క్వీన్ మేరీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ !
బ్రిటిషువారు రాజ్యమేలుతున్న రోజుల్లో క్వీన్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీగా అంకురించిన ఆ సంస్థ తదనంతర కాలంలో భారత సర్కారు అధీనం లోకి వెళ్లి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పేరు మార్చుకుని, ఈ నాటికీ అత్యున్నత ప్రమాణాలతో పరిఢవిల్లుతూనే ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూండటం వల్ల ఫీజులు తక్కువగా ఉండి సామాన్యుల్ని, ఇంజనీరింగ్ విద్యలో నిపుణులైన అధ్యాపకవర్గం, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చే మేనేజ్మెంట్ ఉండటం వల్ల ధనిక వర్గాల్ని సైతం ఆకర్షిస్తూ, భాగ్యనగరంలో సాటి లేని మేటి కాలేజీగా పేరు తెచ్చుకుంది.
ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. డెబ్బయి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదో దశకంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, కాలేజీ వార్షికోత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం సంకల్పించింది. మొదటి రెండు రోజులూ ఏవేవో సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు జరిగాయి. ముగింపు రోజున హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రత్నసాగర్, ఆయన భార్య మాలా సాగర్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆ రోజు ప్రోగ్రాం లో కేవలం వాళ్ళిద్దరి ఉపన్యాసాలు, బహుమతి ప్రదానం. అంతే!
సాగర్ దంపతులకు హైదరాబాద్లో చాలా మంచి పేరుంది. భార్యాభర్తలిద్దరూ ఐఏఎస్ ఆఫీసర్లు కావడం, ఇద్దరూ లయన్స్ క్లబ్ తరఫున లెక్కలేనన్ని సామాజిక సేవా.......................
క్వీన్ మేరీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ! బ్రిటిషువారు రాజ్యమేలుతున్న రోజుల్లో క్వీన్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీగా అంకురించిన ఆ సంస్థ తదనంతర కాలంలో భారత సర్కారు అధీనం లోకి వెళ్లి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పేరు మార్చుకుని, ఈ నాటికీ అత్యున్నత ప్రమాణాలతో పరిఢవిల్లుతూనే ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూండటం వల్ల ఫీజులు తక్కువగా ఉండి సామాన్యుల్ని, ఇంజనీరింగ్ విద్యలో నిపుణులైన అధ్యాపకవర్గం, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చే మేనేజ్మెంట్ ఉండటం వల్ల ధనిక వర్గాల్ని సైతం ఆకర్షిస్తూ, భాగ్యనగరంలో సాటి లేని మేటి కాలేజీగా పేరు తెచ్చుకుంది. ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. డెబ్బయి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదో దశకంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, కాలేజీ వార్షికోత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం సంకల్పించింది. మొదటి రెండు రోజులూ ఏవేవో సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు జరిగాయి. ముగింపు రోజున హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రత్నసాగర్, ఆయన భార్య మాలా సాగర్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆ రోజు ప్రోగ్రాం లో కేవలం వాళ్ళిద్దరి ఉపన్యాసాలు, బహుమతి ప్రదానం. అంతే! సాగర్ దంపతులకు హైదరాబాద్లో చాలా మంచి పేరుంది. భార్యాభర్తలిద్దరూ ఐఏఎస్ ఆఫీసర్లు కావడం, ఇద్దరూ లయన్స్ క్లబ్ తరఫున లెక్కలేనన్ని సామాజిక సేవా.......................© 2017,www.logili.com All Rights Reserved.