Samakalika Antharjaatiyam

By Buddiga Jamindar (Author)
Rs.500
Rs.500

Samakalika Antharjaatiyam
INR
MANIMN3739
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఏది వాస్తవం? ఏది అవాస్తవం?

'భారత మిలిటరీ దళాలు పాంగోంగ్ సరస్సుకు దక్షిణ ఒడ్డున గల వాస్తవాధీన రేఖను దాటి చైనా భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయని' మంగళవారం (సెప్టెంబరు 8 న) చైనా మిలిటరీ ఆరోపించింది. ప్పెవో కొండల్ని భారత సేనలు దాటాయని చైనా ఆరోపణ. దీనిపై భారతదేశం వైపు నుంచి ఇంకా వివరణ ఇవ్వలేదు. కానీ ఆగస్టు 29, 30 తేదీల్లో పాంగోంగ్ సరస్సు దగ్గర చైనా సేనలు భారత భూభాగంలోకి చొచ్చుకొని రావటానికి ప్రయత్నించగా నివారించగలిగామని భారత్ ఇప్పటికే ప్రకటించింది. ఒకవైపు కొద్ది రోజుల్లో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సమావేశమై చర్చలు జరుపనున్న తరుణంలో భారత సేనలు సరిహద్దు దగ్గర హెచ్చరిక కాల్పులు జరపటం ఆక్షేపణీయమని చైనా అంటున్నా, తన కవ్వింపు చర్యలు మాత్రం మానలేదు. ఇప్పుడు అరుణాచల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. జూన్ 15 నాడు గాల్వాన్ లోయ ప్రాంతంలో మన సైనికులపై చైనా ఆర్మీ దాడిచేసి 20 మందిని చంపారని మన ఆర్మీ ప్రకటించగా, భారత భూ భాగంలోకి ఒక అంగుళం కూడా చైనా సేనలు ప్రవేశించలేదని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించి దేశ ప్రజలను దిగ్ర్భాంతిపర్చారు. వాస్తవమేమంటే ఇరుదేశాల ప్రకటనలతో ప్రజలు సందిగ్ధ పరిస్థితులలో డోలాయమానంలో పడుతున్నారు. ప్రజలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం తేల్చుకోలేని పరిస్థితుల్లో ఊగిసలాడవల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భావోద్వేగాల్ని, ప్రజల సెంటిమెంటును ఆసరాగా తీసుకుని, జాతీయవాద ప్రేరణ ముసుగులో ఇరు దేశపాలకులు సరిహద్దు తగాదాలను సృష్టించడం ద్వారా ఇరుదేశాలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల నుండి దృష్టిని మళ్లిస్తున్నారనే విశ్లేషకుల  వాదన లేకపోలేదు.

మన జీడీపీ 2019 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతం ఉండగా, 2020 నాటికి 4.2 శాతానికి పడిపోయి గడిచిన 11 సంవత్సరాల్లో అథమస్థాయికి దిగజారింది. 2020-21 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసం, సంవత్సర క్రితం పరిస్థితులతో పోలిస్తే 23.9 శాతం జిడిపి మైనస్ (ప్రతికూలంకి దిగజారాం . ప్రపంచంలో ఏ దేశం ఇంత ఊబిలో దిగలేదు. జి-20 దేశాల్లో ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇంత దారుణంగా పడిపోలేదు. మరో వైపు ఇదే జి-20 దేశాల్లో అగ్రభాగాన చైనా ఆర్థికవ్యవస్థ 3.2 శాతం జిడిపి వృద్ధి రేటును నమోదు చేసింది. 6.8 శాతం వృద్ధి పడిపోయినప్పటికీ ప్రపంచంలో ఏ దేశం ఇంత అనుకూల వృద్ధిరేటును సాధించలేదు. వృద్ధి రేటు ఉన్నప్పటికీ చైనా దేశీయంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.

కోవిడ్ నేపథ్యంలో అమెరికా దాడి నుండి చైనా ఇంకా కోలుకున్నట్టు లేదు. కోవిడ్ దారి మళ్ళించడానికి సరిహద్దు దేశాలతో తగాదాలకు దిగుతోందని విశ్లేషకులు అంటున్నారు. భారతదేశం..............

ఏది వాస్తవం? ఏది అవాస్తవం? 'భారత మిలిటరీ దళాలు పాంగోంగ్ సరస్సుకు దక్షిణ ఒడ్డున గల వాస్తవాధీన రేఖను దాటి చైనా భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయని' మంగళవారం (సెప్టెంబరు 8 న) చైనా మిలిటరీ ఆరోపించింది. ప్పెవో కొండల్ని భారత సేనలు దాటాయని చైనా ఆరోపణ. దీనిపై భారతదేశం వైపు నుంచి ఇంకా వివరణ ఇవ్వలేదు. కానీ ఆగస్టు 29, 30 తేదీల్లో పాంగోంగ్ సరస్సు దగ్గర చైనా సేనలు భారత భూభాగంలోకి చొచ్చుకొని రావటానికి ప్రయత్నించగా నివారించగలిగామని భారత్ ఇప్పటికే ప్రకటించింది. ఒకవైపు కొద్ది రోజుల్లో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సమావేశమై చర్చలు జరుపనున్న తరుణంలో భారత సేనలు సరిహద్దు దగ్గర హెచ్చరిక కాల్పులు జరపటం ఆక్షేపణీయమని చైనా అంటున్నా, తన కవ్వింపు చర్యలు మాత్రం మానలేదు. ఇప్పుడు అరుణాచల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. జూన్ 15 నాడు గాల్వాన్ లోయ ప్రాంతంలో మన సైనికులపై చైనా ఆర్మీ దాడిచేసి 20 మందిని చంపారని మన ఆర్మీ ప్రకటించగా, భారత భూ భాగంలోకి ఒక అంగుళం కూడా చైనా సేనలు ప్రవేశించలేదని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించి దేశ ప్రజలను దిగ్ర్భాంతిపర్చారు. వాస్తవమేమంటే ఇరుదేశాల ప్రకటనలతో ప్రజలు సందిగ్ధ పరిస్థితులలో డోలాయమానంలో పడుతున్నారు. ప్రజలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం తేల్చుకోలేని పరిస్థితుల్లో ఊగిసలాడవల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భావోద్వేగాల్ని, ప్రజల సెంటిమెంటును ఆసరాగా తీసుకుని, జాతీయవాద ప్రేరణ ముసుగులో ఇరు దేశపాలకులు సరిహద్దు తగాదాలను సృష్టించడం ద్వారా ఇరుదేశాలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల నుండి దృష్టిని మళ్లిస్తున్నారనే విశ్లేషకుల  వాదన లేకపోలేదు. మన జీడీపీ 2019 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతం ఉండగా, 2020 నాటికి 4.2 శాతానికి పడిపోయి గడిచిన 11 సంవత్సరాల్లో అథమస్థాయికి దిగజారింది. 2020-21 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసం, సంవత్సర క్రితం పరిస్థితులతో పోలిస్తే 23.9 శాతం జిడిపి మైనస్ (ప్రతికూలంకి దిగజారాం . ప్రపంచంలో ఏ దేశం ఇంత ఊబిలో దిగలేదు. జి-20 దేశాల్లో ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇంత దారుణంగా పడిపోలేదు. మరో వైపు ఇదే జి-20 దేశాల్లో అగ్రభాగాన చైనా ఆర్థికవ్యవస్థ 3.2 శాతం జిడిపి వృద్ధి రేటును నమోదు చేసింది. 6.8 శాతం వృద్ధి పడిపోయినప్పటికీ ప్రపంచంలో ఏ దేశం ఇంత అనుకూల వృద్ధిరేటును సాధించలేదు. వృద్ధి రేటు ఉన్నప్పటికీ చైనా దేశీయంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. కోవిడ్ నేపథ్యంలో అమెరికా దాడి నుండి చైనా ఇంకా కోలుకున్నట్టు లేదు. కోవిడ్ దారి మళ్ళించడానికి సరిహద్దు దేశాలతో తగాదాలకు దిగుతోందని విశ్లేషకులు అంటున్నారు. భారతదేశం..............

Features

  • : Samakalika Antharjaatiyam
  • : Buddiga Jamindar
  • : Visalandra book houses
  • : MANIMN3739
  • : Hard Binding
  • : Jan, 2023
  • : 556
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samakalika Antharjaatiyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam