ఈ సంపుటం చర్చించే కాలం అర్ధశతాబ్ది కంటే తక్కువే అయినప్పటికీ రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాహిత్య, సంస్కృతీ రంగాలలో బహు అంశాలు, సమస్యల గురించిన అధ్యయనాలతో నిండిపోయింది. వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా, విద్యారంగాలలో ప్రాంత నిర్దిష్ట విధానాలతో పాటు ప్రభుత్వం గణనీయమైన పాలనా సంస్కరణలను కూడా ప్రవేశపెట్టింది. "తమకు సంబంధించిన, తమకు వర్తించే పాలనా ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని" ఈ సంస్కరణలు సునిశ్చితం చేశాయి. హరిత విప్లవం వ్యవసాయధారిత ఆహారపంటల నుండి వాణిజ్య, మధ్యతరగతి రైతులకు లాభం చేకూర్చింది.
పేదరికం, అసమానతలు గణనీయంగా పెరిగాయి. పేద, సన్నకారు రైతులకు తీవ్రమైన కష్టాలు ఏర్పడ్డాయి. ఈ కాలంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. గణనీయమైన పారిశ్రామికాభివృద్ధి జరిగింది. అనేక రాజకీయ, సామాజిక, ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలకు ఈ కాలం స్థానమైంది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతీ 8వది, చివరిది అయిన ఈ సంపుటం గత అర్ధశతాబ్దపు ఆంధ్రప్రదేశ్ చరిత్రను సవివరంగా అందిస్తున్నది.
ఈ సంపుటం చర్చించే కాలం అర్ధశతాబ్ది కంటే తక్కువే అయినప్పటికీ రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాహిత్య, సంస్కృతీ రంగాలలో బహు అంశాలు, సమస్యల గురించిన అధ్యయనాలతో నిండిపోయింది. వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా, విద్యారంగాలలో ప్రాంత నిర్దిష్ట విధానాలతో పాటు ప్రభుత్వం గణనీయమైన పాలనా సంస్కరణలను కూడా ప్రవేశపెట్టింది. "తమకు సంబంధించిన, తమకు వర్తించే పాలనా ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని" ఈ సంస్కరణలు సునిశ్చితం చేశాయి. హరిత విప్లవం వ్యవసాయధారిత ఆహారపంటల నుండి వాణిజ్య, మధ్యతరగతి రైతులకు లాభం చేకూర్చింది. పేదరికం, అసమానతలు గణనీయంగా పెరిగాయి. పేద, సన్నకారు రైతులకు తీవ్రమైన కష్టాలు ఏర్పడ్డాయి. ఈ కాలంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. గణనీయమైన పారిశ్రామికాభివృద్ధి జరిగింది. అనేక రాజకీయ, సామాజిక, ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలకు ఈ కాలం స్థానమైంది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతీ 8వది, చివరిది అయిన ఈ సంపుటం గత అర్ధశతాబ్దపు ఆంధ్రప్రదేశ్ చరిత్రను సవివరంగా అందిస్తున్నది.© 2017,www.logili.com All Rights Reserved.