విత్తనం బొజ్జలో నుంచి మొక్క పాపాయిని నేల పొత్తిళ్ళలోకి తెచ్చి, పెంచి పెద్ద చేసే దేవతే కదా వానంటే. మేఘాలు వెండి దారాలతో భూమికి ఆకుపచ్చని జీవాన్ని నేయడమే కదా వానంటే. ప్రకృతి పసి పాపాయై చేసే అల్లరి చప్పుళ్ళే కాదు, కోపంతో ముఖం చాటేసి నిర్దాక్షిణ్యంగా జీవితాల్ని చిదిమి పారేసే మృత్యువు కూడా వానే. ఆనందం, ఆశ్చర్యం, భయం, బీభత్సం, విషాదం, దుఃఖం వానకున్న అనేక ముఖాలు. కళ్ళకు కనిపించే ప్రాణులతో పాటు, కనిపించని కోట్లాది జీవరాశుల బతుకులు శాసించేదే వాన. అలాంటి వాన నేపథ్యంలో తెలుగులో అనేకానేక కథలు వచ్చాయి. అందులో గుండెలు తడి చేసి, ఆలోచనలను తడిమే కథలన్నీ ఒక దరికి చేరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం.
- కృష్ణ మోహన్ బాబు
విత్తనం బొజ్జలో నుంచి మొక్క పాపాయిని నేల పొత్తిళ్ళలోకి తెచ్చి, పెంచి పెద్ద చేసే దేవతే కదా వానంటే. మేఘాలు వెండి దారాలతో భూమికి ఆకుపచ్చని జీవాన్ని నేయడమే కదా వానంటే. ప్రకృతి పసి పాపాయై చేసే అల్లరి చప్పుళ్ళే కాదు, కోపంతో ముఖం చాటేసి నిర్దాక్షిణ్యంగా జీవితాల్ని చిదిమి పారేసే మృత్యువు కూడా వానే. ఆనందం, ఆశ్చర్యం, భయం, బీభత్సం, విషాదం, దుఃఖం వానకున్న అనేక ముఖాలు. కళ్ళకు కనిపించే ప్రాణులతో పాటు, కనిపించని కోట్లాది జీవరాశుల బతుకులు శాసించేదే వాన. అలాంటి వాన నేపథ్యంలో తెలుగులో అనేకానేక కథలు వచ్చాయి. అందులో గుండెలు తడి చేసి, ఆలోచనలను తడిమే కథలన్నీ ఒక దరికి చేరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం. - కృష్ణ మోహన్ బాబు© 2017,www.logili.com All Rights Reserved.