అది ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అత్యంత రద్దీగా ఉన్న ఆ విమానాశ్రయం ప్రధాన ద్వారం నుండి ప్రయాణికుల గుంపు చక్- ఇన్ వైపు కదులుతూ ఉంది. వాళ్ళలో పాతికేళ్ళు నిండని యువతి, యాస్మిన్ నజర్ భుజానికి నీలి రంగు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, రెండు భారీ ట్రాలీ బ్యాగ్లు ఉన్న బ్యాగేజ్ కార్ట్ తోసుకుంటూ ముందుకు వస్తూ ఉంది. పసిడి ఛాయలో మెరిసిపోతున్న ఆమె ముఖంలో ఆకుపచ్చని కళ్ళు మరకతమణుల్ని తలపిస్తున్నాయి. కనుబొమ్మలు ఆందోళనతో అదురుతూ ఉన్నాయి. ఆమె ధరించిన నీలి రంగు కుర్తా, అదే రంగు ప్యాంట్ ఆమె నిరాడంబరతని తెలియజేస్తూ ఉన్నాయి. నడుము దాకా ఉండి ముడి వేయక వెనక్కి దువ్విన ఒత్తైన కురులు నెమలి పురిని తలపిస్తూ ఉన్నాయి. వేగంగా ముందుకు వెళ్తున్న ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి, మెల్లిగా నడుస్తూ వస్తున్న వాళ్ళ అమ్మ గుల్ అఫ్రోజా వైపు చూసింది. ఆమె ముఖాన్ని మాత్రం కప్పని నిండైన నల్లని చాదర్ ధరించి ఉంది. కుడి భుజానికి వేసుకున్న బూడిద రంగు టోట్ బ్యాగ్ ని ఎడమ భుజానికి మార్చుకొని, తన కూతురిని అందుకోవడానికి నడక వేగాన్ని రెట్టింపు చేసింది. అది గమనించిన యాస్మిన్ తన ఆందోళనని అదుపులో పెట్టుకునే క్రమంలో నడకని ఆపి, కళ్ళు మూసుకొని, ఒక్కసారి నిశ్వసించి, నెమ్మదిగా ముందుకు అడుగు వేసింది. రాబోయే రెండు వారాలు వాళ్ళిద్దరి జీవితంలో చాలా కీలకమైనవి. వారి నిర్ణయాత్మక ప్రణాళికలో భాగమైన ప్రస్తుత ప్రధాన ఘట్టం- ఢిల్లీ నుంచి సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడం. ఆ ప్రణాళికని విజయవంతంగా ఎలా అమలు జరపాలన్న ఆలోచనే యాస్మిన్ ఆందోళనకి కారణం. ఇద్దరూ చక్-ఇన్ కౌంటర్ని చేరుకున్నారు. అక్కడ ఐ.డి. కార్డ్, పాస్పోర్ట్, వీసాల పరిశీలన పూర్తయ్యి బోర్డింగ్ పాస్ లు తీసుకున్నాక ముందుకు కదిలారు. యాస్మిన్ లగేజ్ ని బ్యాగేజ్ కెరసెల్ మీద పెట్టి సెక్యూరిటీ చెక్ వైపు నడిచింది. అఫ్రోజా తన చేతి బ్యాగ్ ని కెరసెల్ మీద ఉంచి యాస్మిన్ని అనుసరించింది. లగేజ్ తనిఖీ అయిన తర్వాత ఇద్దరూ ఇమిగ్రేషన్ కౌంటర్ని.............................
అది ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అత్యంత రద్దీగా ఉన్న ఆ విమానాశ్రయం ప్రధాన ద్వారం నుండి ప్రయాణికుల గుంపు చక్- ఇన్ వైపు కదులుతూ ఉంది. వాళ్ళలో పాతికేళ్ళు నిండని యువతి, యాస్మిన్ నజర్ భుజానికి నీలి రంగు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, రెండు భారీ ట్రాలీ బ్యాగ్లు ఉన్న బ్యాగేజ్ కార్ట్ తోసుకుంటూ ముందుకు వస్తూ ఉంది. పసిడి ఛాయలో మెరిసిపోతున్న ఆమె ముఖంలో ఆకుపచ్చని కళ్ళు మరకతమణుల్ని తలపిస్తున్నాయి. కనుబొమ్మలు ఆందోళనతో అదురుతూ ఉన్నాయి. ఆమె ధరించిన నీలి రంగు కుర్తా, అదే రంగు ప్యాంట్ ఆమె నిరాడంబరతని తెలియజేస్తూ ఉన్నాయి. నడుము దాకా ఉండి ముడి వేయక వెనక్కి దువ్విన ఒత్తైన కురులు నెమలి పురిని తలపిస్తూ ఉన్నాయి. వేగంగా ముందుకు వెళ్తున్న ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి, మెల్లిగా నడుస్తూ వస్తున్న వాళ్ళ అమ్మ గుల్ అఫ్రోజా వైపు చూసింది. ఆమె ముఖాన్ని మాత్రం కప్పని నిండైన నల్లని చాదర్ ధరించి ఉంది. కుడి భుజానికి వేసుకున్న బూడిద రంగు టోట్ బ్యాగ్ ని ఎడమ భుజానికి మార్చుకొని, తన కూతురిని అందుకోవడానికి నడక వేగాన్ని రెట్టింపు చేసింది. అది గమనించిన యాస్మిన్ తన ఆందోళనని అదుపులో పెట్టుకునే క్రమంలో నడకని ఆపి, కళ్ళు మూసుకొని, ఒక్కసారి నిశ్వసించి, నెమ్మదిగా ముందుకు అడుగు వేసింది. రాబోయే రెండు వారాలు వాళ్ళిద్దరి జీవితంలో చాలా కీలకమైనవి. వారి నిర్ణయాత్మక ప్రణాళికలో భాగమైన ప్రస్తుత ప్రధాన ఘట్టం- ఢిల్లీ నుంచి సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడం. ఆ ప్రణాళికని విజయవంతంగా ఎలా అమలు జరపాలన్న ఆలోచనే యాస్మిన్ ఆందోళనకి కారణం. ఇద్దరూ చక్-ఇన్ కౌంటర్ని చేరుకున్నారు. అక్కడ ఐ.డి. కార్డ్, పాస్పోర్ట్, వీసాల పరిశీలన పూర్తయ్యి బోర్డింగ్ పాస్ లు తీసుకున్నాక ముందుకు కదిలారు. యాస్మిన్ లగేజ్ ని బ్యాగేజ్ కెరసెల్ మీద పెట్టి సెక్యూరిటీ చెక్ వైపు నడిచింది. అఫ్రోజా తన చేతి బ్యాగ్ ని కెరసెల్ మీద ఉంచి యాస్మిన్ని అనుసరించింది. లగేజ్ తనిఖీ అయిన తర్వాత ఇద్దరూ ఇమిగ్రేషన్ కౌంటర్ని.............................© 2017,www.logili.com All Rights Reserved.