లోతైన వేర్లూ చిటారు కొమ్మలూ
మొక్కలు, తీవలకు 'వృక్షాలు' అనే పెద్దమాట వాడే వీలు లేదు. మొక్కలూ తీవలూ పొదలూ చెట్లూ ప్రకృతి అనుమతి ప్రకారం ఉంటాయి. వాటి అందం వాటిది. వాటి ప్రమేయం వాటిది. కాని వృక్షాలు అరణ్యాలను కల్పిస్తాయి. చిక్కదనాన్ని ఇస్తాయి. ప్రాణవాయువును రాశి బోస్తాయి. వెలుతురునూ నీడలనూ ఆచూకి పట్టమంటాయి. ఉద్విగ్నంగా అడుగుపెట్టమంటాయి. ఆహ్లాదాన్ని వెతుక్కోమంటాయి. లోతైన వేర్లతో అవి భూమి పొరల్లో తచ్చాడమంటాయి. చిటారు కొమ్మలతో ఆకాశాన తొంగి చూడ మంటాయి. లంబరేఖలు ఎత్తైన నిర్మాణాలకు అనువైనవి. మహా వృక్షాలు పెద్ద గీతలు గీస్తాయి. పెద్ద కథలు కూడా.
కథ పెద్దగానే పుట్టింది. జీవన వ్యాఖ్యానం కొరకు అది కురచదనం పాటించని మొదలు, మధ్య, అంతాలను తీసుకుంది. పాఠకుని విశ్రాంత సమయాలను గుర్తించి తనతో గడిపే సమయాన్ని అంచనా వేసుకుంటూనే ఎదిగింది. పాఠకుడు కూడా స్నానానికి, భోజనానికి, విహారానికి సమయం ఇచ్చినట్టుగానే కథను చదివేందుకు కూడా సమయం ఇచ్చాడు. ఇరువురూ ఆ విధంగా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు...................
లోతైన వేర్లూ చిటారు కొమ్మలూ మొక్కలు, తీవలకు 'వృక్షాలు' అనే పెద్దమాట వాడే వీలు లేదు. మొక్కలూ తీవలూ పొదలూ చెట్లూ ప్రకృతి అనుమతి ప్రకారం ఉంటాయి. వాటి అందం వాటిది. వాటి ప్రమేయం వాటిది. కాని వృక్షాలు అరణ్యాలను కల్పిస్తాయి. చిక్కదనాన్ని ఇస్తాయి. ప్రాణవాయువును రాశి బోస్తాయి. వెలుతురునూ నీడలనూ ఆచూకి పట్టమంటాయి. ఉద్విగ్నంగా అడుగుపెట్టమంటాయి. ఆహ్లాదాన్ని వెతుక్కోమంటాయి. లోతైన వేర్లతో అవి భూమి పొరల్లో తచ్చాడమంటాయి. చిటారు కొమ్మలతో ఆకాశాన తొంగి చూడ మంటాయి. లంబరేఖలు ఎత్తైన నిర్మాణాలకు అనువైనవి. మహా వృక్షాలు పెద్ద గీతలు గీస్తాయి. పెద్ద కథలు కూడా. కథ పెద్దగానే పుట్టింది. జీవన వ్యాఖ్యానం కొరకు అది కురచదనం పాటించని మొదలు, మధ్య, అంతాలను తీసుకుంది. పాఠకుని విశ్రాంత సమయాలను గుర్తించి తనతో గడిపే సమయాన్ని అంచనా వేసుకుంటూనే ఎదిగింది. పాఠకుడు కూడా స్నానానికి, భోజనానికి, విహారానికి సమయం ఇచ్చినట్టుగానే కథను చదివేందుకు కూడా సమయం ఇచ్చాడు. ఇరువురూ ఆ విధంగా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు...................© 2017,www.logili.com All Rights Reserved.