కాంచనమాల ... ఆ పేరేల!
చాలామంది సినిమా తారలకు, సినిమాలలో ప్రవేశించిన తర్వాత పేరు మారిపోయిన విషయం మనకు తెలుసు. కాంచనమాల విషయంలో అలా కాదు, పుట్టినప్పుడు పెట్టిన పేరే కాంచనమాల. ఇంత అందమైన, ఈనాటికీ నూతనమైన ఈపేరు ఎలా పెట్టారా అనే ఆలోచనతో కొంత పరిశోధన చేశాను.
1850, 60 ల్లో తెలుగు పుస్తకాల ప్రచురణ విరివిగా మొదలైనప్పటికీ ఇతర భాషల నుండి అనువాదాలు పుస్తక రూపంలో రావడం మాత్రం 1900 సంవత్సరం తర్వాతే ఎక్కువగా జరిగింది. అప్పటికే బుద్ధ జాతక కథలు తెలుగుదేశంలో ప్రచారంలో ఉండేవి. వంగభాషలో పండితుడైన హరిప్రసాద్ శాస్త్రి కాంచనమాల నవలను రచించారు. ఇది బౌద్ధ సారస్వతములోని ఒక కథ. ఆ కథలో అశోకుని కుమారుడైన కుణాలుడి ప్రేయసి పేరు కాంచనమాల. మన అందాల తార కాంచనమాల 1917 లో జన్మించింది.
చదువుకున్నవాడు, చైతన్యవంతమైన తెనాలి పట్టణంలో ఉన్నవాడు కావున కాంచనమాల తండ్రి ఆకథలు, గాథలు విని పేరు పెట్టి ఉంటాడు అనేది నా ఊహ.
ఆతర్వాత హరిప్రసాద్ శాస్త్రి నవలను తల్లావఝల శివశంకర శాస్త్రి, వేలూరి చంద్రశేఖరం వంటి వారు ఆంధ్రీకరించారు. కాంచనమాల పేరే ప్రత్యేకం, 1917 నాటికీ, ఇప్పటికీ ఆ పేరు నిత్య నూతనం.....................
కాంచనమాల ... ఆ పేరేల! చాలామంది సినిమా తారలకు, సినిమాలలో ప్రవేశించిన తర్వాత పేరు మారిపోయిన విషయం మనకు తెలుసు. కాంచనమాల విషయంలో అలా కాదు, పుట్టినప్పుడు పెట్టిన పేరే కాంచనమాల. ఇంత అందమైన, ఈనాటికీ నూతనమైన ఈపేరు ఎలా పెట్టారా అనే ఆలోచనతో కొంత పరిశోధన చేశాను. 1850, 60 ల్లో తెలుగు పుస్తకాల ప్రచురణ విరివిగా మొదలైనప్పటికీ ఇతర భాషల నుండి అనువాదాలు పుస్తక రూపంలో రావడం మాత్రం 1900 సంవత్సరం తర్వాతే ఎక్కువగా జరిగింది. అప్పటికే బుద్ధ జాతక కథలు తెలుగుదేశంలో ప్రచారంలో ఉండేవి. వంగభాషలో పండితుడైన హరిప్రసాద్ శాస్త్రి కాంచనమాల నవలను రచించారు. ఇది బౌద్ధ సారస్వతములోని ఒక కథ. ఆ కథలో అశోకుని కుమారుడైన కుణాలుడి ప్రేయసి పేరు కాంచనమాల. మన అందాల తార కాంచనమాల 1917 లో జన్మించింది. చదువుకున్నవాడు, చైతన్యవంతమైన తెనాలి పట్టణంలో ఉన్నవాడు కావున కాంచనమాల తండ్రి ఆకథలు, గాథలు విని పేరు పెట్టి ఉంటాడు అనేది నా ఊహ. ఆతర్వాత హరిప్రసాద్ శాస్త్రి నవలను తల్లావఝల శివశంకర శాస్త్రి, వేలూరి చంద్రశేఖరం వంటి వారు ఆంధ్రీకరించారు. కాంచనమాల పేరే ప్రత్యేకం, 1917 నాటికీ, ఇప్పటికీ ఆ పేరు నిత్య నూతనం.....................© 2017,www.logili.com All Rights Reserved.