ఆరెస్సెస్ పునాదులు
డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1925లో దసరా పండుగ రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ను స్థాపించాడు. ఆనాడు సంస్థ భావజాలం, లక్ష్యాలు, ఉద్దేశాలు స్పష్టంగా లేవు. దానితో పాటు ఆ సంస్థ సభ్యులకు భావజాలపరమైన నిర్మాణ అవసరం ఉన్నట్లు కనిపించలేదు. బహుశా దేశం స్వాతంత్ర్యోద్యమం మధ్యలో ఉన్న కారణంగా స్వాతంత్య్ర సాధనకు పని చేస్తున్న అనేక సంస్థలతో పాటు ఆరెస్సెస్ కూడా తానూ ఒకటి అన్నట్లు నటించింది.
ఆరెస్సెస్ లేదా సంఘ్ సంస్థాపక సభ్యులు భావోద్వేగాల ఆధారంగా సంస్థను స్థాపించడంలో విజయవంతమయ్యారు. సంఘ్క చెందిన మేధావులు ప్రచారం చేసిన భావాలలో మొదటిది, 'కాషాయ జెండానే, దేశం జెండా', రెండవది, 'హిందుస్థాన్ హిందువుల దేశం', మూడవది, 'ఏకచలకనువర్తిత్వ' (ఒకే నాయకుని అధికారాన్ని ప్రశ్నించ వీలులేని విధేయతా నియమం). సంఘ్ 'క్రమశిక్షణ'కు అత్యున్నత ప్రాముఖ్యత ఉంది. ఆ క్రమశిక్షణే నాజీ జర్మనీ, ఫాసిస్ట్ ఇటలీలను ఆదర్శంగా తీసుకొని గౌరవించేలా చేసింది. కానీ సంఘ్ తన మేధో సంప్రదాయాన్ని ఇతర పద్ధతుల ద్వారా అభివృద్ధి చేసింది. ఆ పద్ధతులు - హిందువుల చరిత్రను కీర్తించడం, ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక పని విధానాన్ని ఎగతాళి చేయడం, భారత జాతీయ కాంగ్రెస్పై ఆరోపణలు చేయడం, అవమానించడం. సంఘ్ లో చాలా సంవత్సరాలపాటు పనిచేసిన అనేకమంది ఇలాంటి వ్యూహాలను తమ రచనల్లో నమోదు చేశారు. సంఘక్కు లౌకికతత్వం, రాజకీయ జాతీయవాదం, ప్రజాస్వామిక నియమాలపైన, కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం లేకపోవడంతో, వాటిపై ఆరోగ్యకరమైన చర్చ జరపడం అనవసరం అని సంఘ్ సహజంగానే భావించింది.......................
ఆరెస్సెస్ పునాదులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1925లో దసరా పండుగ రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ను స్థాపించాడు. ఆనాడు సంస్థ భావజాలం, లక్ష్యాలు, ఉద్దేశాలు స్పష్టంగా లేవు. దానితో పాటు ఆ సంస్థ సభ్యులకు భావజాలపరమైన నిర్మాణ అవసరం ఉన్నట్లు కనిపించలేదు. బహుశా దేశం స్వాతంత్ర్యోద్యమం మధ్యలో ఉన్న కారణంగా స్వాతంత్య్ర సాధనకు పని చేస్తున్న అనేక సంస్థలతో పాటు ఆరెస్సెస్ కూడా తానూ ఒకటి అన్నట్లు నటించింది. ఆరెస్సెస్ లేదా సంఘ్ సంస్థాపక సభ్యులు భావోద్వేగాల ఆధారంగా సంస్థను స్థాపించడంలో విజయవంతమయ్యారు. సంఘ్క చెందిన మేధావులు ప్రచారం చేసిన భావాలలో మొదటిది, 'కాషాయ జెండానే, దేశం జెండా', రెండవది, 'హిందుస్థాన్ హిందువుల దేశం', మూడవది, 'ఏకచలకనువర్తిత్వ' (ఒకే నాయకుని అధికారాన్ని ప్రశ్నించ వీలులేని విధేయతా నియమం). సంఘ్ 'క్రమశిక్షణ'కు అత్యున్నత ప్రాముఖ్యత ఉంది. ఆ క్రమశిక్షణే నాజీ జర్మనీ, ఫాసిస్ట్ ఇటలీలను ఆదర్శంగా తీసుకొని గౌరవించేలా చేసింది. కానీ సంఘ్ తన మేధో సంప్రదాయాన్ని ఇతర పద్ధతుల ద్వారా అభివృద్ధి చేసింది. ఆ పద్ధతులు - హిందువుల చరిత్రను కీర్తించడం, ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక పని విధానాన్ని ఎగతాళి చేయడం, భారత జాతీయ కాంగ్రెస్పై ఆరోపణలు చేయడం, అవమానించడం. సంఘ్ లో చాలా సంవత్సరాలపాటు పనిచేసిన అనేకమంది ఇలాంటి వ్యూహాలను తమ రచనల్లో నమోదు చేశారు. సంఘక్కు లౌకికతత్వం, రాజకీయ జాతీయవాదం, ప్రజాస్వామిక నియమాలపైన, కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం లేకపోవడంతో, వాటిపై ఆరోగ్యకరమైన చర్చ జరపడం అనవసరం అని సంఘ్ సహజంగానే భావించింది.......................© 2017,www.logili.com All Rights Reserved.