తృప్తి... ఇదే నాకు మొదటి నవల. స్కూల్లో టీచర్ గా చేస్తున్నప్పుడు ఖాళీ పీరియడ్ లో సరదాగా రాసుకుంటూ మా ఫ్రెండ్ లలితకి చూపిస్తే, చతురకి ఇద్దామని పట్టుపట్టింది! నేనూ, లలితా, సుశీలా ముగ్గురం చతుర ఆఫీసుకెళ్ళాం. చతుర ఆఫీసులో నాగరత్న అనే అమ్మాయి మొదట పలకరించి చలసాని ప్రసాదరావు గారి దగ్గరకి పంపించింది. ఆయన నాతో సంభాషణ పేపర్ మీద రాసి చూపించి జవాబులు తెలుసుకున్నారు! స్పార్టకన్ చదివారా? అని అడిగారు.. రూట్స్ గురించి చెప్పారు! అదే సాహితీ ప్రపంచంతో మొదటి సంబంధం.. సాహితీ ప్రస్థానంలో మొదటి అడుగూ!
నోట్ బుక్ లో రెండు పక్కలా ఫెయిర్ చెయ్యకుండా రాసిన నా నవల ఓపిగ్గా చదివి ప్రచురించారు మహానుభావులు! అలా రచయిత్రి జన్మనిచ్చారు ప్రసాదరావు గారు. తృప్తిలో అంతా వర్కింగ్ ఉమెన్స్ ప్రాబ్లమ్స్. నర్మదా, కావేరీ, సింధూ అని నదుల పేర్లు పెట్టాను పాత్రలకి! 1994 జనవరి 1న చతురలో ప్రచురింపబడింది తృప్తి! ఇంతకాలానికి పుస్తకంగా వస్తోంది. చదివి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి.
తృప్తి... ఇదే నాకు మొదటి నవల. స్కూల్లో టీచర్ గా చేస్తున్నప్పుడు ఖాళీ పీరియడ్ లో సరదాగా రాసుకుంటూ మా ఫ్రెండ్ లలితకి చూపిస్తే, చతురకి ఇద్దామని పట్టుపట్టింది! నేనూ, లలితా, సుశీలా ముగ్గురం చతుర ఆఫీసుకెళ్ళాం. చతుర ఆఫీసులో నాగరత్న అనే అమ్మాయి మొదట పలకరించి చలసాని ప్రసాదరావు గారి దగ్గరకి పంపించింది. ఆయన నాతో సంభాషణ పేపర్ మీద రాసి చూపించి జవాబులు తెలుసుకున్నారు! స్పార్టకన్ చదివారా? అని అడిగారు.. రూట్స్ గురించి చెప్పారు! అదే సాహితీ ప్రపంచంతో మొదటి సంబంధం.. సాహితీ ప్రస్థానంలో మొదటి అడుగూ! నోట్ బుక్ లో రెండు పక్కలా ఫెయిర్ చెయ్యకుండా రాసిన నా నవల ఓపిగ్గా చదివి ప్రచురించారు మహానుభావులు! అలా రచయిత్రి జన్మనిచ్చారు ప్రసాదరావు గారు. తృప్తిలో అంతా వర్కింగ్ ఉమెన్స్ ప్రాబ్లమ్స్. నర్మదా, కావేరీ, సింధూ అని నదుల పేర్లు పెట్టాను పాత్రలకి! 1994 జనవరి 1న చతురలో ప్రచురింపబడింది తృప్తి! ఇంతకాలానికి పుస్తకంగా వస్తోంది. చదివి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి.© 2017,www.logili.com All Rights Reserved.