నాలుగు కాలాలపాటు నిలబడే కథలు
నీతి గ్రంథాలు అవినీతి గ్రంథాలు అని ఉండవు. 'బాగా రాసిన పుస్తకాలే ఉంటాయి' అని అంటాడు ఓ చోట ఆస్కార్ వైల్డ్. కానీ మనో విశ్లేషణ గ్రంథాలు, అలా రాసే రచయితలు దొరకరు. అందులోనూ సంయమనంతో రాసే కథకులు చాలా తక్కువ. పేదరికం, దారిద్ర్యం - వీటి మీద రసానుభూతితో రాసిన కథకులు చాలా మంది ఉండొచ్చు. కానీ వాటి లోతుల్లోకి పోయి విస్త్రుతంగా రాసే కథకులు, వాపోయే కథకులు కూడా ఉండొచ్చు. కానీ కీర్తి కాంక్ష లేకుండా రాసే కథకులు, నవలాకారులు, సాహిత్య ప్రేమికులు మనకి అరుదుగా ఎదురవుతుంటారు.
ఏ మాత్రం ఆడంబరం లేని రచయిత డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, మనో వైజ్ఞానిక నవల "చీకటిలో మలి వెలుగు" డా: మాచిరాజు రామమచంద్ర రావు అంతర్జాతీయ చిత్రకారుడు పిలిచి 'ఇది గొప్ప నవల చదువు సాగర్' అని ఇచ్చాడు. పుస్తకాలు చదవడం విశ్లేషించడం నా ప్రాణం. నాలుగు వందల పేజీలు. నమ్మకంగా డాక్టరుగారు చెప్పారు అని చదివి, మునిగి పోయాను. వెంటనే మల్లె తీగకు ఒక సమీక్ష రాసాను. అలా ఏర్పడింది మా పరిచయం. ఆ నవలను ఇంగ్లీషులో తర్జుమా చేయడానికి వేమూరి చిరంజీవి ఆంగ్లంలో పండితుడు, ప్రిన్సిపాల్ గారు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. వారిని అభినందించే సమయంలోని పరిచయం, సంస్కారయుత స్నేహంగా మారి నిష్కపట దాత్రికి దారి తీసింది. ఆ నాటినుంచి శీనయ్య నవలలకు, కథలకు నేను సంమ్మోహితుడనయి పోయాను. ఒక భక్తుడుని అయిపోయాను. కానీ నా ' దగ్గర ఒక మాట తీసుకున్నారు, ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా రాయండి అతిశయోక్తులు వద్దు అని గట్టిగా చెప్పారు. మూగపోయాను......................
నాలుగు కాలాలపాటు నిలబడే కథలు నీతి గ్రంథాలు అవినీతి గ్రంథాలు అని ఉండవు. 'బాగా రాసిన పుస్తకాలే ఉంటాయి' అని అంటాడు ఓ చోట ఆస్కార్ వైల్డ్. కానీ మనో విశ్లేషణ గ్రంథాలు, అలా రాసే రచయితలు దొరకరు. అందులోనూ సంయమనంతో రాసే కథకులు చాలా తక్కువ. పేదరికం, దారిద్ర్యం - వీటి మీద రసానుభూతితో రాసిన కథకులు చాలా మంది ఉండొచ్చు. కానీ వాటి లోతుల్లోకి పోయి విస్త్రుతంగా రాసే కథకులు, వాపోయే కథకులు కూడా ఉండొచ్చు. కానీ కీర్తి కాంక్ష లేకుండా రాసే కథకులు, నవలాకారులు, సాహిత్య ప్రేమికులు మనకి అరుదుగా ఎదురవుతుంటారు. ఏ మాత్రం ఆడంబరం లేని రచయిత డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, మనో వైజ్ఞానిక నవల "చీకటిలో మలి వెలుగు" డా: మాచిరాజు రామమచంద్ర రావు అంతర్జాతీయ చిత్రకారుడు పిలిచి 'ఇది గొప్ప నవల చదువు సాగర్' అని ఇచ్చాడు. పుస్తకాలు చదవడం విశ్లేషించడం నా ప్రాణం. నాలుగు వందల పేజీలు. నమ్మకంగా డాక్టరుగారు చెప్పారు అని చదివి, మునిగి పోయాను. వెంటనే మల్లె తీగకు ఒక సమీక్ష రాసాను. అలా ఏర్పడింది మా పరిచయం. ఆ నవలను ఇంగ్లీషులో తర్జుమా చేయడానికి వేమూరి చిరంజీవి ఆంగ్లంలో పండితుడు, ప్రిన్సిపాల్ గారు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. వారిని అభినందించే సమయంలోని పరిచయం, సంస్కారయుత స్నేహంగా మారి నిష్కపట దాత్రికి దారి తీసింది. ఆ నాటినుంచి శీనయ్య నవలలకు, కథలకు నేను సంమ్మోహితుడనయి పోయాను. ఒక భక్తుడుని అయిపోయాను. కానీ నా ' దగ్గర ఒక మాట తీసుకున్నారు, ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా రాయండి అతిశయోక్తులు వద్దు అని గట్టిగా చెప్పారు. మూగపోయాను......................© 2017,www.logili.com All Rights Reserved.