నల్లమందు
ఎప్పటిలాగే రాత్రి భోజనాలయ్యాక ఆ నలుగురూ తీరికగా హల్లో సోఫాల్లో కూర్చున్నారు.
"ఇరవైరెండేళ్ళ వయసులో మొదటిసారి నేను కోనసీమకి వెళ్ళడం. పనిమీద ఎలాగూ రాజమండ్రి వెళ్తున్నాను కదా అని, నాతో పాటు కొత్తగా ఉద్యోగంలో చేరిన నందు ఆ పక్కన పల్లెలో వున్న వాళ్ళమ్మకి ఇచ్చి రమ్మని డబ్బుల కవరొకటి ఇచ్చాడు."
అతడా విషయం మొదలు పెట్టగానే “ఆఫీస్ పని చేసుకోవాలి నాన్న!” అంటూ కొడుకు లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. భార్య ఆవులించి "నిద్రకి ఆగలేను బాబు" అంటూ తన గదిలోకి వెళ్ళింది. గోడ గడియారం అప్పటికింకా రాత్రి ఎనిమిదిన్నరే చూపిస్తోంది.
ఎదురుగా కూర్చున్న కొత్త కోడలు కుతూహలంగా చూస్తూ "చెప్పండి మామయ్యా!" అంది.
"మండువా ఇల్లు చూసావా నువ్వు?”
లేదన్నట్లు తల ఊపింది...........
© 2017,www.logili.com All Rights Reserved.