తొలినాటి తెలుగు సినిమా చరిత్రకు సంబంధించి, నటీనటుల, టెక్నీషియన్ల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి ఒకనాడు ఆయా సినిమాలకు సంబంధించిన పాటల పుస్తకాలే మూలాధారంగా వుండేవి. ఈ తరంవారికి ఈ విషయం నమ్మశక్యం కాకపోవచ్చు. తెలుగు టాకీ “భక్త ప్రహ్లాద" 1931లో వస్తే కాదు కాదు తెలుగు టాకీ వచ్చింది 1932లో. ఈ విషయం సినీచరిత్ర పరిశోధకుడు ప్రముఖ ఇండియా టుడే జర్నలిస్ట్ రెంటాల జయదేవ ఏళ్ల శ్రమకోర్చి సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఆయన పరిశోధనకు వి.ఏ.కె. వంటి పెద్దవారి ఆమోదమూ ప్రశంసా లభించింది. కనుక తొలి తెలుగు టాకీ 1932లోనే వచ్చింది. తెలుగు సినిమా తొలి పాటల పుస్తకం 1933లో వచ్చింది. అంటే తెలుగు సినిమా పాటల పుస్తకం ఎనభై యేళ్లకు చేరువగా ఉన్నదన్నమాట.
ఆ రోజుల్లో విడుదలైన సినిమాతో పాటు, ఆ సినిమాల్లోని పాటలు, పద్యాలు టూకీగా ఆ సినిమా కథతో ఓ చిన్న పుస్తకాన్ని అచ్చువేసి ప్రేక్షకులకు అమ్మితే తమకు, ప్రేక్షకులకు ఉభయతారకంగా ఉంటుందనే ఊహ తట్టిన ఈస్టిండియా కంపెనీవారికి చాలామంది సినిమా చరిత్ర పరిశోధకులు జోహారులర్పించకుండా వుండలేరు.
సి. పుల్లయ్య దర్శకత్వంలో 1933లో వచ్చిన “సతీసావిత్రి” తొలి తెలుగు సినిమా పాటల పుస్తకం. 18 సెం.మీ. పొడవు, 12 సెం.మీ. వెడల్పు వున్న ఈ పాటల పుస్తకం వెల ఒక కాని. అంటే సుమారు 2 పైసలు. ఇంటర్వెల్లో హాల్కు సంబంధించిన నౌకరు థియేటర్లో, బయట సోడా, టీలతో పాటు అమ్మేవాడు. ఈ తొలి ప్రయత్నానికి వచ్చిన స్పందనతో ఈ నిర్మాతలే 1934లో సి. పుల్లయ్యతోనే తీసిన “లవకుశ” సినిమా పాటల పుస్తకాన్ని రంగుల కవర్ పేజీ ఇంకాస్త పెద్ద సైజులో ఆకర్షణీయంగా ముద్రించారు. ఈ క్రమంలో చాలామంది ప్రేక్షకులు ఎగబడి కొన్నారు. తొలి తెలుగు, తమిళ టాకీగా చరిత్రకెక్కిన "కాళిదాస" (1931) సినిమా పాటల పుస్తకం అచ్చయింది. అలాగే "భక్త ప్రహ్లాద" దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి "కాళిదాస"కు పనిచేశాడు గనుక ఈ చిత్రానికి కూడా పాటల పుస్తకం వచ్చి ఉండాలని కొందరంటారు. అలాగైతే...............
చెరిగిపోని ఓ జ్ఞాపకం తెలుగు సినిమా పాటల పుస్తకం తొలినాటి తెలుగు సినిమా చరిత్రకు సంబంధించి, నటీనటుల, టెక్నీషియన్ల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి ఒకనాడు ఆయా సినిమాలకు సంబంధించిన పాటల పుస్తకాలే మూలాధారంగా వుండేవి. ఈ తరంవారికి ఈ విషయం నమ్మశక్యం కాకపోవచ్చు. తెలుగు టాకీ “భక్త ప్రహ్లాద" 1931లో వస్తే కాదు కాదు తెలుగు టాకీ వచ్చింది 1932లో. ఈ విషయం సినీచరిత్ర పరిశోధకుడు ప్రముఖ ఇండియా టుడే జర్నలిస్ట్ రెంటాల జయదేవ ఏళ్ల శ్రమకోర్చి సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఆయన పరిశోధనకు వి.ఏ.కె. వంటి పెద్దవారి ఆమోదమూ ప్రశంసా లభించింది. కనుక తొలి తెలుగు టాకీ 1932లోనే వచ్చింది. తెలుగు సినిమా తొలి పాటల పుస్తకం 1933లో వచ్చింది. అంటే తెలుగు సినిమా పాటల పుస్తకం ఎనభై యేళ్లకు చేరువగా ఉన్నదన్నమాట. ఆ రోజుల్లో విడుదలైన సినిమాతో పాటు, ఆ సినిమాల్లోని పాటలు, పద్యాలు టూకీగా ఆ సినిమా కథతో ఓ చిన్న పుస్తకాన్ని అచ్చువేసి ప్రేక్షకులకు అమ్మితే తమకు, ప్రేక్షకులకు ఉభయతారకంగా ఉంటుందనే ఊహ తట్టిన ఈస్టిండియా కంపెనీవారికి చాలామంది సినిమా చరిత్ర పరిశోధకులు జోహారులర్పించకుండా వుండలేరు. సి. పుల్లయ్య దర్శకత్వంలో 1933లో వచ్చిన “సతీసావిత్రి” తొలి తెలుగు సినిమా పాటల పుస్తకం. 18 సెం.మీ. పొడవు, 12 సెం.మీ. వెడల్పు వున్న ఈ పాటల పుస్తకం వెల ఒక కాని. అంటే సుమారు 2 పైసలు. ఇంటర్వెల్లో హాల్కు సంబంధించిన నౌకరు థియేటర్లో, బయట సోడా, టీలతో పాటు అమ్మేవాడు. ఈ తొలి ప్రయత్నానికి వచ్చిన స్పందనతో ఈ నిర్మాతలే 1934లో సి. పుల్లయ్యతోనే తీసిన “లవకుశ” సినిమా పాటల పుస్తకాన్ని రంగుల కవర్ పేజీ ఇంకాస్త పెద్ద సైజులో ఆకర్షణీయంగా ముద్రించారు. ఈ క్రమంలో చాలామంది ప్రేక్షకులు ఎగబడి కొన్నారు. తొలి తెలుగు, తమిళ టాకీగా చరిత్రకెక్కిన "కాళిదాస" (1931) సినిమా పాటల పుస్తకం అచ్చయింది. అలాగే "భక్త ప్రహ్లాద" దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి "కాళిదాస"కు పనిచేశాడు గనుక ఈ చిత్రానికి కూడా పాటల పుస్తకం వచ్చి ఉండాలని కొందరంటారు. అలాగైతే...............© 2017,www.logili.com All Rights Reserved.