బ్రిటిష్ స్వాధీనానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ, సిర్కా 1700-57
1.1 వ్యవసాయం, వ్యావసాయిక వ్యవస్థ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఇటీవలి కాలంలో ఒక భారీ చారిత్రక సర్వే నిర్వహించిన అంగస్ మాడిసన్ లెక్కల ప్రకారం, 1700లో భారతదేశంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) అప్పటి ప్రపంచ జీడీపీలో రమారమి 24.5 శాతం వరకు ఉంటుంది. ఇలాంటి అంచనాలలో దోష శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది, అయినప్పటికీ 18వ శతాబ్దపు మలినాళ్ల ఇంగ్లాండు పారిశ్రామిక విప్లవానికి, ఆసియాలో దాని వలసవాద ఆక్రమణలు ప్రపంచాన్ని మార్చేయ సాగడానికి ముందు గడచిన కాలంలో భారతీయ వ్యవసాయం, వృత్తులు ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో గణనీయ వాటా కలిగి ఉండేవన్న వాస్తవాన్ని ఇది మనకు తేటతెల్లం చేస్తుంది. పైగా 1700లో, మాడిసన్ అంచనాల ప్రకారం, గ్రేట్ బ్రిటన్ జీడీపీ కంటే భారతదేశం జీడీపీ 8.5 రెట్లు ఎక్కువ. అదే గ్రేట్ బ్రిటన్ తదుపరి శతాబ్దంలో భారతదేశపు యజమానిగా ఆవిర్భవించింది. ఇందులో పెద్దగా ఆశ్యర్యపోవలసింది ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశం తన భారీ జనాభా అవసరాలకు తగినంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాల్సి వచ్చేది. అదే బ్రిటన్లో జనసంఖ్య చాలా తక్కువ. 1701లో భారత జనాభా 165 నుంచి 175 మిలియన్ల వరకు ఉండగా బ్రిటన్లో 9.4 మిలియన్ల మంది ఉండేవారు.
భారతదేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం సహజంగా వ్యవసాయంగా ఉండేది. రైతులు తమ సాదా సీదా పనిముట్లతోనే అయినా మంచి నైపుణ్యంతో సాగు చేసేవారు. సారవంతమైన పై పొర నేలను తేలికపాటి నాగళ్లతో పెళ్లగించేవారు. గసికతో, జడ్డిగంతో విత్తనాలు ఎదబెట్టేవారు. బావుల కింద సేద్యం చేసేవారు. గిలకలు లేదా కొయ్య చక్రాలు (పిన్ డ్రమ్ గేరింగ్ సాధనాలు)............
బ్రిటిష్ స్వాధీనానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ, సిర్కా 1700-57 1.1 వ్యవసాయం, వ్యావసాయిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఇటీవలి కాలంలో ఒక భారీ చారిత్రక సర్వే నిర్వహించిన అంగస్ మాడిసన్ లెక్కల ప్రకారం, 1700లో భారతదేశంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) అప్పటి ప్రపంచ జీడీపీలో రమారమి 24.5 శాతం వరకు ఉంటుంది. ఇలాంటి అంచనాలలో దోష శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది, అయినప్పటికీ 18వ శతాబ్దపు మలినాళ్ల ఇంగ్లాండు పారిశ్రామిక విప్లవానికి, ఆసియాలో దాని వలసవాద ఆక్రమణలు ప్రపంచాన్ని మార్చేయ సాగడానికి ముందు గడచిన కాలంలో భారతీయ వ్యవసాయం, వృత్తులు ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో గణనీయ వాటా కలిగి ఉండేవన్న వాస్తవాన్ని ఇది మనకు తేటతెల్లం చేస్తుంది. పైగా 1700లో, మాడిసన్ అంచనాల ప్రకారం, గ్రేట్ బ్రిటన్ జీడీపీ కంటే భారతదేశం జీడీపీ 8.5 రెట్లు ఎక్కువ. అదే గ్రేట్ బ్రిటన్ తదుపరి శతాబ్దంలో భారతదేశపు యజమానిగా ఆవిర్భవించింది. ఇందులో పెద్దగా ఆశ్యర్యపోవలసింది ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశం తన భారీ జనాభా అవసరాలకు తగినంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాల్సి వచ్చేది. అదే బ్రిటన్లో జనసంఖ్య చాలా తక్కువ. 1701లో భారత జనాభా 165 నుంచి 175 మిలియన్ల వరకు ఉండగా బ్రిటన్లో 9.4 మిలియన్ల మంది ఉండేవారు. భారతదేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం సహజంగా వ్యవసాయంగా ఉండేది. రైతులు తమ సాదా సీదా పనిముట్లతోనే అయినా మంచి నైపుణ్యంతో సాగు చేసేవారు. సారవంతమైన పై పొర నేలను తేలికపాటి నాగళ్లతో పెళ్లగించేవారు. గసికతో, జడ్డిగంతో విత్తనాలు ఎదబెట్టేవారు. బావుల కింద సేద్యం చేసేవారు. గిలకలు లేదా కొయ్య చక్రాలు (పిన్ డ్రమ్ గేరింగ్ సాధనాలు)............© 2017,www.logili.com All Rights Reserved.