ఒక దీపంతో దీపావళి
మూలం: హిందీ
రచయిత: మృదులా సిన్హా,
ఎంతటి వారి ముందైనాసరే గణేష్ ఓటమినంగీకరించడు. మధునగర్ ఓ మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూరు మారుమూలలో ఓ చిన్న గుడిసె వాడి సొంతం. వాళ్ళక్క మొగుడు వాణ్ణి ఆ గ్రామం నుండి తీసుకొచ్చాడు. వయసు పదిహేను ఉండని మా అంచనా. ఎందుకంటే ఎపుడు పుట్టాడో జన్మనిచ్చిన వాళ్లమ్మకే గుర్తులేదు. ఆమెకా అవసరం కూడా లేదు. జన్మదినోత్సవం చేసుకునే అవసరం గానీ ఒక్కో జన్మదినానికొక్కొక్క కొవ్వొత్తి పెంచాల్సిన అగత్యంగానీ లేనే లేదామెకు.
“గణేష్! నీ వయసెంత” నా కొడుకు అడిగాడు నువ్వుతూ. వాడు నవ్వబోయి మానుకున్నాడు.
"నా... నా .... దా! పది ఏడాదులు”
"పోవోయ్! మీసాలు రాబోతున్నాయి ఇంకా పదేళ్లేనా?”
వాడు ఏడుపు మొహంతో నా దగ్గరికొచ్చాడు.
"మమ్మీ.... నేనూ పది ఏడాదులు... గదా!”
"అవును, నీ వయసు తొమ్మిదేళ్లే. పో.... నీపంజూసుకో పో! అదిగో! ఆ దుమ్ముదులుపు. ఆ పూల మొక్కలకు నీళ్లు పోయ్.”
వాడు చిరునవ్వులు చిందిస్తూ పనిలో లీనమయ్యాడు. వాడన్నదానికల్లా అవుననేది మా ఇంట్లో నేనొక్కదాన్నే. వాడు ఢిల్లీ కొచ్చి ఆరు నెలలైంది. బెదురుగొడ్డులా మా ఇంటికొచ్చినప్పుడు వాడికి సరిగా కూచోడం, నుంచోవడం కూడా రాదు. ఎప్పుడూ బయటి బాల్కనీలో నుంచుండేవాడు.
చూపులు పైన, ఆకాశమీదనో, కింది పచ్చగడ్డి నేలమీదనో ఉండేవి. అలాగున్నప్పుడు ఎవరన్నా ఏం చేస్తున్నావు గణేష్? అనగానే ఖంగుదింటాడు. ఇల్లు శుభ్రపరిచే వస్తువు చేతిలో ఏదున్నా దానికి పంజెబుతాడు. ఒక్కోసారి ఇల్లు తుడుస్తూ ఏ మధ్య గదిలోనో ఆగిపోతాడు. చేతిలో చీపురునలాగే పట్టుకుని ఏదో ఆలోచిస్తూ తనను తాను మరిచిపోతాడు. మా కుటుంబ సభ్యులెవరన్నా "నిద్రపోతున్నావా?” అనగానే వాడి చెయ్యి ఆడుతుంది. మధ్యంతర విశ్రాంతితో నష్టపోయిన సమయాన్ని వేగంగా పంజేస్తూ వూడ్చేస్తాడు..................
ఒక దీపంతో దీపావళిమూలం: హిందీ రచయిత: మృదులా సిన్హా, ఎంతటి వారి ముందైనాసరే గణేష్ ఓటమినంగీకరించడు. మధునగర్ ఓ మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూరు మారుమూలలో ఓ చిన్న గుడిసె వాడి సొంతం. వాళ్ళక్క మొగుడు వాణ్ణి ఆ గ్రామం నుండి తీసుకొచ్చాడు. వయసు పదిహేను ఉండని మా అంచనా. ఎందుకంటే ఎపుడు పుట్టాడో జన్మనిచ్చిన వాళ్లమ్మకే గుర్తులేదు. ఆమెకా అవసరం కూడా లేదు. జన్మదినోత్సవం చేసుకునే అవసరం గానీ ఒక్కో జన్మదినానికొక్కొక్క కొవ్వొత్తి పెంచాల్సిన అగత్యంగానీ లేనే లేదామెకు. “గణేష్! నీ వయసెంత” నా కొడుకు అడిగాడు నువ్వుతూ. వాడు నవ్వబోయి మానుకున్నాడు. "నా... నా .... దా! పది ఏడాదులు” "పోవోయ్! మీసాలు రాబోతున్నాయి ఇంకా పదేళ్లేనా?” వాడు ఏడుపు మొహంతో నా దగ్గరికొచ్చాడు. "మమ్మీ.... నేనూ పది ఏడాదులు... గదా!” "అవును, నీ వయసు తొమ్మిదేళ్లే. పో.... నీపంజూసుకో పో! అదిగో! ఆ దుమ్ముదులుపు. ఆ పూల మొక్కలకు నీళ్లు పోయ్.” వాడు చిరునవ్వులు చిందిస్తూ పనిలో లీనమయ్యాడు. వాడన్నదానికల్లా అవుననేది మా ఇంట్లో నేనొక్కదాన్నే. వాడు ఢిల్లీ కొచ్చి ఆరు నెలలైంది. బెదురుగొడ్డులా మా ఇంటికొచ్చినప్పుడు వాడికి సరిగా కూచోడం, నుంచోవడం కూడా రాదు. ఎప్పుడూ బయటి బాల్కనీలో నుంచుండేవాడు. చూపులు పైన, ఆకాశమీదనో, కింది పచ్చగడ్డి నేలమీదనో ఉండేవి. అలాగున్నప్పుడు ఎవరన్నా ఏం చేస్తున్నావు గణేష్? అనగానే ఖంగుదింటాడు. ఇల్లు శుభ్రపరిచే వస్తువు చేతిలో ఏదున్నా దానికి పంజెబుతాడు. ఒక్కోసారి ఇల్లు తుడుస్తూ ఏ మధ్య గదిలోనో ఆగిపోతాడు. చేతిలో చీపురునలాగే పట్టుకుని ఏదో ఆలోచిస్తూ తనను తాను మరిచిపోతాడు. మా కుటుంబ సభ్యులెవరన్నా "నిద్రపోతున్నావా?” అనగానే వాడి చెయ్యి ఆడుతుంది. మధ్యంతర విశ్రాంతితో నష్టపోయిన సమయాన్ని వేగంగా పంజేస్తూ వూడ్చేస్తాడు..................© 2017,www.logili.com All Rights Reserved.