డా. సి. నారాయణరెడ్డి గారి పాటలే కాదు, మాటలు కూడా చెవికి ఇంపుగా సోకుతాయి. కవిత రాయకపోతే ఏసీ గదిలో కూడా ఉక్క పోస్తుందని చెప్పిన ఆయనకు, ప్రజల సమస్యల గురించి మాట్లాడకపోయినా ఉప్పిరాడదని నేను సరదాగా అంటూ ఉండే వాణ్ని. ఎందుకంటే కవి మనసు చలా సున్నితమైనది. ప్రతి విషయాన్ని వేయ్యి కోణాల్లో ఆలోచిస్తుంది. ఆలోచించిన ప్రతి సందర్భంలో స్పందిస్తుంది. ముఖ్యంగా ప్రజలు విషయంలో ఆ స్పందన ఉన్నతంగా ఉంటుందని భావిస్తాను.
శ్రీ వాజ్ వేయి గారి కవి హృదయాన్ని దగ్గర నుంచి చుసిన అనుభవం వల్ల, సమస్యల పట్ల అటల్ జి స్పందించిన తీరును ప్రత్యక్షంగా చూడడం వల్ల అనుకుంటా, సినారే గారి ఆలోచనల మీద నాకు మంచి అభిప్రాయం, వారి మాటలు పట్ల అంతకు మించిన ఆసక్తి ఉండేవి.
- ముప్పవరపు వెంకయ్య నాయుడు.