టువదలని కౌ బాయ్ కర్లీ (కీర్తిశేషులు జాక్ పాలన్స్ నటించారు), సిటీ స్లిక్కర్ మిచ్ (బిల్లీ క్రిస్టల్ ఆ పాత్రలో) తప్పిపోయిన పశువులను వెతకటానికి బయలుదేరుతారు. ఆ సినిమాలో ఆద్యంతమూ దాదాపు వారు ఇద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు. పక్కపక్కనే సవారి చేస్తూ చివరికి ఇద్దరూ జీవితాన్ని గురించి ఒక సంభాషణలో కలుస్తారు. ఉన్నట్టుండి కర్లీ తన గుర్రాన్ని ఆపి మిచ్ వైపు తిరుగుతాడు.
కర్రీ : నీకు జీవిత రహస్యం తెలుసా?
మిచ్ : తెలీదు. ఏమిటి?
కరీ : ఇది. [ఒక వేలు పైకి ఎత్తుతాడు]
మిచ్ : నీ వేలా?
© 2017,www.logili.com All Rights Reserved.