ట్రాఫిక్ జామ్తో నిండిన బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతం అది. డబ్బు చేయగలిగే సౌండ్ అంతా వినపడేలా కనిపిస్తోంది అక్కడి టొయిట్ పబ్. యువతీ యువకుల ట్రెండీ వేష ధారణలు, కాస్టీ కార్ల తళుకుబెళుకులూ... సామాన్యుల తీరని కలలకు రూపంలా నిలుచుందా పబ్. ఆ పబ్లో తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మోక్షిత్, అలియాస్ చిన్నోడి. ఈ అలియాస్ అనేది ఎ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అవడంవల్లో, నొటోరియస్ క్రిమినల్ అవడంవల్లో, వచ్చింది కాదు. కేవలం ఓ ముద్దు పేరు. అలా తన ఫ్రెండ్స్తో త్రాగుతూ సరదాగా గడుపుతున్న చిన్నోడి టేబుల్ పక్కనే ఒక అమ్మాయిల గ్యాంగ్ రెండో రౌండ్ డ్రింక్స్ నుండి మూడో రౌండ్కి సిద్ధమవుతూ ఉన్నారు. అందులో ఓ అమ్మాయి ఇలా అంది.
"క్యారెక్టర్తో పబ్ బిల్లు కట్టగలమా..? కరెన్సీతోనే కట్టాలి కదా! అలాంటి కరెన్సీతోనే కానీ, ఈ క్యారెక్టర్లు, కాకరకాయలు, మంచితనమూ, అవసరం లేదే మనకు" అని గట్టిగా తన ఫీలింగ్, తన గర్ల్స్ గ్యాంగ్తో షేర్ చేసుకుంటోందా అమ్మాయి.
ఇదంతా ఓకంట గమనిస్తున్న చిన్నోడి, కాస్త కిక్ ఎక్కాక కూసే మాటలు తెలిసినవే కాబట్టి ఆ గ్యాంగ్ వైపు చూసీ చూడనట్టు వెళ్ళి సర్వింగ్ కౌంటర్ దగ్గర ఓఫ్లేమ్ షాట్ ఆర్డర్ చేశాడు. ఇంతలో మరో యువకుడు కూడా కౌంటరు దగ్గరకొచ్చి చిన్నోడిలాగానే ఫ్లేమ్ షాట్ ఆర్డర్ చేసాడు. అక్కడి పాటల హోరు, మిరుమిట్లు గొలిపే లైటింగ్ చిన్నోడి బాడిలో ఓ చిన్నపాటి బీటుకు తగ్గ కదలికలు కల్పించాయి....................
జంగాల్ పరిణామం మరియు విప్లవం ట్రాఫిక్ జామ్తో నిండిన బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతం అది. డబ్బు చేయగలిగే సౌండ్ అంతా వినపడేలా కనిపిస్తోంది అక్కడి టొయిట్ పబ్. యువతీ యువకుల ట్రెండీ వేష ధారణలు, కాస్టీ కార్ల తళుకుబెళుకులూ... సామాన్యుల తీరని కలలకు రూపంలా నిలుచుందా పబ్. ఆ పబ్లో తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మోక్షిత్, అలియాస్ చిన్నోడి. ఈ అలియాస్ అనేది ఎ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అవడంవల్లో, నొటోరియస్ క్రిమినల్ అవడంవల్లో, వచ్చింది కాదు. కేవలం ఓ ముద్దు పేరు. అలా తన ఫ్రెండ్స్తో త్రాగుతూ సరదాగా గడుపుతున్న చిన్నోడి టేబుల్ పక్కనే ఒక అమ్మాయిల గ్యాంగ్ రెండో రౌండ్ డ్రింక్స్ నుండి మూడో రౌండ్కి సిద్ధమవుతూ ఉన్నారు. అందులో ఓ అమ్మాయి ఇలా అంది. "క్యారెక్టర్తో పబ్ బిల్లు కట్టగలమా..? కరెన్సీతోనే కట్టాలి కదా! అలాంటి కరెన్సీతోనే కానీ, ఈ క్యారెక్టర్లు, కాకరకాయలు, మంచితనమూ, అవసరం లేదే మనకు" అని గట్టిగా తన ఫీలింగ్, తన గర్ల్స్ గ్యాంగ్తో షేర్ చేసుకుంటోందా అమ్మాయి. ఇదంతా ఓకంట గమనిస్తున్న చిన్నోడి, కాస్త కిక్ ఎక్కాక కూసే మాటలు తెలిసినవే కాబట్టి ఆ గ్యాంగ్ వైపు చూసీ చూడనట్టు వెళ్ళి సర్వింగ్ కౌంటర్ దగ్గర ఓఫ్లేమ్ షాట్ ఆర్డర్ చేశాడు. ఇంతలో మరో యువకుడు కూడా కౌంటరు దగ్గరకొచ్చి చిన్నోడిలాగానే ఫ్లేమ్ షాట్ ఆర్డర్ చేసాడు. అక్కడి పాటల హోరు, మిరుమిట్లు గొలిపే లైటింగ్ చిన్నోడి బాడిలో ఓ చిన్నపాటి బీటుకు తగ్గ కదలికలు కల్పించాయి....................© 2017,www.logili.com All Rights Reserved.