ప్రథమాధ్యాయం
తెలుగు సినిమా పుట్టి 83 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలుగు సినిమా కొరకు తీసుకొన్న కథలు, కేవలం వినోదం కోసమేనా? లేక సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని, సమాజ చైతన్యం కోసం, ప్రయోజనం కోసం కథలు స్వీకరించబడ్డాయా? అయితే అవి ఏఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని రచించబడ్డాయి అనేది ఈ సిద్ధాంత రచన ముఖ్యోద్దేశం.
నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురితమైన 'తెలుగు' సినిమాలో భాష - సాహిత్యం - సంస్కృతి అన్న గ్రంథంలో మామిడి హరికృష్ణ తెలుగు సినిమా గురించి ఇలా పేర్కొన్నాడు:
అలాగే ఒక జాతి సంస్కృతిని, దానిలోని బహుళతని, దాని అభివ్యక్త రూపాలని అధ్యయనం చేయడంలో మూడు సూచికలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అవే 1. భాష 2. సాహిత్యం 3. సినిమా! భాష. ఆ సామూహిక జనావళి మధ్య ఐక్యతకి భావ ప్రకటన 'వారధిగా' ఉండగా సాహిత్యం - ఆ జాతి సృజనాత్మక మనోవికాసానికి బౌద్ధిక (intellectual) పరిణతికి, సమిష్టి సామాజిక విధానానికి (collective social life style) 'అంబుధి'లా ఉంది. సినిమా - ఆధునిక సాంకేతిక రూపంగా, ఆ జాతి కాల్పనిక, ఊహ వికాస స్థాయికి (creative development) ప్రపంచాన్ని వారు చూసే కోణానికి దృశ్యరూప (visual) డాక్యుమెంట్ గానూ, కథాత్మక వ్యక్తీకరణ (thematic expression) గాను ఉంటోంది. అన్నింటిని మించి ఆ జాతి ప్రజల దృష్టిలో వారి గతాన్ని గుర్తు చేసే పెద్ద మనిషిలా, వర్తమానాన్ని అద్దం పట్టే సోదరుడిలా, భవిష్యత్తు జ్ఞానాన్ని అందించే సారథిలా ఉంటుంది. అందుకే సాంస్కృతిక................
ప్రథమాధ్యాయం తెలుగు సినిమా కథ - సామాజిక నేపథ్యం తెలుగు సినిమా పుట్టి 83 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలుగు సినిమా కొరకు తీసుకొన్న కథలు, కేవలం వినోదం కోసమేనా? లేక సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని, సమాజ చైతన్యం కోసం, ప్రయోజనం కోసం కథలు స్వీకరించబడ్డాయా? అయితే అవి ఏఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని రచించబడ్డాయి అనేది ఈ సిద్ధాంత రచన ముఖ్యోద్దేశం. నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురితమైన 'తెలుగు' సినిమాలో భాష - సాహిత్యం - సంస్కృతి అన్న గ్రంథంలో మామిడి హరికృష్ణ తెలుగు సినిమా గురించి ఇలా పేర్కొన్నాడు: అలాగే ఒక జాతి సంస్కృతిని, దానిలోని బహుళతని, దాని అభివ్యక్త రూపాలని అధ్యయనం చేయడంలో మూడు సూచికలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అవే 1. భాష 2. సాహిత్యం 3. సినిమా! భాష. ఆ సామూహిక జనావళి మధ్య ఐక్యతకి భావ ప్రకటన 'వారధిగా' ఉండగా సాహిత్యం - ఆ జాతి సృజనాత్మక మనోవికాసానికి బౌద్ధిక (intellectual) పరిణతికి, సమిష్టి సామాజిక విధానానికి (collective social life style) 'అంబుధి'లా ఉంది. సినిమా - ఆధునిక సాంకేతిక రూపంగా, ఆ జాతి కాల్పనిక, ఊహ వికాస స్థాయికి (creative development) ప్రపంచాన్ని వారు చూసే కోణానికి దృశ్యరూప (visual) డాక్యుమెంట్ గానూ, కథాత్మక వ్యక్తీకరణ (thematic expression) గాను ఉంటోంది. అన్నింటిని మించి ఆ జాతి ప్రజల దృష్టిలో వారి గతాన్ని గుర్తు చేసే పెద్ద మనిషిలా, వర్తమానాన్ని అద్దం పట్టే సోదరుడిలా, భవిష్యత్తు జ్ఞానాన్ని అందించే సారథిలా ఉంటుంది. అందుకే సాంస్కృతిక................© 2017,www.logili.com All Rights Reserved.